బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మంత్రి ధర్మేంద్ర ఇంటికి తనను రమ్మని రాజ్‌కు చెబుతుంది కావ్య. దాంతో రాజ్ సరేనంటాడు. మరోవైపు తులసితో ధర్మేంద్ర మాట్లాడుతాడు. నా గురించి కాస్తయినా పట్టించుకోవట్లేదంటాడు. రాజ్, కావ్య వస్తారు. రాజ్‌కు పాపను చూపిస్తుంది కావ్య. తులసి, ధర్మేంద్ర పాప గురించి మాట్లాడుకుంటారు.
బతికి ఉండేదాన్ని కాదు

ఈ పాప పుట్టకపోయి ఉంటే నేను బతికి ఉండేదాన్నే కాదంటుంది తులసి. ఆ మాటలు రాజ్, కావ్య వింటారు. మీకు అప్పగించిన పని ఏం చేశారు. గుడిలో పాట పాడిన కావ్య పని ఏం చేశారు. గుడిలో ఏంటీ అంత విచిత్రంగా ప్రవర్తించారు. కావ్య పాపను ఎత్తుకుంటే ఎందుకు లాగేసుకున్నారు అని తులసి అంటాడు. దానికి కంగారుగా తడబడతాడు మంత్రి.
ఆ పనిలోనే ఉన్నా. మన పాపను వేరే వాళ్లకు ఇవ్వడమేంటని లాగేసుకున్నా అని ధర్మేంద్ర అంటాడు. తర్వాత తులసి, ధర్మేంద్ర ఇద్దరు భోజనానికి వెళ్తారు. పాపను చూసేందుకు గదిలోకి రాజ్, కావ్య వెళ్తారు. పాపను ఎత్తుకుని కన్నీళ్లతో ముద్దాడుతుంది కావ్య. మన కూతురు అని రాజ్‌కు చెబుతుంది. పాపకున్న పుట్టుమచ్చ చూపిస్తుంది. ఎలా ఉంది మీ కూతురు అని కావ్య అంటే.. అచ్చం నీలాగే ఉందని రాజ్ అంటాడు.
ఇంతలో పాప ఏడుస్తుంది. పాప ఏడుపు విని తులసి అన్నం తినడం మానేసి వచ్చేస్తుంది. పాపను పడుకోబెట్టి కావ్య, రాజ్ వెళ్లిపోతారు. తులసి వచ్చి పాపను ఓదారుస్తుంది. చిన్న పిల్లలు ఏడుస్తారు. దానికే ఒళ్లు తెలియకుండా పరుగెత్తుకుంటూ వస్తావా. కింద పడేదానివి తెలుసా అని భార్యను మంత్రి తిడతాడు. నా పాపకు ఏమైనా అయితే నన్ను కాపాడుకోలేరు. నేను చచ్చిపోతాను. ఇది నా ప్రాణం అని తులసి ఏడుస్తూ అంటుంది.
ఏడిపించిన తులసి
ఆ మాటలు రాజ్, కావ్య వింటారు. ఎమోషనల్ అవుతారు. పాప గురించి చాలా ఎమోషనల్‌గా ఏడుస్తూ రాజ్, కావ్య కన్నీళ్లు పెట్టేలా చెబుతుంది తులసి. బయటకెళ్లిన రాజ్ నేను ఎంత ఫూల్‌ని. నువ్వెంత చెబుతున్నా నేను నమ్మలేదని, క్షమించమని పశ్చాత్తాప పడతాడు రాజ్. ఇప్పుడు మన పాపను ఎలా తెచ్చుకోవాలో ఆలోచించాలి అని కావ్య అంటుంది.
{{/usCountry}}ఆ మాటలు రాజ్, కావ్య వింటారు. ఎమోషనల్ అవుతారు. పాప గురించి చాలా ఎమోషనల్‌గా ఏడుస్తూ రాజ్, కావ్య కన్నీళ్లు పెట్టేలా చెబుతుంది తులసి. బయటకెళ్లిన రాజ్ నేను ఎంత ఫూల్‌ని. నువ్వెంత చెబుతున్నా నేను నమ్మలేదని, క్షమించమని పశ్చాత్తాప పడతాడు రాజ్. ఇప్పుడు మన పాపను ఎలా తెచ్చుకోవాలో ఆలోచించాలి అని కావ్య అంటుంది.
