...
...
Next Story

Brahmamudi May 14 Episode: బ్రహ్మముడి- జైలు నుంచి లక్కీ తండ్రి విడుదల- తల్లి కోసం బీరు, బిర్యానీ- ఇందుకు కంపెనీ బాధ్యతలు

Brahmamudi Serial May 14th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 14వ ఎపిసోడ్‌‌లో రాజు పుట్టుక గురించి చలపతి, లక్ష్మీలను అడుగుతుంది అపర్ణ. చలపతి నిజం దాస్తాడు. అపర్ణపై డౌట్ పడతాడు. జైలు నుంచి కొత్త క్యారెక్టర్‌గా లక్కీ తండ్రి ఆంటోనీ విడుదల అవుతాడు. అక్క రాజు పెళ్లి చేసుకున్నందుకు ఇందును నిలదీస్తుంది నందు.

Published on: May 14, 2026, 08:45:13 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చలపతి ఇంటికి వెళ్లిన అపర్ణ తన ఫ్యామిలీ యాక్సిడెంట్, కూతురు గురించి, రాజు తన కొడుకులా ఉండటం గురించి చెబుతుంది. మీ అబ్బాయి రాజును చూడగానే నా మనవడిలాగే అనిపించిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది అపర్ణ.

కన్నీళ్లు తప్పా

బ్రహ్మముడి సీరియల్ మే 14 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ మే 14 ఎపిసోడ్

రాజు మీ కన్నకొడుకు కాదు కదా, తనను మీరు పెంచుకుంటున్నారు కదా. అందరిని పోగొట్టుకున్నాను. జీవితంలో కన్నీళ్లు తప్పా ఇంకేం మిగల్లేదు. తను మీ ఇంటి బిడ్డ కాదు కదా, దుగ్గిరాల వారసుడు కదా, దయచేసి నిజం చెప్పండి, చేతులెత్తి దండం పెడుతున్నా. దయచేసి నిజం చెప్పండి అని ఏడుస్తూ అపర్ణ అడుగుతుంది.

శ్రుతి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న చలపతి రాజు తన కొడుకు, మా ఇంటి వారసుడు అని అబద్ధం చెబుతాడు. మీరెందుకో అబద్ధం చెబుతున్నారనిపిస్తోందని అపర్ణ అంటుంది. అనుకోకుండా వాడి పోలికలు కలిశాయేమో. వాడికి మీకు ఎలాంటి సంబంధం లేదు. మీరు పొరపాటు పడుతున్నారు. ఇక మీరు వెళ్లండి అని చలపతి అంటాడు. నేను ఏమైనా మిమ్మల్ని బాధపెడితే క్షమించండి అని వెళ్లిపోతుంది అపర్ణ.

ఆమెను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందని, నిజం దాచి తప్పు చేస్తున్నామో అని లక్ష్మీ అంటే.. ఈవిడ వల్ల రేఖకు రాజు గురించి తెలిస్తే.. ఈవిడ నిజంగా మంచివారో, లేకుంటే మంచివారిలా నటిస్తున్నారో ఎవరికి తెలుసు అని అపర్ణపై డౌట్ పడినట్లుగా చలపతి చెబుతాడు. నేను ఎవరికి నిజం చెప్పను. రాజు గాడు క్షేమంగా ఉండటం మాత్రమే నాకు కావాలని చలపతి అంటాడు. అవుననండి, ఈ విషయాన్ని మనలోనే సమాధి చేసుకొందామని లక్ష్మీ అంటుంది.

జీతాల గురించి తెలుసుకున్న అపర్ణ

రేఖను తిట్టుకుంటుంది అపర్ణ. తర్వాత అపర్ణ వెళ్లిపోతుంది. రేఖ మీ మనవడిని ఏమైనా చేస్తుందేమో అని భయంతో నిజం చెప్పట్లేదని శ్రుతి ఫీల్ అవుతుంది. మరోవైపు ఇందుకు నందు వీడియో కాల్ చేస్తుంది. అది రాజు చూసి ఇందుకు ఇచ్చేందుకు వెళ్తుంటాడు. మళ్లీ ఇందు కాల్ చేయడంతో రాజు వీడియో కాల్ లిఫ్ట్ చేస్తాడు. నీ దగ్గర మా అక్క ఫోన్ ఉందేంటని నందు అడిగితే.. ఇందును పెళ్లి చేసుకున్నట్లు రాజు చెబుతాడు.

