...
...
Next Story

బ్రహ్మముడి అక్టోబర్ 18 ఎపిసోడ్: రాజ్ బెండ్ తీసిన కావ్య- ప్లేట్ తిప్పేసిన తాగుబోతు- కనకం నాటు కోడి ఐడియా- అపర్ణ కన్నీళ్లు

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 18 ఎపిసోడ్‌లో రాజ్‌ను మీడియా అడిగే ప్రశ్నలకు తాగుబోతు సమాధానాలు చెప్పి మరింత ఇరికిస్తాడు. తాగుబోతుకు అసలు విషయం తెలిసి రాజ్‌నే తిడతాడు. రాజ్‌కు జరిగింది తలుచుకుని ఇందిరాదేవి నవ్వుతుంటే అపర్ణ బాధపడుతుంది. రాజ్ మనసు మార్చేందుకు కనకం ఐడియా వేస్తుంది.

Published on: Oct 18, 2025, 07:41:40 IST
Advertisement

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య ఇంటి దగ్గర టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేస్తాడు. తాగుబోతు పిలవడంతో మీడియా వచ్చి రాజ్‌ను రకరకాల ప్రశ్నలు వేస్తుంది. దానికి తాగుబోతు సమాధానాలు చెబుతాడు. మా బ్రదర్ చెప్పిందే ఆవిడ వినాలి. అది తప్పు అయిన సరే అని తాగుబోతు అంటాడు.

సంకెళ్లు ఆపలేవు

బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 18 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 18 ఎపిసోడ్

అలా అయితే రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందని మీడియా జర్నలిస్ట్ అంటుంది. సూర్యుడిని మీ జైలు, సంకెళ్లు ఆపలేవంటాడు తాగుబోతు. దాంతో రాజ్, కావ్య కంగారుపడతారు. వాళ్లు ఏదేదో అనుకుంటారురా. అడ్డంగా బుక్ చేస్తున్నావ్ అని తాగుబోతును అంటాడు రాజ్. చూడండి వీడికి నాకు సంబంధం లేదు. నేను కూర్చొన్న పర్పస్ వేరు అని రాజ్ అంటాడు.

మీరు పెట్టిన ప్లకార్డ్స్ చూస్తుంటేనే మీకు మీ భార్యకు గొడవలు అవుతున్నాయని తెలుస్తోందని జర్నలిస్ట్ అంటుంది. మళ్లీ తాగుబోతు రెచ్చిపోతాడు. వీడు నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేస్తున్నాడు అని రాజ్ అంటాడు. ఇంతలో కావ్య వచ్చి మీకు ఇదివరకే చెప్పాం కదా. మాకు ఎలాంటి గొడవలు లేవని. ఈ టెంట్ ఇదంతా ఏదో నన్ను ఏడిపించడానికి ఆయన చేస్తున్నారు. ఆ తాగుబోతు మాటలు నమ్మి మీరు వచ్చారు అని కావ్య గట్టిగా చెబుతుంది.

దాంతో సారీ మేడమ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అని మీడియా వాళ్లు వెళ్లిపోతారు. సమయానికి వచ్చి కాపాడింది అని రాజ్ అనుకుంటాడు. నేను గనుక నా కడుపులో బిడ్డను చంపుకోమంటున్నారు అని చెబితే మీ సంగతి ఎమవుతుందో ఆలోచించారా అని కావ్య అంటుంది. అది విన్న తాగుబోతు రాజ్‌ను తిడతాడు. కడుపులో బిడ్డను ఎవరైనా చంపేసుకుంటారా. ఇకనుంచి నేను నా చెల్లికే సపోర్ట్ అని తాగుబోతు ప్లేట్ తిప్పేస్తాడు.

రాజ్ అవస్థలు

కనకం ఆపుతుంది. ఇలా అయితేనే ఆయన మనసు మార్చుకుని నీ దారికి వస్తాడు అని కనకం అంటుంది. అల్లుడి గారి మనసు మారాలంటే ఐడియా చెబుతాను అని కనకం ఏదో చెబుతుంది. రాజ్‌కు ఆకలేస్తుంది. రాజ్ ముందే కావ్యను తినమని కనకం చెబుతుంది. ముందు ఒప్పుకోని కావ్య తర్వాత సరే అంటుంది. రాజ్ ముందే నాటు కోడుతో తింటుంది కావ్య. ఊరిస్తూ తింటుంది కావ్య.

ఏంటీ కంట్రోల్ తప్పుతున్నాను. రాజ్ కంట్రోల్ అని మనసులో అనుకుంటాడు రాజ్. కానీ, బయటకు ఈ రాజ్ దేనికి లొంగడు అని అంటాడు. కనకం రెచ్చగొడుతుంది, ఊరిస్తుంది. అయిన రాజ్ అలాగే నిరాహార దీక్ష చేస్తాడు. ఇది సరిపోదు. డోస్ పెంచాలి అని కనకం కావ్యతో అంటుంది. మరోవైపు అపర్ణ పరధ్యానంగా ఉంటుంది. ఇందిరాదేవి, సుభాష్, సీతారామయ్య ఏమైందని అడుగుతారు.

బెండ్ తీస్తున్న కావ్య

రాజ్ గురించి ఆలోచిస్తుందని ఇందిరాదేవి చెబుతుంది. రాజ్ చేసినదాని గురించి చెబుతు కన్నీళ్లు పెట్టుకుంటుంది రాజ్. అన్నం తినకుండా ఎలా ఉంటున్నాడో ఏని ఏడుస్తుంది అపర్ణ. ఇలా గారాబం చేసే అలా మొండోడిని చేశావ్. కావ్య వాడి బెండ్ తీస్తుంటే నువ్వు బాధపడుతున్నావా అని ఇందిరాదేవి అంటుంది. తెల్లవారితే దీపావళి. పరిస్థితులు ఇలా ఉన్నాయని అపర్ణ ఫీల్ అవుతుంది.

గట్టిగా అనుకో అన్ని కుదుర్తాయ్ అని ఇందిరాదేవి అంటుంది. నాకు ఆకలిగా లేదని అపర్ణ వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌కు అన్నం ఇవ్వమని కృష్ణమూర్తికి చెబుతుంది కావ్య. ఇంత ప్రేమ ఉండి ఈ గొడవలు ఏంటమ్మా అని కృష్ణమూర్తి.

అది మీ అల్లుడినే అడగండి. నన్ను తీసుకెళ్లడానికి నిరాహార దీక్ష చేసేంత ప్రేమ ఉన్న ఆయన బిడ్డ వద్దనుకోడానికి కారణం ఏంటో తెలుసుకో అని తండ్రికి చెప్పి పంపిస్తుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe