బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మేనేజర్ సతీష్ తన కంపెనీలోకి వచ్చాడని, అక్కడ రిజైన్ చేసినట్లు తర్వాత తెలిసిందని, పర్వాలేదా అని అడుగుతాడు రాహుల్. నీకు తెలిసిన తర్వాత అయిన రాజ్‌కు చెప్పాలిగా, నీకు తప్పనిపించలేదా సుభాష్, ప్రకాశం అంటారు.
పోటీలో వెనుకపడి ఉన్నాం

రాహుల్‌కు ఎక్స్‌పీరియెన్స్ తక్కువ, ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవాళ్లను తీసుకుంటే మంచిదనిపించింది. నేను కొత్త వాళ్లను అపాయింట్ చేసుకుంటాను అని రాజ్ అంటాడు. అన్నింటిని తేలిక తీసుకోవడం వల్లే మనం పోటీలో వెనుకపడుతున్నాం అని చెబుతాడు సుభాష్.
వంద కొత్త డిజైన్స్
మళ్లీ నెంబర్ వన్‌లో ఉండేందుకు అన్ని కొత్త డిజైన్స్ తయారు చేయిస్తున్నాం. న్యూ ఇయర్ లోపు వంద కొత్త డిజైన్స్ రిలీజ్ చేస్తాం అని కావ్య, రాజ్ చెబుతారు. ఆ మాటలు విన్న రాహుల్ ఇంత తక్కువ టైమ్‌లో ఎలా చేస్తారు. నిజంగా సాధ్యమవుతుందా అని అడుగుతాడు. వ్యాపారం అంటే అదే. పోటీని తట్టుకోవాలంటే చేయాలని రాజ్ అంటాడు.
రాజ్ డిజైన్స్ ఐడియా
రాజ్ మీరేదైనా చేయండి. కానీ, అందరిని నమ్మకుండా చేయండి అని సుభాష్ అంటాడు. తర్వాత కావ్య డిజైన్స్ వేయడానికి కూర్చొంటుంది. ఎలా డిజైన్స్ వేయాలో చెప్పండని రాజ్‌ను అడుగుతుంది కావ్య. రాజ్ డిజైన్స్ ఐడియా చెబుతాడు. ఆ మాటలు రాహుల్ వెంటాడు. ఇద్దరి దగ్గరికి రాహుల్ వచ్చి మాటలు కలుపుతాడు.
నా బిజినెస్ ఐడియాలు చెప్పను
ఇప్పుడు మీ బిజినెస్ నీది నా బిజినెస్ నాది. సలహా ఇస్తాను కానీ నా బిజినెస్ ఐడియాలు చెప్పను అని రాజ్ అంటాడు. రాహుల్ మన ఐడియాస్‌ను వినేందుకు వచ్చినట్లున్నాడని కావ్య అంటుంది. నన్ను అంత రైవల్రీగా అప్పుడే చూస్తున్నారు అన్నట్లు సరే ఇద్దరిని పొగిడి వెళ్లిపోతాడు రాహుల్.
మీ కష్టాన్ని నేను దోచుకుంటాను
వెయ్యండి వెయ్యండి. మీరు కష్టపడే ప్రతి డిజైన్‌ను, కష్టాన్ని నేను వాడుకుంటాను అని రాహుల్ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం పాప తండ్రి అశోక్ వచ్చాడని అప్పుకు కానిస్టేబుల్ కాల్ చేసి చెబుతాడు. వస్తున్నానని అప్పు చెబుతుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు కల్యాణ్‌ను దువ్వుతుంది అప్పు. ధాన్యలక్ష్మీకి ఏం అబద్ధం చెప్పాలో ఆలోచిస్తారు ఇద్దరు.
కల్యాణ్, అప్పు మరో అబద్ధం
{{/usCountry}}వెయ్యండి వెయ్యండి. మీరు కష్టపడే ప్రతి డిజైన్‌ను, కష్టాన్ని నేను వాడుకుంటాను అని రాహుల్ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం పాప తండ్రి అశోక్ వచ్చాడని అప్పుకు కానిస్టేబుల్ కాల్ చేసి చెబుతాడు. వస్తున్నానని అప్పు చెబుతుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు కల్యాణ్‌ను దువ్వుతుంది అప్పు. ధాన్యలక్ష్మీకి ఏం అబద్ధం చెప్పాలో ఆలోచిస్తారు ఇద్దరు.
కల్యాణ్, అప్పు మరో అబద్ధం
{{/usCountry}}డాక్టర్ చెకప్‌కు మళ్లీ రమ్మన్నారని చెప్పి వెళ్దామని కల్యాణ్ అంటాడు. వెళ్లేందుకు రాహుల్ వస్తాడు. ఆ వెంటే రాజ్, కావ్య వస్తాడు. కావ్య వద్దన్న పనిచేస్తుందని రాజ్ అబద్ధాలు చెబుతాడు. తర్వాత అంతా కావ్యను మెచ్చుకుంటారు. గుడికి వెళ్లి అటు నుంచి ఆఫీస్‌కు వెళ్తామని కావ్య అంటుంది. రాజ్, కావ్య, రాహుల్ వెళ్లిపోతారు.
పోలీస్ స్టేషన్‌కు అప్పు
ఇంతలో కల్యాణ్, అప్పు వస్తారు. హాస్పిటల్‌కు వెళ్తున్నామని కల్యాణ్ చెబితే ధాన్యలక్ష్మి కంగారుపడుతుంది. జెనరల్ చెకప్ అని కల్యాణ్ అంటాడు. మరి పాత రిపోర్ట్స్ ఏవి అని ధాన్యం అడిగితే.. కారులో ముందే పెట్టానంటాడు కల్యాణ్. దాంతో ధాన్యం ఒప్పుకుంటుంది. అప్పు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది.
ఫీల్ అయిన రాజ్
మరోవైపు కావ్యను పంతులు పలకరిస్తాడు. తనను పంతులు పట్టించుకోవట్లేదని రాజ్ ఫీల్ అవుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.