...
...
Next Story

Brahmamudi March 10th Episode: బ్రహ్మముడి- అప్పు, కల్యాణ్ లక్షణాలతో నందు- కవితలతో బొకే షాప్- వేరే ఇంటికి వంటలక్కగా ఇందు!

Brahmamudi Serial March 10th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 10వ తేది ఎపిసోడ్‌లో టైలర్ షాప్ అతని ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ చేసి ఇందు గురించి అడుగుతుంది రేఖ. అప్పు, కల్యాణ్ లక్షణాలతో నందు ఉంటుంది. కవితలతో పాటు బొకే షాప్ రన్ చేస్తుంది. బొకేతోపాటు నందు కవితలను ఓ ప్రేమికుడు వాడుకుంటాడు.

Published on: Mar 10, 2026, 08:32:55 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇందును తన కూతురే బయటకు పంపించిందని, అందులో అనుమానించేందుకు ఏం లేదని భ్రమరాంబ అంటుంది. అనుమానించాలి, దీనిలో ఉంది మాములు రక్తం కాదు అని రేఖ అంటుంది. నేను నిజంగానే బట్టలు కుట్టించడానికి వెళ్లాను అని ఇందు చెబుతుంది.

తప్పించుకున్న ఇందు

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 10వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 10వ ఎపిసోడ్

మరి ఆ టైలర్ షాప్ పేరు, అతని పేరు ఏంటని రేఖ అడుగుతుంది. సత్యం బాబు టైలర్ షాప్, సత్యం బాబు అని ఇందు చెబితే.. ఆ టైలర్ వాడి నెంబర్ చెప్పమని రేఖ అడుగుతుంది. అతని ఫోన్ నెంబర్ లేదని ఇందు చెబితే.. స్వాతి ఆ నెంబర్ ఇవ్వు, సంక్రాంతికి వాడికి గంట గంటకు ఫోన్ చేసి బట్టలు రెడీ అయ్యాయా అని అడిగావ్‌గా అని రేఖ అంటుంది.

దీనికి అన్ని గుర్తుండి చస్తాయని స్వాతి విసుక్కుంటుంది. చేసేది లేక టైలర్ అతని నెంబర్ ఇస్తుంది. రేఖ కాల్ చేసి అడిగితే.. ఇందు మేడమ్ వచ్చారని టైలర్ షాప్ అతను చెబుతాడు. దాంతో ఇందు టైలర్ షాప్ అతన్ని కలిసింది, డ్రెస్ ఆల్ట్రేషన్ ఇచ్చింది, తన పేరు గుర్తుకోపెట్టుకోమని చెప్పింది అంతా గుర్తు చేసుకుంటుంది ఇందు. టైలర్ షాప్ అతను వచ్చినట్లు చెప్పడంతో ఇందును వదిలేస్తుంది రేఖ.

నేను గడపదాటి కాలు బయటపెడితే మీరెందుకు అంత భయపడుతున్నారు, మిమ్మల్ని అంతలా కంగారుపెట్టడానికి ఏముంది అని రేఖను అడుగుతుంది ఇందు. దానికి రేఖ షాక్ అవుతుంది. నాకు సమాధానం చెప్పెందుకే భయపడే నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా. ఇక్కడ నువ్వుంది నేను చెప్పింది చేయడానికి మాత్రమే, అడగటానికి కాదు అని రేఖ వారిస్తుంది.

మన గుప్పిట్లో ఉండాలి

చూసుకుంటాను అనడం కాదు. పాతికేళ్ల నిరీక్షణ మనది. ఎప్పుడు ఓ కన్నేసి ఉంచు అని రేఖ వెళ్లిపోతుంది. మీ ఇద్దరిది ఏం ప్లాన్ అని సెటైర్లు వేస్తాడు శేషు. భ్రమరాంబ ఫ్యామిలీది ఒకప్పుడు చేపల బిజినెస్ కదా అని ఎద్దేవా చేస్తాడు. మరోవైపు ఎగ్జామ్ ఎలా రాశావని అపర్ణ అడిగితే.. డిస్టింక్షన్ తెచ్చుకుంటానని ఇందు అంటుంది. స్వాతి వచ్చి ఎలా మ్యానేజ్ చేశావని అడుగుతుంది.

