Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందుకు రాజు దుగ్గిరాల వారసుడని, తాము పెంచిన కొడుకుని, ఇందును రాజు జీవితంలో నుంచి తప్పుకోమని చలపతి అంటాడు. ఇందు కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాధగా వారి దగ్గరి నుంచి ఇందు వెళ్తుంది.
వాడిని వాడు కాపాడుకోవాలిగా

మరోవైపు రేఖ సంతోషంగా ఉంటుంది. అపర్ణతో వెళ్లి మాట్లాడుతుంది. ఇందును రాజు కాపాడాలంటే ముందు వాడిని వాడు కాపాడుకోవాలిగా. వాడు ఇక ఇక్కడికి ఎప్పుడు రాలేడు. వాడు అసలు ఈ భూమ్మీదే ఎక్కడ కనిపించడు అని రేఖ అంటుంది. దాంతో అపర్ణ కంగారుపడుతుంది.
నీ అసలు కొడుకు లాగే వీడు కూడా అంతమైపోతాడు అని రేఖ అంటుంది. నీకెందుకు అంత సంతోషం, ఎదుటివాళ్ల నాశనం కోరుకుంటే ఏం వస్తుందని అపర్ణ అంటుంది. ఆనందం వస్తుంది. మీ నాశనం కోరుకుంటే నాకు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అని సైకోలా ప్రవర్తిస్తుంది రేఖ. ఆ రాజు గాడు వచ్చాడు వెళ్లిపోయాడు. ఇక ఆ రాజును మర్చిపోండని రేఖ చెప్పేసి వెళ్లిపోతుంది.
దాంతో భయంతో రాజుకు అపర్ణ కాల్ చేస్తే స్విచ్ఛాప్ వస్తుంది. ఇందుకు కాల్ చేస్తుంది అపర్ణ. ఇందు కూడా చూసి లిఫ్ట్ చేయదు. రాజు క్షేమంగా ఉండాలని తన ఆయుష్షు కూడా తీసుకోమని దేవుడిని కోరుకుంటాడు చలపతి. వాడు ధనవంతుడిగా పుట్టి పేదరికంలో పెరిగాడు. ఎప్పటికైనా వాడు రాజులా బతుకుతాడు. నేను లేకున్నా సరే వాడు బతికితే చాలు కదా అని చలపతి అంటాడు.
ఎంత డబ్బు ఖర్చు అయిన పర్లేదు
ఆ మాటలు అక్కడే పక్కన కూర్చున్న ఇందు వింటుంది. ఇంతలో డాక్టర్ వస్తాడు. రక్తం చాలా పోయిందని, బ్లడ్ ఎక్కిస్తున్నామని చెబుతాడు డాక్టర్. తలకు చాలా గాయమైంది. స్పృహలో లేడు ఇప్పుడే చెప్పలేం. మేము సాయశక్తులా ప్రయత్నిస్తాం. అబ్జర్వేషన్లో ఉంచామని డాక్టర్ చెబుతాడు. ఇందు చూడొచ్చా అని అడిగితే.. లేదని, ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్ అంటాడు.
{{/usCountry}}ఆ మాటలు అక్కడే పక్కన కూర్చున్న ఇందు వింటుంది. ఇంతలో డాక్టర్ వస్తాడు. రక్తం చాలా పోయిందని, బ్లడ్ ఎక్కిస్తున్నామని చెబుతాడు డాక్టర్. తలకు చాలా గాయమైంది. స్పృహలో లేడు ఇప్పుడే చెప్పలేం. మేము సాయశక్తులా ప్రయత్నిస్తాం. అబ్జర్వేషన్లో ఉంచామని డాక్టర్ చెబుతాడు. ఇందు చూడొచ్చా అని అడిగితే.. లేదని, ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్ అంటాడు.
{{/usCountry}}ఎంత డబ్బు ఖర్చు అయిన పర్వాలేదు. నేను ఇస్తానని ఇందు అంటుంది. డబ్బుతోనే అన్ని అయితే డబ్బున్నోళ్లకు చావే ఉండదని డాక్టర్ వెళ్లిపోతాడు. ఇందుపై ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నావని కోప్పడుతాడు చలపతి. ఊరుకోండి. ఉండని అని లక్ష్మీ అంటుంది. ఆస్పత్రిలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్లిన ఇందు జరిగిన విషయాల గురించి మొరపెట్టుకుంటుంది.
