బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య చెప్పినదాంట్లో నిజం లేదని మనమెందుకు ఆలోచించకూడదు అని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. నాకు కూడా కళావతి మాటల్లో నిజమనిపిస్తుంది, కానీ, ఆ పాప మన పాప కాదని చెప్పడానికి ఏదో ఒక సాక్ష్యం ఉండాలిగా డాక్టర్స్‌ని అడిగితే ఒప్పుకోరు, ఈ సమస్య చాలా పెద్దది అని రాజ్ అంటాడు.
రెండు లాభాలు

చట్ట ప్రకారం వెళ్దాం బావ. డీఎన్‌ఏ టెస్ట్ చేపిద్దాం. కోర్టులో వేసిన డీఎన్‌ఏ టెస్ట్ గురించి అడుగుతారు. దాని వల్ల రెండు లాభాలు. మ్యాచ్ అయితే కోర్టులో కేసు వేయొచ్చు, మ్యాచ్ అయితే అక్కే నమ్ముతుంది అని అప్పు అంటుంది. దానికి సరే అని రాజ్ అంటాడు. డీఎన్‌ఏ టెస్ట్‌కు ఒప్పించడానికి కావ్య దగ్గరికి వెళ్తాడు రాజ్.
నువ్వు చెప్పింది నిజమనిపిస్తుంది, నీ మాటల్లో నిజమనిపిస్తుందని, డీన్‌ఏ టెస్ట్ చేపిద్దాం, దాని ద్వారా ఈ పాప మన బిడ్డ కాదో తేలుతుంది అని చెబుతాడు రాజ్. నిజనిజాలు నిగ్గు తేల్చాలని అనుకుంటున్నా అని రాజ్ అంటాడు. దానికి సరేనంటుంది కావ్య. మరోవైపు డీఎన్‌ఏ టెస్ట్ గురించి మంత్రి ధర్మేంద్రకు రుద్రాణి చెబుతుంది.
జైల్లో కూర్చోవాలి
ఒకవేళ అదే జరిగితే మీ హాస్పిటల్‌లో తప్పు జరిగిందని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ మన దాకా వస్తారు. అప్పుడు మనం జైల్లో కూర్చోవాలి అని రుద్రాణి అంటుంది. అక్కడి వరకు రాదు. కోర్టులు, జైళ్లు నేను మ్యానేజ్ చేస్తాను అని ధర్మేంద్ర అంటాడు. మరి నీ భార్య సంగతి ఏం చేస్తారు. ఇదంతా తెలిస్తే నీ భార్య ఊరుకుంటుందా. కాబట్టి వాళ్లను ఆపాలి. ఏదో ఒకటి చేసి వాళ్లను ఆపండి అని మంత్రిని ఏదోటి చేసేందుకు ఉసిగొల్పుతుంది రుద్రాణి.
మరోవైపు డాక్టర్ డీఎన్ఏ టెస్ట్ కోసం పాపది, కావ్యది శాంపిల్స్ తీసుకుంటాడు. 24 గంటల్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్పి వెళ్లిపోతాడు డాక్టర్. రేపు వచ్చే డీఎన్ఏ రిపోర్ట్స్‌కు నేను కట్టుబడి ఉంటాను, నువ్వు కట్టుబడి ఉంటావా అని రాజ్ అడుగుతాడు. కచ్చితంగా నా నమ్మకమే నిజం అవుతుందని కావ్య అంటుంది. మ్యాచ్ అవ్వకపోతే మన బిడ్డ ఎక్కడున్నా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను అని రాజ్ అంటాడు.
అనుమానాన్ని చెరిపేయాలి
{{/usCountry}}మరోవైపు డాక్టర్ డీఎన్ఏ టెస్ట్ కోసం పాపది, కావ్యది శాంపిల్స్ తీసుకుంటాడు. 24 గంటల్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్పి వెళ్లిపోతాడు డాక్టర్. రేపు వచ్చే డీఎన్ఏ రిపోర్ట్స్‌కు నేను కట్టుబడి ఉంటాను, నువ్వు కట్టుబడి ఉంటావా అని రాజ్ అడుగుతాడు. కచ్చితంగా నా నమ్మకమే నిజం అవుతుందని కావ్య అంటుంది. మ్యాచ్ అవ్వకపోతే మన బిడ్డ ఎక్కడున్నా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను అని రాజ్ అంటాడు.
అనుమానాన్ని చెరిపేయాలి
{{/usCountry}}ఒకవేళ డీఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయితే నీలో మొదలైన అనుమానాన్ని చెరిపేయాలని. ఈ పాపను ప్రేమించే మంచి తల్లిగా నడవాలి అని రాజ్ అంటాడు. నేను నమ్మినట్లే రిపోర్ట్స్ వస్తాయని కావ్య అంటుంది. మరోవైపు అపర్ణ ఏడుస్తుంటుంది. సుభాష్ వెళ్లి ఓదారుస్తాడు. ఆ పిచ్చిదానికి దేవుడు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడంటూ దేవుడిని నిందిస్తుంది.
మన సంతోషం, బాధ రేపు వచ్చే డీఎన్ఏ రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉందని అపర్ణ అంటుంది. మరుసటి రోజు ఉదయం అంతా డీఎన్ఏ రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అంతా టెన్షన్ పడుతుంటే కావ్య మాత్రం తను అనుకున్నట్లుగా వస్తాయంటుంది. ఇంతలో రాజ్‌కు డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్ట్స్ గురించి మేసెజ్ వస్తుంది.
షాక్ అయిన రాజ్
డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ చూసి రాజ్ షాక్ అవుతాడు. ఏమని వచ్చాయని ఇంటిల్లిపాది అడుగుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.