ఎగ్జామ్ గంట ముందే ఫినిష్ చేసి టైలర్ షాప్‌కు వెళ్లినట్లు చెబుతుంది ఇందు. తర్వాత ఐశ్వర్యది తనది ఒకటే ఎగ్జామ్ హాల్ అని, తనను చూడకుండా మ్యానేజ్ చేసినట్లు ఇందు అంటుంది. త్వరలో నేను అనుకుంది సాధిస్తాను అని ఇందు అంటుంది. కానీ, నీ చెల్లెలు నందు ఎలా ఉందో. అది కూడా ఇలాగే చదువుకునేది. ఇంటికి దూరమై ఎలా ఉందో అని అపర్ణ అంటుంది.

తల్లి, తండ్రి లక్షణాలతో నందు

మరోవైపు నందు బొకే షాప్ నడుపుతుంది. కానిస్టేబుల్ దత్తా వచ్చి లంచ్ బాక్స్ ఇస్తాడు. పోలీస్ అయి మా అక్కను కలవాలి, రేఖ ఆంటీ సంగతి చూడాలని అంటుంది నందు. ఇన్ని ఏళ్లలో మీ అక్కను చూడాలనిపించలేదా అని దత్తా అంటే.. ఉంది, కానీ, ముందు రేఖ ఆంటీ సంగతి చూడాలంటుంది నందు. దత్తా వెళ్లిపోతాడు.

ఇంతలో తన లవర్ కోసం వచ్చిన ఒకతను నందు దగ్గర సింగిల్ ఫ్లవర్ బొకే కొంటాడు. బొకే షాప్ గోడలపై కవితలు అంటాయి. అవి అతను చదువుతాడు. అవన్ని నువ్వే రాశావా అని నందును అడిగితే.. సెటైరికల్‌గా ఆన్సర్ ఇస్తుంది. తల్లి అప్పులా పోలీస్ అవ్వాలని, తండ్రి కల్యాణ్‌లు రైటర్ ఇద్దరి లక్షణాలు నందులో ఉంటాయి.

చదివింది చాలు కానీ అన్ని కలిపి బొకే అల్లాను, ఐదు వందలు ఇవ్వమంటుంది నందు. బొకే తీసుకుని వెంకీ వెళ్లిపోతాడు. తన గర్ల్‌ఫ్రెండ్ వెనుకే పడతాడు వెంకీ. ఓ చోట ఇద్దరు ఆగుతారు. ఓసారి ఆ అమ్మాయి రాసిన కొటేషన్స్ ట్రై చేద్దామని, ఈసారికి వాడేద్దామని అనుకుంటాడు వెంకీ. రోజాను పిలిచి నందు రాసిన కొటేషన్ ఒకటి చెప్పి ఫ్లవర్ బొకే ఇస్తాడు వెంకీ.

సుభాష్ సర్జరీకి 15 లక్షలు

సిగ్గు పడుతూ రోజా వెళ్లిపోతుంది. దాంతో వర్కౌట్ అయిందని సంతోషిస్తాడు వెంకీ. ఇంతలో నందు వచ్చి నా కొటేషన్ చెప్పినందుకు వెయ్యి రూపాయలు ఇవ్వమంటుంది. ముందు కుదరదన్న వెంకీ తర్వాత ఇస్తాడు. నీ లవ్‌కు ఆల్ ది బెస్ట్, ఇలాంటి కొటేషన్స్ కావాలంటే మళ్లీ రమ్మని నందు అంటుంది.

మరోవైపు సుభాష్‌ను డాక్టర్ చెక్ చేస్తాడు. ఇది మందులతో తగ్గదని, మీ తాతగారికి కండిషన్‌కు ఆపరేషన్ ఒక్కటే పరిష్కారం. ఆ సర్జరీకి రూ. 15 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెబుతాడు. తర్వాత ఇంటికి బిజినెస్ మ్యాన్ ఒకతను వస్తాడు. అతనికి ఇందు చేసిన వంటలు బాగా నచ్చడంతో వంట మనిషిగా ఇందును పంపిస్తారా అని అడుగుతాడు.

వంటలక్కగా ఇందు

దానికి రేఖ ఒప్పుకుంటుంది. తర్వాత రేఖను ఎందుకు పంపిస్తానన్నావని అపర్ణ నిలదీస్తుంది. బిజినెస్ మ్యాన్ ఇంటికి వంట మనిషిగా వెళ్లడం తనకు ఇష్టమేనని ఇందు చెబుతుంది. అపర్ణ షాక్ అవుతుంది. వంటలక్కగా ఇందు కానుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe