Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నువ్వు నన్ను బాబాయ్ అను, నేను నిన్ను అక్క అంటాను అని తాగుబోతు నారాయణ ఇందుతో అంటాడు. గదిలో ఉన్నోడితే కొట్టిస్తానని ఐశ్వర్య అంటుంది. అతను కొట్టేందుకు వస్తుంటే అదివరకు తన్నులు తిన్న రౌడీ వద్దంటాడు.
బైక్ మీద ఇందును తీసుకెళ్లిన నారాయణ

దాంతో ఆ రౌడీ పారిపోతాడు. ఐశ్వర్య తప్పుకోను అంటే.. రౌడీ వద్దని చెబుతాడు. ఇందు కట్లు విప్పుతాడు తాగుబోతు నారాయణ. ఈ టైమ్‌లో వెళ్లిన సీఈఓ అవ్వలేవులే. ఇంకో పది నిమిషాల్లో మీటింగ్ ముగుస్తుందని ఐశ్వర్య అనుకుంటుంది. సైకిల్ మీద స్పీడ్‌గా తీసుకెళ్తా అని నారాయణ అంటే.. ఐశ్వర్య నవ్వుతుంది.
దాంతో బైక్ ఉందిగా అని నారాయణ అంటాడు. ఆ బైక్ కీస్ రౌడీ ఇస్తాడు. ఈఎమ్ఐలో ఉంది బైక్‌తో వెళ్లకుంటే పెళ్లాం తిడుతుందని రౌడీ చెప్పడంతో సైకిల్ ఇంటికి తీసుకొచ్చేయ్ అని అడ్రస్ చెబుతాడు. చెల్లికి తనకు జరిగిన గొడవ గురించి చెప్పి ఇందు మాట వినమని ఐశ్వర్యకు ఇన్‌డైరెక్ట్‌గా సలహా ఇస్తాడు నారాయణ.
ఇందును అపార్థం చేసుకోకుండా మంచిగా ఉండమని చెబుతున్నారు కదా అని రౌడీ అంటాడు. బాగా చెప్పావురా అబ్బాయి అని మెచ్చుకుని మంచిగా ఉండమని ఐశ్వర్యకు చెబుతాడు నారాయణ. బైక్ మీద ఇందును జెట్ స్పీడ్‌లో తీసుకెళ్తాడు తాగుబోతు నారాయణ. ఇందు భయపడుతుంది. లారీతో దేశమంతా తిరిగా. ధైర్యంగా ఉండమని నారాయణ అంటాడు.
ఫ్లాష్ మ్యాన్‌లా ఉన్నాడే
మరోవైపు టైమ్ దాటిపోతుందని, నిర్ణయం చెప్పమని పరంధామయ్యతో అంటుంది రేఖ. ఎంత ఆలోచించినా నా మైండ్ ఒక్కటే చెబుతోంది. బయటి వాళ్లకు సపోర్ట్ చేయలేనని పరంధామయ్య అంటాడు. దాంతో రేఖ సంతోషిస్తుంది. రాజు మాత్రం నోటాకు వేయమని అంటాడు. ఇందును ఆఫీస్ దగ్గర దించుతాడు నారాయణ. ఇంకేమైనా హెల్ప్ కావాలా, లోపల ఎవరికైనా రిపేర్ చేయాలా అని నారాయణ అడుగుతాడు.
నీ స్పీడ్ వాళ్లు తట్టుకోలేరని, వద్దని, థ్యాంక్స్ చెబుతుంది ఇందు. ఈ బైక్ వాడికి ఇచ్చేసి వెళ్తానని నారాయణ వెళ్లిపోతాడు. చెప్పిన టైమ్‌కు 3 నిమిషాల ముందే తీసుకొచ్చాడు. ఈయనెవరో ఫ్లాష్ మ్యాన్‌లా ఉన్నాడనుకుంటుంది ఇందు. పరంధామయ్య ఎవరికి సపోర్ట్ చేయబోతున్నాడో చెబుతుంటే ఇందు వచ్చి అందరికి లేట్ అయినందుకు సారీ చెబుతుంది.
{{/usCountry}}నీ స్పీడ్ వాళ్లు తట్టుకోలేరని, వద్దని, థ్యాంక్స్ చెబుతుంది ఇందు. ఈ బైక్ వాడికి ఇచ్చేసి వెళ్తానని నారాయణ వెళ్లిపోతాడు. చెప్పిన టైమ్‌కు 3 నిమిషాల ముందే తీసుకొచ్చాడు. ఈయనెవరో ఫ్లాష్ మ్యాన్‌లా ఉన్నాడనుకుంటుంది ఇందు. పరంధామయ్య ఎవరికి సపోర్ట్ చేయబోతున్నాడో చెబుతుంటే ఇందు వచ్చి అందరికి లేట్ అయినందుకు సారీ చెబుతుంది.
{{/usCountry}}ఇందును చూసి అచ్చం కావ్యలాగే ఉందే అని పరంధామయ్య అంటుంది. కావ్య కూతురు అలాగే ఉంటుంది కదా. ఇందును కన్నతల్లిలా పెంచాను, కంటికి రెప్పలా చూసుకున్నాను. అందుకే నాకు సపోర్ట్ చేసేందుకు వచ్చింది. కంపెనీపై నాకు లాగే ఇందుకు బాధ్యతలు ఉన్నాయి. ఈ కుటుంబం వాళ్లే ఈ కంపెనీని ఉన్నతంగా తీర్చిదిద్దగలరనే బయటి వాళ్లకు కాకుండా నాకు సపోర్ట్ చేసేందుకు వచ్చిందని రేఖ అంటుంది.
ఇందు సపోర్ట్ కూడా నాకే
ఇప్పుడు చెప్పండి రాజుకు సపోర్ట్ చేస్తారా, నాకు సపోర్ట్ చేస్తారా. ఇందు సపోర్ట్ కూడా నాకే అని రేఖ అంటుంది. కావ్య రూపంలో ఇందు కనిపిస్తుంటే నా ఓటు ఇంకెవరికి వేస్తాను. నా ఓటు ఇందుకు వేస్తాను అని పరంధామయ్య అంటాడు. రేఖ షాక్ అవుతుంది. ఇప్పుడు మొదలైంది అసలైన రాజకీయం. మజా వస్తుందని రాజు అనుకుంటాడు.
ఇప్పుడు రాజుకు ఇందు సపోర్ట్ చేయకుండా అడుగు ముందుకు వేయాలనుకుంటుంది రేఖ. నేను కూడా ఇందుకే సపోర్ట్ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేసే బోర్డ్ మెంబర్స్‌ని కూడా ఇందుకే సపోర్ట్ చేయమంటాను అని రేఖ అంటుంది. దాంతో వారు కూడా సపోర్ట్ చేస్తున్నామంటారు. నేను సీఈఓగా ఉండటం ఏంటీ అని ఇందు కావాలనే యాక్టింగ్ చేస్తుంది.
నువ్వు అన్నీ చేయగలవు అని రేఖ అంటుంది. ఫైనల్‌గా మీరు మీరు ఒకటి అయిపోయారన్నమాట అని రాజు అంటాడు. మేము ఒక్క కుటుంబం. కలిసే ఉంటామని రేఖ అంటుంది. ఓట్లు ఇందుకు ఎక్కువ పడ్డాయి కాబట్టి ఈ సంవత్సరం బోర్డ్ మెంబర్‌గా ఇందు ఉంటుందని పరంధామయ్య ప్రకటిస్తాడు. అంతా చప్పట్లు కొడతారు.
అనుకుంది సాధించిన ఇందు
నేను కాకపోయినా నా భార్య సీఈఓ అయిందిగా. నేను ఒప్పుకుంటున్నాను. సీఈఓ చైర్‌లో నుంచి నువ్వు లేస్తే ఇందు కూర్చుంటుందని రాజు అంటాడు. సీఈఓ కుర్చీలో ఇందు కూర్చుంటుంది. భార్య సీఈఓ అయిందని రాజు సంబరపడుతున్నాడు. కానీ, ఇదంతా నేను ప్లాన్ చేశానని తెలిస్తే ఏమైపోతాడో అని రేఖ అనుకుంటుంది.
ఇదంతా ఇందు ప్లాన్ అని తెలిస్తే ఏమైపోతావో పిన్ని అని మనసులో నవ్వుకుంటాడు రాజు. ఇందు, రాజు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. తర్వాత కారులో వెళ్తూ జరిగింది మాట్లాడుకుంటారు ఇందు, రాజు. అంత లేట్ ఎందుకు అయింది అని రాజు అడిగితే.. అది వదిలేసి నేను రాకుంటే నువ్వు సీఈఓ అయ్యేందుకు ప్లాన్ చేశావట కదా అని ఇందు అంటుంది.
పరంధామయ్య మొత్తం చెప్పారని ఇందు చెబుతుంది. నువ్వు రాకపోయి రేఖ సీఈఓ కాకుండా ఉండేందుకే అలా చేశానని రాజు కవర్ చేస్తాడు. నీ గురించి బాగా తెలుసు అని ఇందు అంటుంది. నన్ను ఇలాగే అంటే నేను అద్దె మొగుడిగా దిగిపోతానని రాజు అంటాడు. సరే కారు ఆపు, దిగిపో అని ఇందు అంటుంది. కారు ఆపనని రాజు అంటాడు.
దొంగ బంగారం పెట్టేందుకు
దాంతో నవ్వినా ఇందు నువ్వు చచ్చినా అద్దె మొగుడుగా చేయాల్సిందే. నీకు డబ్బు ఎక్కడ దొరకదు అని ఇందు అంటుంది. నా వీక్‌నెస్ మీద కొడుతు ఆడుకుంటున్నావని. నాకు టైమ్ వచ్చినప్పుడు చెబుతానని రాజు అంటాడు. మరోవైపు పార్వతీశం క్లౌడ్ కిచెన్‌కు వెంకీని నందు తీసుకెళ్తుంది. ఇతనెవరు బాయ్‌ఫ్రెండా అంటే అవును అని నందు అంటుంది.
వెంకీ షాక్ అవుతాడు. తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్‌గా వెంకీ జాబ్‌లో జాయిన్ అవుతాడు. మరోవైపు దొంగ బంగారాన్ని ఇందుతో సంతకం పెట్టించి కంపెనీలో పెట్టిస్తానని రేఖ ప్లాన్ వేస్తుంది. అన్న రాహుల్‌లాగే రేఖ కూడా స్మగ్లింగ్ గోల్డ్ కంపెనీలో పెట్టించాలని చూస్తుంది రేఖ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.