నందు నమ్మకపోవడంతో రాజు ఇంట్లో ఉన్నట్లు చూపిస్తాడు. వాడిని అక్క పెళ్లి చేసుకోవడం ఏంటని నందు కంగారుపడుతుంది. మరోవైపు కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. జైలు నుంచి ఆంటోనీ విడుదల అవుతాడు. ఈ మారిపోయిన సిటీలో బాగా ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అతను లక్కీ తండ్రి. తండ్రి ఆంటోనీ జైలు నుంచి విడుదల కావడంతో తీసుకెళ్లేందుకు కారులో లక్కీ వస్తాడు.

బీరు, బిర్యానీ తెచ్చావా

బీరు, బిర్యాని కావాలని ఆంటోనీ అడుగుతాడు. అవి లేకుండా ఎలా వస్తానని ఇస్తాడు లక్కీ. నేనంటే నీకు చాలా ఇష్టమని తెలుసురా అని ఆంటోనీ అంటాడు. ఇష్టమా తొక్కా నీ నుంచి మా అమ్మ గురించి తెలుసుకోవచ్చని చూస్తున్నా అని లక్కీ మనసులో అనుకుంటాడు. అంటే తల్లి కోసమే తండ్రి ఆంటోనీకి బీరు, బిర్యానీ ఇస్తాడు లక్కీ. రేయ్ ఆంటోనీ ఇంకెన్నాళ్లని అని లక్కీ అంటే.. ఇది తాగుతూ, తింటూ మాట్లాడుకుందామని ఆంటోనీ అంటాడు.

మరోవైపు ఇందును కలిసిన నందు రాజు పెళ్లి చేసుకోవడం గురించి నిలదీస్తుంది. రాజును పెళ్లి చేసుకోవడం నిజమేనని ఇందు చెబుతుంది. లేదు అబద్ధం, నువ్వేదో డ్రామా ఆడుతున్నావని నందు అంటుంది. ఏదో జరిగిపోయిందిలే అని ఇందు అంటుంది. వాడు పెద్ద ఫ్రాడ్ అని తెలిసి ఎలా చేసుకున్నావ్. ముందు ఆ తాళి తీసేయ్. నాకు చాలా అసహ్యంగా ఉంది. నీకు గొప్ప సంబంధం చూస్తాను. నీ స్థాయికి తగ్గట్లు సంబంధం చూస్తాను. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయు అని నందు అడుగుతుంది.

ఏంటీ దబాయిస్తున్నావ్. ఏ హక్కుతో అడుగుతున్నావ్. చెల్లి అని పిలిస్తే సొంత చెల్లెలా ఫీల్ అవుతున్నావేంటీ అని ఇందు అంటుంది. సొంత చెల్లిని కాబట్టే ఫీల్ అవుతున్నా అని నందు అనడంతో ఇందు షాక్ అవుతుంది. అవునక్కా. నేను నీ సొంత చెల్లిని కాబట్టే ఫీల్ అవుతున్నా. నేను నందును అక్క అని చెప్పడంతో ఇందు ప్రేమగా హగ్ చేసుకుంటుంది. ఇన్నిరోజులు ఎక్కడికి వెళ్లిపోయావే అని ఇందు అడుగుతుంది.

ఇందుకు కంపెనీ బాధ్యతలు

ప్రతిరోజూ నీ గురించే ఆలోచించాను. భయం భయంతో బ్రతికాను అని నందు చెబుతుంది. నీకోసం ఎంతో వెతికానే. ప్రతి బర్త్ డేకి నీకోసం ఎదురుచూచేదాన్ని. కానీ, నాకు కన్నీళ్లే మిగిలాయ్. అంటే నేను నీ అక్కని తెలిసే నిజం దాచావన్నమాట అని ఇందు అడుగుతుంది. తర్వాత చాలా కోపంగా ఇంటికి వచ్చిన అపర్ణ రేఖను కంపెనీ ఉద్యోగులకు జీతం ఇవ్వకపోవడంపై నిలదీస్తుంది.

పెట్టింది తిని మూలకు కూర్చోమ్మని రేఖ అంటుంది. నీ స్థానంలో మీ అమ్మ ఉంటే ఇలా జరగనిచ్చేది కాదు. కంపెనీ బాధ్యతలు తీసుకునేది. నువ్వు తీసుకో అని అపర్ణ అంటే.. ఇందు కంపెనీ బాధ్యతలు తీసుకునేందుకు ఒప్పుకుంటుంది. ఏదో ప్లాన్ చేయాలని అనుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks