బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మంత్రి ధర్మేంద్రను తన గురించి నిజం చెప్పొద్దని వేడుకుంటుంది రుద్రాణి. ఇంతలో అక్కడికి అప్పు, కల్యాణ్ వస్తారు. దాంతో రుద్రాణి వెళ్లి దాక్కుంటుంది. కావ్య, రాజ్ తన అక్క, బావలు అని అప్పు పరిచయం చేసుకుని మంత్రితో మాట్లాడుతుంది.
పాపం చేస్తున్నా అని

కన్న బిడ్డను చంపాలని రౌడీలను పంపిన మీరే వెంటనే మనసు ఎందుకు మార్చుకున్నారని అని అప్పు అడుగుతుంది. నేనే పాపం చేస్తున్నా అని రియలైజ్ అయ్యాను. అందుకే వద్దనుకున్నాను అని మంత్రి చెబుతాడు. మీ పాపకు ఆరోగ్యం బాలేకపోతే ఇంత పెద్ద పలుకుబడి ఉండి ఆపరేషన్ చేయించే ఛాన్స్ ఉంది. కానీ, బిడ్డలను మార్చాలని ఎందుకు అనుకున్నారు. అది మీకు వచ్చిన ఆలోచనేనా అని అప్పు అడుగుతుంది.
దానికి కూడా తనకే వచ్చిన ఆలోచన అని, ఆ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అని, తర్వాత రాజ్, కావ్యలను చూసి తప్పు చేశానని, అదంతా తన భార్య కోసం మాత్రమే చేశానని ధర్మేంద్ర చెబుతాడు. మీ భార్య మీద ప్రేమతో ఇదంతా చేసిన మీరు కన్న బిడ్డను చంపాలనుకున్నారంటే నమ్మలేకపోతున్నాను అని అప్పు అంటుంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని రుద్రాణి పేరు చెప్పకుండా తన మీద నిందలన్నీ వేసుకుంటాడు మంత్రి ధర్మేంద్ర.
దాంతో అప్పు, కల్యాణ్ వెళ్లిపోతారు. రుద్రాణి కూడా తన పేరు చెప్పనందుకు థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది. కానీ, కారు అద్దంలో గేట్ నుంచి రుద్రాణి రావడం అప్పు చూస్తుంది. ఆ విషయం కల్యాణ్‍కు చెబుతుంది అప్పు. రుద్రాణి కారును కల్యాణ్, అప్పు ఫాలో అవుతారు. మరోవైపు రాజ్ అందరిని రమ్మన్నాడని ఇంటి హాల్లో కూర్చొంటారు.
50 శాతం కార్పస్ ఫండ్
రాజ్, కావ్య వస్తారు. మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేందుకు ఎంతోమంది కార్మికులు సహాయపడ్డారు. అలాంటి వాళ్లను ఆపదలో మనమే ఆదుకోవాలి. మన వెనుక ఉండి మనల్ని నడిపించిన సొసైటీకి ఏదైనా చేద్దామని కావ్య చెప్పింది. నేను కూడా ఓకే అన్నాను అని రాజ్ అంటాడు. మీరందరు అనుమతిస్తే ఇదంతా చేయాలనుకుంటున్నాం అని కావ్య అంటుంది.
{{/usCountry}}రాజ్, కావ్య వస్తారు. మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేందుకు ఎంతోమంది కార్మికులు సహాయపడ్డారు. అలాంటి వాళ్లను ఆపదలో మనమే ఆదుకోవాలి. మన వెనుక ఉండి మనల్ని నడిపించిన సొసైటీకి ఏదైనా చేద్దామని కావ్య చెప్పింది. నేను కూడా ఓకే అన్నాను అని రాజ్ అంటాడు. మీరందరు అనుమతిస్తే ఇదంతా చేయాలనుకుంటున్నాం అని కావ్య అంటుంది.
{{/usCountry}}కానీ, దానికి బాగా ఖర్చు అవుతుందని ప్రకాశం అంటాడు. అందుకే దానికి ఓ వ్యవస్థ కావాలి. అదే దుగ్గిరాల ఛారిటబుల్ ట్రస్ట్. త్వరలోనే మనం ఈ సమాజం కోసం ఓ ట్రస్ట్ ప్రారంభిద్దామనుకుంటున్నాం అని కావ్య అంటుంది. ఈ ఆలోచనను నేను ఆచరణలో పెట్టలేకపోయాను. నా కలను నెరవెరాలనుకుంటున్న మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉందని సీతారామయ్య ఒప్పుకుంటాడు.
ఐడియా బాగుంది కానీ ఎలా అమలు చేయడం అని సుభాష్, ప్రకాశం అంటారు. ఎక్కడ లోటు రాకుండా మన ప్రాపర్టీలోని 50 శాతం కార్పస్ ఫండ్ కింద పెడదాం అని రాజ్ అంటాడు. దానికి డైరెక్టర్స్‌ను పెడదాం. అందుకు మన ఇంటి నుంచి ఇద్దరు ఉంటారు అని రాజ్ అంటాడు. దానికి, రేఖ, ధాన్యలక్ష్మీ షాక్ అవుతారు. మరి ట్రస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావని ఇందిరాదేవి అడుగుతుంది.
ఒప్పుకోని ధాన్యలక్ష్మీ
మీరంతా ఒప్పుకున్నారు. త్వరలో పూజ చేద్దామని రాజ్ అంటాడు. అందరూ ఒప్పుకోలేదని ధాన్యలక్ష్మీ అంటుంది. నాకు మాత్రం నచ్చలేదంటున్నాను అంటుంది. వాళ్ల ఆలోచన, మావయ్య కల అంటున్నారు. ఇంకేంటని అపర్ణ అంటుంది. ఇదంతా ఉమ్మడి ఆస్తి, ఎవరి ఆస్తి ఎవరికి ఇస్తున్నారు, ఆస్తిని కరిగిస్తానంటే ఒప్పుకోను అని ధాన్యలక్ష్మీ అంటుంది.
అందరి ఆస్తి అంటే నా కొడుకుకు సగం ఉన్నట్లేగా. నా కొడుకుకు అన్యాయం జరుగుతుంది. ఉన్న ఆస్తి అంతా కావ్య పేరు మీదే ఉంది. అందులో సగం ట్రస్ట్‌కి ఇస్తారు. ఇక మిగిలింది అంతా కావ్యకే కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అంటే, రాజ్, కావ్య ద్రోహం చేస్తారనుకుంటున్నావా అని సుభాష్ అడుగుతాడు.
ఏమో. ఇప్పుడు అందరు మంచివాళ్లే. రేపు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా బయటకు పోకూడదు అని రాజ్, కావ్యపై డౌట్ పడుతుంది ధాన్యలక్ష్మీ. ఆ గొడవతో ఆస్తిలో సగం ట్రస్ట్‌కు తన పేరు మీదున్న ఆస్తిని కల్యాణ్ పేరు మీద రాయిద్దామని కావ్య అంటుంది. దానికి రాజ్ సరేనంటాడు.
అప్పుపై అటాక్ కిడ్నాప్
మరోవైపు అప్పు తన గురించి ఆలోచిస్తుందని అటాక్ చేయిస్తానంటుంది రుద్రాణి. అప్పును అటాక్ చేయించి నా గురించి ఆలోచించకుండా చేస్తాను. దాన్ని కిడ్నాప్ చేసి అదంతా రాజ్ చేయించాడని ధాన్యలక్ష్మీ నమ్మేలా చేస్తాను అని రుద్రాణి అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.