{{/usCountry}}వాడు ఏ భార్య కోసం అయితే ఇదంతా చేశాడో ఆ భార్య నుంచే నరుక్కుంటూ రావాలి. తులసికి దగ్గరవుతూ వాడికి (మంత్రి ధర్మేంద్ర) నిద్ర లేకుండా టార్చర్ చేయాలి. అప్పుడే మన బిడ్డ మన దగ్గరికి వస్తుంది అని కావ్య అంటుంది. నువ్వు ఏది చెబితే అదే చేస్తాను కళావతి అని రాజ్ అంటాడు. ఈ విషయం ఇంట్లో తెలియడానికి వీళ్లేదని, మనవాళ్లు ఆవేశంతో మంత్రి మీదకు దాడి చేస్తారు. వాడి బిడ్డ అని మన దగ్గరున్న పాప మీద అసహ్యం పెంచుకుంటారని కావ్య అంటుంది.
అలాగే అని రాజ్ అంటాడు. మరుసటి రోజు ఉదయం పాపను కావ్య సంతోషంగా ఆడిస్తుంటే అపర్ణ, ఇందిరాదేవి చూసి షాక్ అవుతారు. రాజ్‌కు చెప్పి పంపించామ్ కదా. ఇదంతా రాజ్ మాయ అని ఇందిరాదేవి అంటాడు. రాజ్ వస్తాడు. కావ్య మార్పు గురించి అడుగుతారు. తను ఇప్పుడిప్పుడే నిజాన్ని గ్రహిస్తుందని, ఇకపై సమస్య ఉండదని రాజ్ అంటాడు.
హాస్పిటల్‌కు కావ్య, రాజ్
రాజ్ వెళ్లి కావ్యతో మాట్లాడుతాడు. నా పాపను దగ్గరికి చేర్చుకోవాలనుకుంటున్నా కానీ ఈ బిడ్డపై ద్వేషం పెంచుకోవాలని లేదని కావ్య అంటుంది. మంత్రి వాళ్లు ఇవాళ పాపను హాస్పిటల్‌కు తీసుకెళ్తానన్నారు కదా. మనం కూడా వెళ్దామని, పరిచయం చేసుకొందామని రాజ్ అంటాడు. సరేనని కావ్య అంటుంది. మరోవైపు డాక్టర్‌ను కలిసిన తులసి తనకు పాలు రావట్లేదని చెబుతుంది.
డబ్బా పాలు వాడనని, ఎలాగైన తన పాలే పాపకు పడతానని అంటుంది తులసి. ఇంతలో కావ్య వస్తుంది. కావ్యను పలకరించిన తులసి పాప గురించి అడుగుతుంది. మా ఆయనకు చెప్పాను మీ గురించి అని తులసి అంటుంది. మీ ఆయన హెల్ప్ చేస్తే అంతకంటే ఏముంటుంది అని రాజ్ అంటాడు. డాక్టర్ చక్రవర్తి గురించి కావ్య కావాలనే అడుగుతుంది.
నాకు డెలివరీ చేసినప్పటి నుంచి ఆయన రావట్లేదు అని తులసి అంటుంది. అదేదో మీ వారిని అడగండి అని కావ్య, మీకు పురుడు పోసిన డాక్టర్ ట్రీట్‌మెంట్ ఇస్తే మీకే బాగుంటుంది కదా అని రాజ్ అంటారు. సరేనని తులసి అంటుంది. ఇంతలో పాప ఏడుస్తుంది. పాల డబ్బా పెడుతుంది. కానీ, పాప తాగదు. అలాగే ఏడుస్తుంటుంది.
కన్నబిడ్డకు పాలు పట్టిన కావ్య
కన్నతల్లి ప్రేమ ఆపుకోలేక మీ పాపకు నా పాలు ఇవ్వమంటారా అని కావ్య అడుగుతుంది. సరేనని తులసి పాపను ఇస్తుంది. దాంతో తన బిడ్డకు కావ్య తల్లి పాలు పడుతుంది. అది చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.