బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పాప మిస్సింగ్ ఫైల్ కేస్ స్టడీ చేస్తుంది అప్పు. పాప పోస్ట్‌మార్టమ్ గురించి కానిస్టేబుల్‌ను అడుగుతుంది అప్పు. అతను ఫొటో తీసి పంపిస్తానని చెబుతాడు. ఇంతలో కల్యాణ్ వచ్చి ఇలా లేట్ నైట్ పని చేస్తే ఎలా అని అంటాడు.
కేసు ఫైల్స్ చూసిన ధాన్యలక్ష్మీ

ఇంతలో ప్రకాశం వచ్చి ప్రొడ్యూసర్ నీకు కాల్ చేస్తే కలవట్లేదని నాకు కాల్ చేశాడు. వెంటనే కాల్ చేయు. అయినా పోలీస్, ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. ఈ ఫైల్స్ ఏంటీ అని అడుగుతాడు. దాంతో కల్యాణ్, అప్పు ఇద్దరు కంగారుపడతారు. ఇంతలో పాలు తీసుకొచ్చిన ధాన్యలక్ష్మీ కూడా ఈ ఫైల్స్ ఏంటనీ అడుగుతుంది.
ఇదంతా నా సినిమా స్టోరీ కోసం. అందుకే ఈ ఫైల్స్ అన్ని స్టడీ చేస్తున్నా. దానికి అప్పు హెల్ప్ చేస్తుంది అని కల్యాణ్ చెబుతాడు. స్టోరీ ఏంట్రా అని ప్రకాశం అడిగితే.. అప్పు స్టోరీనే చెబుతాడు కల్యాణ్. ఇంట్లో వాళ్లను మోసం చేసి కేసు స్టడీ చేయడం ఏంటీ. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఇలాంటి చెత్త సినిమాలకు నువ్వు పాటలు రాయకు. డైరెక్టర్ను పిలు ఫ్యామిలీకి పనికి వచ్చే సినిమాలు ఏంటో చెబుతా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
మారిపోయిన అప్పు
ప్రకాశం, ధాన్యం ఇద్దరు వెళ్లిపోతారు. సినిమా గురించి తెలిసే అత్తయ్య ఇలా అంటే నేను చేసేది తెలిస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుందో అని అప్పు అంటుంది. ఎంత మారిపోయావ్ అప్పు అని కల్యాణ్ నవ్వుతాడు. సతీష్‌కు కాల్ చేసి కావ్య వేసిన డిజైన్స్ నువ్వు తీసుకొచ్చేసే టైమ్ వచ్చింది. నీ మనుషులతో స్వరాజ్ గ్రూప్‌లో ఉన్న మనుషులతో మాట్లాడి ఆ డిజైన్స్ తీసుకురా. రాజ్ ఊరిలో ఉండట్లేదు అని రాహుల్ చెబుతాడు.
ఆ మాటలు విన్న రుద్రాణి ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది. రాహుల్ ప్లాన్ గురించి చెబుతాడు. ఆ డిజైన్స్ కావ్య నుంచి కాపీ కొట్టలేదు. నేనే కష్టపడి వేశానని స్వప్నను నమ్మిస్తే అందరి సంగతి తనే చూసుకుంటుంది. క్లైంట్స్ కూడా నేనే వేశాననుకుంటారు అని రాహుల్ అంటాడు. రాహుల్ నీ చేతిలో ఆఫీస్ పెట్టి వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడు అని రుద్రాణి అంటుంది.
రేణుకకు కనిపించిన పాప
{{/usCountry}}ఆ మాటలు విన్న రుద్రాణి ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది. రాహుల్ ప్లాన్ గురించి చెబుతాడు. ఆ డిజైన్స్ కావ్య నుంచి కాపీ కొట్టలేదు. నేనే కష్టపడి వేశానని స్వప్నను నమ్మిస్తే అందరి సంగతి తనే చూసుకుంటుంది. క్లైంట్స్ కూడా నేనే వేశాననుకుంటారు అని రాహుల్ అంటాడు. రాహుల్ నీ చేతిలో ఆఫీస్ పెట్టి వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడు అని రుద్రాణి అంటుంది.
రేణుకకు కనిపించిన పాప
{{/usCountry}}మరోవైపు వేరే వాళ్ల పాపను చూసి తన పాప సిరి అనుకుని ముద్దులు పెడుతూ ఏడుస్తుంది. రేణుక ప్రవర్తన చూసి పిల్లలు భయపడి ఏడుస్తుంటారు. పిల్లల తల్లిదండ్రులు వచ్చి తిట్టి వెళ్లిపోతారు. అప్పుకు కాల్ చేసి నా పాపను కళ్లముందు చూశాను. కానీ, వెళ్లేసరికి లేదు అని రేణుక చెబుతుంది. దాంతో కంగారుగా అప్పు వెళ్లాలనుకుంటుంది. కల్యాణ్ అమ్మ ఉందని ఆపుతాడు.
రాజ్, కావ్య కేరళ వెళ్తున్నట్లు చెబుతారు. కావ్య అదోలా ఉండటంతో అపర్ణ అడుగుతుంది. దాంతో అపర్ణను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. ఏమైందని ఇందిరాదేవి అడుగుతుంది. మీరు నిజంగానే సరదాగా టూర్‌కు వెళ్తున్నారా. ఇంకా వేరే ఏదైనా పని మీద వెళ్తున్నారా. అంతా తేడాగా ఉంది. కావ్య మళ్లీ ఇంటికి రాదు అన్నట్లుగా ఫీల్ అవుతుందేంటీ అని రుద్రాణి అడుగుతుంది.
కావ్యకు కషాయం ట్రీట్‌మెంట్
ధాన్యలక్ష్మీ, ఇందిరాదేవి వారిస్తారు. ఇంతలో కల్యాణ్ వచ్చి రాజ్, కావ్యను ఎయిర్ పోర్ట్‌లో డ్రాప్ చేస్తానని చెబుతాడు. ముందు ఒప్పుకోని ధాన్యలక్ష్మీ తర్వాత ఒప్పుకుంటుంది. వీళ్ల టూర్‌లో ఏదో తిరకాసు ఉందని రాహుల్‌తో రుద్రాణి డౌట్ పడుతుంది. బయటకొచ్చాక మీరే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లండి అని కల్యాణ్ అంటాడు. దానికి అంత బిల్డప్ ఎందుకురా అని రాజ్ అంటాడు.
అప్పును బయటకు తీసుకెళ్లేందుకు కల్యాణ్ మనల్ని వాడుకున్నాడని కావ్య చెబుతుంది. అప్పు, కల్యాణ్ వెళ్లిపోతారు. ఇప్పటికీ ఇంట్లోవాళ్లకు చాలా అబద్ధాలు చెప్పాం. ఇంకో అబద్ధం చెప్పే అవసరం రాదని రాజ్ అంటాడు. ఇద్దరు కేరళ వెళ్తారు. అక్కడ గురూజీ రోజు కషాయం తాగమని ఇస్తాడు. అది తాగనని కావ్య మారం చేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.