బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పాప ఏడుస్తుంటే నన్ను పాలు పట్టమంటారా అని కావ్య అంటుంది. మీకు అభ్యంతరం లేకుంటేనే అని కావ్య అంటుంది. పాప ఆకలి తీర్చడానికి అలా అంటున్నారని తెలుసు. కానీ, వేరే వాళ్ల పాలు ఇవ్వొచ్చా అని తులసి అంటుంటే.. సమస్య ఏముండదు అని డాక్టర్ అంటుంది. దాంతో తులసి ఒప్పుకుంటుంది.
కన్నబిడ్డను ఆడించిన తులసి

తన సొంత బిడ్డను తీసుకుని వేరే గదిలోకి వెళ్లి పాలు ఇస్తుంది కావ్య. రాజ్ నుంచి తన కన్నబిడ్డను తీసుకుని ఆడిస్తుంది తులసి. ఈ సీన్ అంతా ఎమోషనల్‌గా సాగుతుంది. కావ్య తన పాలకు ఇస్తూ మురిసిపోతూనే బాధపడుతుంది. తర్వాత రాజ్ చెప్పడంతో పాపను తీసుకొచ్చి తులసికి ఇస్తుంది కావ్య. మీ వల్లే పాప కడుపు నిండింది అని థ్యాంక్స్ చెబుతుంది తులసి.
కావ్య చాలా కష్టంగా పాపను ఇస్తుంది. నాకోసం ఇంత చేసిన మీకు ఏదైనా చేయాలని ఉందని, ఓసారి మా ఇంటికి రండి. మా వారితో మాట్లాడండి. మీ సమస్యే ఇట్టే తీరిపోతుంది అని తులసి అంటుంది. సరేనని రాజ్, కావ్య అంటారు. కావ్య బాధపడుతుంటే రాజ్ ఓదారుస్తాడు. మన పాప త్వరలోనే మన దగ్గరికి వస్తుంది అని జరుగుతున్న సంఘటనల గురించి చెబుతాడు రాజ్.
మరోవైపు పాప జాతకం చెప్పమని పంతులుతో మాట్లాడుతారు దుగ్గిరాల ఇంటివాళ్లు. పాప పుట్టిన తేది, టైమ్ అడిగిన పంతులు జాతకం చూస్తాడు. పాప జీవితం చాలా దివ్యంగా ఉంది. కానీ, కొన్ని అడ్డంకులు గోచరిస్తున్నాయి. అవన్నీ దాటేస్తుంది. అనుకుంది సాధిస్తుంది. మహారాణి జాతకం అని పంతులు అంటాడు. పాప ఆరోగ్య లోపం గురించి అడుగుతారు.
పాప ఆయుష్షు గట్టిది
పంచాంగంలో అలాంటి లోపం చూపించట్లేదు. పాప తల్లిదండ్రులను బట్టి పాప ఆయుష్షు చాలా గట్టిగా ఉంది. నిండు నూరేళ్లు సుఖంగా ఉంటుంది అని పంతులు చెబుతాడు. బారసాలకు ముహుర్తం పెట్టమంటారు. రేఖ వచ్చి ఏంటని అడుగుతుంది. బారసాల అని చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. కావ్య ఉన్న పరిస్థితిలో ఇదంతా అవసరమా, కావ్య ఒప్పుకోదని రేఖ అంటుంది.
{{/usCountry}}పంచాంగంలో అలాంటి లోపం చూపించట్లేదు. పాప తల్లిదండ్రులను బట్టి పాప ఆయుష్షు చాలా గట్టిగా ఉంది. నిండు నూరేళ్లు సుఖంగా ఉంటుంది అని పంతులు చెబుతాడు. బారసాలకు ముహుర్తం పెట్టమంటారు. రేఖ వచ్చి ఏంటని అడుగుతుంది. బారసాల అని చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. కావ్య ఉన్న పరిస్థితిలో ఇదంతా అవసరమా, కావ్య ఒప్పుకోదని రేఖ అంటుంది.
{{/usCountry}}ప్రతిదాంట్లో మీ అమ్మ అడ్డుపుల్ల వేసేది. ఇప్పుడు నువ్వు తయారయ్యావా అని ఇందిరాదేవి అంటుంది. కావ్య ఇప్పుడు నువ్వు అనుకున్నట్లు లేదు. పాప ఆలన పాలన చూసుకుంటుంది అని అపర్ణ చెబుతుంది. మరోవైపు రుద్రాణితో కావ్య గురించి మంత్రి ధర్మేంద్ర మాట్లాడుతుంటాడు. ఇంతలో రాజ్, కావ్య వస్తారు. వాళ్లిద్దరిని చూసి రుద్రాణి, ధర్మేంద్ర షాక్ అవుతారు.
దాని మొగుడు దాన్ని నమ్మడు అని చెప్పావ్. ఇప్పుడు వాళ్లిద్దరే వచ్చారని రుద్రాణి మీద కోప్పడుతాడు మంత్రి. నమస్తే మినిస్టర్ గారు అని రాజ్ సెటైర్లు వేస్తాడు. మంది కొంపలు ముంచేవారు బాగానే ఉంటారని కావ్య కౌంటర్లు వేస్తుంది. లోపల భయం ఉందని రాజ్ అంటాడు. కావ్య చెప్పింది నమ్మలేనందుకు నా అంత పిచ్చోడు లేననుకున్నాను. తన ప్రేమ నన్ను మార్చిందని రాజ్ అంటాడు.
మేడమ్‌కి మాటిచ్చారా
నా బిడ్డను తీసుకెళ్తారా. నేను ఎంతకు తెగించగలనో మీకు తెలియదు అని అరుస్తాడు మంత్రి ధర్మేంద్ర. ఇంతలో తులసి వస్తుంది. మా వారు ఏదో తెలియజేస్తాను అంటున్నారని తులసి అంటే.. కావ్య పాప గురించి అని కవర్ చేస్తుంది. కావ్య పాపను వెతికి పెట్టాల్సిందే, ఆ దుర్మార్గులకు శిక్ష పడేలా చేయాల్సిందే అని తులసి అంటుంది.
పాప ఏడుస్తుంటే పాప పాలు పట్టి ఆకలి తీర్చిందని హాస్పిటల్‌లో జరిగింది చెబుతుంది తులసి. దాంతో ధర్మేంద్ర షాక్ అవుతాడు. వాళ్ల పాపను వెతికే వరకు ఇంకో పని పెట్టుకోవద్దు అని తులసి అంటే.. ఓకే అని ధర్మేంద్ర అంటాడు. మా పాపను మాకు ఇస్తానని మేడమ్‌కు మాటిచ్చారా సర్ అని రాజ్ వెటకారంగా అంటాడు.
ఇంట్లోవాళ్లకు యాక్సిడెంట్
పాపకు జలుబు చేస్తుంది. వెళ్లమని తులసిని అంటాడు ధర్మేంద్ర. తర్వాత రాజ్ వాళ్ల బలహీనతలపై కొట్టాలని, అది వాళ్ల ఫ్యామిలీ అని రుద్రాణి చెబుతుంది. దాంతో సీతారామయ్య-ఇందిరాదేవి, సుభాష్-అపర్ణలకు యాక్సిడెంట్ చేయిస్తాడు ధర్మేంద్ర. ఆ విషయం తెలిసి రాజ్ కుప్పకూలిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.