నాకోసం ఒక బంధాన్ని తోడుగా ఉంచావ్. మళ్లీ అదే బంధాన్ని ఆస్పత్రి పాలు చేశావ్. మా నానమ్మ తాతయ్య డౌట్ పడిన నేను నమ్మలేదు. నాకు అండగా ఉండాలని నువ్వే నా బావను పంపించావని నాకు అర్థమైంది. నా బావకు ఏమైనా అయితే నేను భరించలేను. నాకు నా బావ కావాలి స్వామి. తనకేం కాకూడదు. తనను నాకు దూరం చేయొద్దు. ఎలాగైనా నా బావను కాపాడు అని దండం పెట్టుకుని కోరుకుంటుంది ఇందు.
చలపతిని బతిమిలాడిన ఇందు
మరోవైపు రాజు ఫోన్ స్విచ్ఛాఫ్, ఇందు కాల్ లిఫ్ట్ చేయకపోవడం గురించి ఇందు ఎక్కడికి వెళ్లిందని అపర్ణ, సుభాష్ మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయం డాక్టర్ వచ్చి రాజు బాగానే ఉన్నాడని, కాలు కొంచెం మిస్‌లొకేట్ అయిందని, వారం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ చెబుతాడు. స్పృహలోకి వచ్చాక డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.
దాంతో చలపతి, ఇందు సంతోషిస్తారు. ఇందును చలపతి వెళ్లిపోమని ఇక రాజు జీవితంలోకి రాకనంటాడు. అది కుదరదు అంకుల్. తను నా బావ. నా బావను వదిలి వెళ్లలేను. తను నా బావ అని తెలియక మీ ఇంటికి పంపించాను. నా బావను నాతోపాటే నా ఇంటికి తీసుకెళ్తాను అని ఇందు అంటుంది. దాంతో చలపతి, లక్ష్మీ షాక్ అవుతారు.
అర్థం చేసుకుంటారని నిజం చెబితే ఇలా అంటావేంటమ్మా అని చలపతి బాధపడతాడు. రాజు మీ ఇంట్లో ఉన్నాడు కాబట్టే రేఖ ఆంటీ ఇలా చేయించగలిగింది. మా ఇంట్లో ఉంటే ఇలా జరిగేదు కాదు. అందుకే నా బావను ఇంటికి తీసుకెళ్తానంటున్నాను. తన ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. మా నానమ్మ, తాతయ్య రాజును చూడకుండా ఉండలేకపోతున్నారు అని ఇందు చెబుతుంది.
మా ఇంట్లో కాపాడుకోగలను
మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం. మా కష్టాలు దూరం చేసేందుకు రాజును దేవుడు పంపించాడు. వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు అని ఇందు అంటుంది. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో అని భయపడుతూ బతకలేమని చలపతి అంటాడు. తనకు రేఖ ఆంటీ నుంచి ప్రమాదం ఉంది. కానీ, మీ ఇంట్లో ఉంటే నేను కాపాడుకోలేను. మా ఇంట్లో కాపాడుకోగలను అని ఇందు అంటుంది.
చలపతి ఆలోచిస్తాడు. కానీ, ఒప్పుకోడు. తర్వాత రాజును డిశ్చార్జ్ చేస్తారు. చలపతి ఇంటికి రాజు వెళ్తాడు. అక్కడ రాజుకు ఇందు సేవలు చేస్తుంటుంది. అది చూసి రేఖ షాక్ అవుతుంది. వెళ్లి పరామర్శిస్తుంది. నువ్వే చంపాలని ట్రై చేశావని నాకు తెలుసు. లక్కీ గాడు నీ కొడుకు అనే విషయం పాతిపెట్టేందుకే ఇలా చేశావని నాకు తెలుసు అని రాజు అంటాడు.
రేఖకు మైండ్ బ్లాక్
లక్కీ గాడి తల్లివి నువ్వే అనే విషయం నేను ఇంకొకరికి కూడా చెప్పాను అని రాజు అంటాడు. ఇందు రేఖనే చూస్తుంది. రేఖకు మైండ్ బ్లాక్ అవుతుంది. లక్కీ తల్లి రేఖ అనే నిజం ఇందుకు కూడా తెలిసిపోయింది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.