బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ అరెస్ట్ కావడంతో కావ్య తెగ కంగారు పడుతుంది. ఆయన ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఏంటని కావ్య బాధపడుతుంది. ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారం చేశారనిపిస్తుందని కల్యాణ్ అంటాడు. అప్పు ఏదో ఒకటి చేయవే. ఎలాగైనా మీ బావను బయటకు తీసుకురా. నిన్న నా బిడ్డకు ప్రమాదం తలపెట్టారు, ఇవాళ ఆయన్ను అరెస్ట్ చేయించారని కావ్య తల్లడిల్లిపోతుంది.
హాస్పిటల్‌లో కావ్య

కావ్య టెన్షన్ పడుతూ నొప్పులతో అరుస్తుంది. ఏడో నెలలో నొప్పులు ఏంటీ అని ఇందిరాదేవి భయపడుతుంది. కావ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. డాక్టర్ చెక్ చేస్తుంది. సుభాష్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. నాకు మా ఆయన్ను చూడాలని ఉంది. పిలిపించండి అని కావ్య కంగారుగా చెబుతుంది. సరేనంటుంది డాక్టర్.
బయటకొచ్చిన డాక్టర్ కావ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలి. పెయిన్స్ రావడంతో బిడ్డను క్యారీ చేయలేకపోతుంది. బీపీ నార్మల్ అయ్యాక ఆపరేషన్ చేస్తామం. వీలైనంత త్వరగా ఆమె భర్తను పిలిపించండి. బీపీ నార్మల్ కాకపోతే ఆపరేషన్ చేయలేం. చాలా సమస్య అవుతుందని డాక్టర్ చెబుతుంది.
మరోవైపు జైలులో సాండీ, దొంగ బంగారం, కారులో బ్యాగ్ దొరకడం గురించి రాజ్ ఆలోచిస్తాడు. ఇంతలో కల్యాణ్, సుభాష్ వస్తారు. రెండు రోజుల్లో బెయిల్ దొరుకుతుందని లాయర్ చెప్పాడని సుభాష్ అంటాడు. బెయిల్ కాదు. ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడాలి. ఎవరి మీద అయినా డౌట్ కలిగిందా అని రాజ్ అంటాడు.
ఆలోచించే టైమ్ లేదు
అంత ఆలోచించే టైమ్ ఎక్కడిది అన్నయ్య. నువ్వు రాగానే వదినకు అని కల్యాణ్ ఆగిపోతాడు. ఏమైందని రాజ్ అడిగితే.. కావ్య గురించి సుభాష్ చెబుతాడు. ఇంతలో అప్పు కాల్ చేసి కావ్య పరిస్థితి గురించి చెబుతుంది. అదే విషయం రాజ్‌కు సుభాష్ చెబుతాడు. మరోవైపు కావ్య మీరు కంగారుపడకూడదు. ఇలా పడితే ఆపరేషన్ చేయలేం అని డాక్టర్ అంటుంది.
నా భర్త లేకుండా నేను ఆపరేషన్ చేయించుకోను. నా భర్తను చూస్తేకానీ నా టెన్షన్ తగ్గదు. నా భర్త చేయి పట్టుకుంటేనే నేను ఆపరేషన్ థియేటర్‌కు వస్తాను అని కావ్య అంటుంది. ఇంతలో సుభాష్ వస్తాడు. హాలీడేస్ వల్ల రాజ్‌కు బెయిల్ వచ్చే అవకాశం లేదని సుభాష్ చెబుతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి కావ్య భర్త లేకుండా ఆపరేషన్ చేసుకోను అని మొండిపట్టు పడుతుందని సీరియస్ అవుతుంది.
{{/usCountry}}నా భర్త లేకుండా నేను ఆపరేషన్ చేయించుకోను. నా భర్తను చూస్తేకానీ నా టెన్షన్ తగ్గదు. నా భర్త చేయి పట్టుకుంటేనే నేను ఆపరేషన్ థియేటర్‌కు వస్తాను అని కావ్య అంటుంది. ఇంతలో సుభాష్ వస్తాడు. హాలీడేస్ వల్ల రాజ్‌కు బెయిల్ వచ్చే అవకాశం లేదని సుభాష్ చెబుతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి కావ్య భర్త లేకుండా ఆపరేషన్ చేసుకోను అని మొండిపట్టు పడుతుందని సీరియస్ అవుతుంది.
{{/usCountry}}రాజ్ బెయిల్ గురించి చెబుతారు. రెండు రోజుల వరకు వెయిట్ చేస్తే కావ్యకు బిడ్డకు ఇద్దరికి ప్రమాదం అని డాక్టర్ చెబుతుంది. ఏదో ఒకటి చేసి రాజ్‌ను తీసుకురండి. అప్పుడే కావ్య ఒప్పుకుని ఆపరేషన్ చేయించుకుంటుందని డాక్టర్ చెబుతుంది. మేము కావ్యకు సర్దిచెబుతామని ఇందిరాదేవి, అపర్ణ అంటే.. తన బీపీ నార్మల్ అయ్యాక మాట్లాడండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది.
రాహుల్‌ను నిలదీసిన అప్పు
ఇంతలో రాహుల్ బ్యాగ్ తీసుకొచ్చింది గుర్తు చేసుకుంటుంది అప్పు. రాహుల్‌ను చూస్తూ నిన్ను ఒకటి అడుగుతా చెబుతావా అని అప్పు అంటుంది. ఆరోజు రాత్రి నువ్వు ఒక బ్రీఫ్ కేస్ పట్టుకోవచ్చుగా. అందులో ఏముంది. నువ్వు తీసుకొచ్చిన బ్రీఫ్ కేసు, బావ కారులో దొరికిన బ్రీఫ్ కేసు ఒకేలా ఉన్నాయి. ఆరోజు అడిగితే తడబడ్డావ్ అని అప్పు అంటుంది.
నీ పోలీస్ బుద్ధి నా మొగుడిపై చూపించకు అని కోపంగా అరుస్తుంది స్వప్న. ఆరోజు రాహుల్ బ్రీఫ్ కేసుతో వచ్చాడని అప్పు అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్లు రాలతాయ్. బిజినెస్ చేసేవాడు బ్రీఫ్ కేసుతో రాడా అని స్వప్న రచ్చ చేస్తుంది. నా కోడలిని అంటే మర్యాదగా ఉండదని ధాన్యలక్ష్మీ వార్నింగ్ ఇస్తుంది. ఏంటీ మర్యాద అంటూ ధాన్యలక్ష్మీపై అరుస్తుంది స్వప్న.
ఇంతలో కల్యాణ్ వస్తాడు. రాజ్ కేసు నుంచి బయటపడుతున్నాడని కావ్యతో చెబుతాడు. దాంతో కావ్య సంతోషిస్తుంది. బయట అపర్ణ వాళ్లు అడిగితే వదినకు అబద్ధం చెప్పానని కల్యాణ్ అంటాడు. ఆ మాటలు విన్న కావ్య బాధపడుతుంది. మరుసటి రోజు హాస్పిటల్‌లో కావ్య ఉండదు. మిస్ అయిందని డాక్టర్ చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.