బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పరోటా కాల్చే వ్యక్తి దగ్గరికి వెళ్లిన రాహుల్ యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానంటాడు. ఒక ఫ్యామిలీ దగ్గర ఆర్ట్ డైరెక్టర్ మణి వర్మగా నటించాలని రాహుల్ చెబుతాడు. నేషనల్ అవార్డ్ లెవెల్‌లో ఇరగదీస్తానంటాడు పరాట కాల్చే వ్యక్తి. మణి వర్మకు పది వేలు అడ్వాన్స్ ఇచ్చి పని పూర్తి అయ్యాక 50 వేలు ఇస్తానంటాడు.
ఇందిరాదేవి యాడ్ షూటింగ్

దాంతో మణి వర్మ సంతోషంగా వెళ్లిపోతాడు. డైరెక్టర్స్‌ను సప్లై చేసే వ్యక్తికి కాల్ చేసి రాజ్ దగ్గరికి తాను చెప్పిన మణి వర్మను డైరెక్టర్‌గా పంపాలని, అందుకు పాతికవేలు ఇస్తానంటాడు. దాంతో అతను ఒప్పుకుంటాడు. మరోవైపు కావ్యను మోడలింగ్ చేయమని రాజ్ బతిమిలాడుతాడు. జ్యూవెలరీ యాడ్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. నన్ను వాడుకోరా అని ఇందిరాదేవి అంటుంది.
సీతారామయ్యతో కలిసి బంగారు గాజుల జ్యూవెలరీ యాడ్ చేస్తుంది ఇందిరాదేవి. ఇది చూసిన రాజ్ ఇలా షాక్ ఇచ్చావేంటే అంటాడు. మీది ఓల్డ్ ప్యాషన్ అత్తయ్య మా యాడ్ షూట్ చూడండి అని అపర్ణ, సుభాష్ కలిసి యాడ్ చేస్తారు. మమ్మీ ఇలా బెదరగొడుతున్నారేంటే అని భయపడుతాడు. ప్రకాశం కూడా వచ్చి కాన్సెప్ట్ చెబుతానని మర్చిపోతాడు.
ఒక్కొక్కరు కాన్సెప్ట్‌తో నా మీద దండోరా చేస్తున్నారు అని కావ్యతో అంటాడు రాజ్. సరే నేను ఒప్పుకుంటాను కానీ మన ఫ్యామిలీ అంతా కలిసి చేస్తేనే నటిస్తానని కావ్య అంటుంది. అందరు ఒప్పుకున్నట్లేగా అని రాజ్ అడిగితే.. ఒప్పుకోమని రివర్స్ అవుతారు. దాంతో గతిలేక అందరి నటనను మెచ్చుకుంటాడు రాజ్. తర్వాత అంతా ఓకే అంటారు.
చీప్ లొకేషన్‌లో చేయలేదు
ఇంతలో డైరెక్టర్‌గా మణివర్మ ఎంట్రీ ఇస్తాడు. హడావిడి చేస్తాడు. ఇలాంటి చీప్ లొకేషన్‌లో షూట్ చేయడం ఇదే తొలిసారి అంటాడు. యాడ్ షూట్ కాన్సెప్ట్ అని పోకిరి సీన్ చెబుతాడు డైరెక్టర్ మణివర్మ. ఫ్యామిలీ కాన్సెప్ట్ అని చెప్పి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కాన్సెప్ట్ చెబుతాడు. బంగారం అంటే అమ్ముకోవడం తాకట్టుపెట్టుకోవడమేనా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బంగారం అంటే ఎమోషన్ అని గొప్పగా చెబుతుంది కావ్య.
{{/usCountry}}ఇంతలో డైరెక్టర్‌గా మణివర్మ ఎంట్రీ ఇస్తాడు. హడావిడి చేస్తాడు. ఇలాంటి చీప్ లొకేషన్‌లో షూట్ చేయడం ఇదే తొలిసారి అంటాడు. యాడ్ షూట్ కాన్సెప్ట్ అని పోకిరి సీన్ చెబుతాడు డైరెక్టర్ మణివర్మ. ఫ్యామిలీ కాన్సెప్ట్ అని చెప్పి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కాన్సెప్ట్ చెబుతాడు. బంగారం అంటే అమ్ముకోవడం తాకట్టుపెట్టుకోవడమేనా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బంగారం అంటే ఎమోషన్ అని గొప్పగా చెబుతుంది కావ్య.
{{/usCountry}}ఆ కాన్సెప్ట్ కూడా నువ్వే ఆలోచించి చెప్పు అని అంతా అంటారు. ఒక కుటుంబంలో అమ్మమ్మలు, తాతయ్యల నుంచి అన్ని తరాల వారికి జ్యూవెలరీని బహుమతిగా ఇస్తూ సంతోషాన్ని ఎలా రెట్టింపు చేసుకుంటున్నారో చూపించాలి. వేడుక ఏదైనా, బంధాలు ఏదైనా మీ ఆనందాలనే కాదు మీ బంధాలని రెట్టింపు చేస్తుంది మీ స్వరాజ్ జ్యూవెలర్స్ అని కావ్య చెబుతుంది.
అంతా చప్పట్లు కొడతారు. యావరేజ్‌గా ఉందని మణి వర్మ చెబుతాడు. అంతా మరి మోడల్ ఎక్కడ అని మణి వర్మ అడిగితే.. ఇక్కడ అని రాజ్ చూపిస్తాడు. అప్పుడే కావ్య కిందకు వంగుతుంది. పక్కన ఉన్న పనిమనిషిని మోడల్ అనుకుంటాడు డైరెక్టర్. ఇలాంటి మోడల్‌ను నేను ఎప్పుడు చూడలేదు అంటూ పని మనిషి దగ్గరికి వెళ్లి గొప్పగా చెబుతాడు.
పని మనిషి మోడల్
మోడల్‌కు పర్‌ఫెక్ట్ అని డైరెక్టర్ అంటాడు. మీరు నిజంగా డైరెక్టరేనా. పని మనిషిని పట్టుకుని మోడల్ అంటున్నారు అనేసరికి కవర్ చేస్తాడు డైరెక్టర్ మణి వర్మ. తర్వాత షూటింగ్ మొదలుపెడతారు. ఇంతలో మణి వర్మ కిచెన్‌లోకి వెళ్లి పరాటాలను కాలుస్తూ ఉంటాడు.
అది చూసి పరాట మాస్టర్ అని ప్రకాశం అంటాడు. దాంతో మణి వర్మ డైరెక్టర్ కాదని తేలిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.