Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో జైళ్లో ఉన్న వెంకీని రాజు, ఇందు కలుస్తారు. లక్ష్మి ఏడుస్తుంటుంది. ఏం జరిగిదంని రాజు అడుగుతాడు. వెంకీ సైలెంట్‌గా ఉంటాడు. నందుపై అరుస్తాడు రాజు. అరెస్ట్ చేసేముందు నాకోసారి కాల్ చేయొచ్చుగా అని రాజు కోప్పడతాడు. ఇందు నచ్చజెబుతుంది.
గోల్డ్ విషయంలో ఫ్రాడ్ జరుగుతుందని

మా కంపెనీలో గోల్డ్ విషయంలో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పానుగా. అందుకే ఇరికించినట్లున్నారు అని వెంకీ అంటాడు. ఇది ఐశ్వర్య పనే. నా మీద కోపంతో వీడిని ఇరికించింది అని రాజు కోప్పడతాడు. మా ఆఫీస్‌లో ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదని చెబితే నా మీదే కేసు పెట్టారని వెంకీ అంటాడు. ఇదే నిజమైతే వాళ్లను నేను విడిచిపెట్టను అని నందు అంటుంది.
నా తమ్ముడి అరెస్టుకు కారణమైన ప్రతి ఒక్కరి తాట తీస్తానని రాజు అంటాడు. ఇంతలో లాయర్ వచ్చి వెంకీకి బెయిల్ ఇస్తాడు. వెంకీని రిలీజ్ చేస్తారు. నా వల్లే ఇదంతా జరిగింది. ఐశ్వర్య చేసిందనని సారీ చెబుతాడు రాజు. వాళ్లు తప్పు చేసినదానికి నువ్వేం చేస్తావని వెంకీ అంటాడు. రాజు కోపంగా ఇంటికి వెళ్తాడు. వీడు ఆవేశంలో ఏం చేస్తాడో అని చలపతి భయపడతాడు.
మరోవైపు ఐశ్వర్య చేసినదానికి రేఖ, భ్రమరాంబ పొగుడుతారు. శేషు సెటైర్లు వేస్తాడు. ఎత్తుకు పయ్యెత్తు వేయడంలో, రాజు ఇందులకు చెక్ పెట్టడంలో, ఇంటిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడంలో నిన్నే మించిపోయేలా ఉందని భ్రమరాంబ అంటుంది. రేఖ కోపంగా చూడటంతో కవర్ చేస్తుంది భ్రమరాంబ. రాజు, ఇందులను తక్కువ అంచనా వేయకండి ఎరక్కపోయి ఇరుక్కుపోతారేమో అని శేషు అంటాడు.
మనం సేఫ్ అవుతామనేకదా
రేఖ పొగుడుతుంది. ఏదైనా తేడా వస్తే ఐషు ఇరుక్కుంటుంది. మనం సేఫ్ అవుతామనే కదా నీ ప్లాన్ అని రేఖతో అంటుంది భ్రమరాంబ. రాజు, ఇందు కారులో వస్తుంటారు. తప్పు చేసినవాన్ని పట్టుకుని నాలుగు పీకితే అసలు నిజం బయటపడుతుంది. దానికంటే ముందు ఐశ్వర్యను అనాలి. ఎవరి కర్మకు వాళ్లే బాధితులు అని రాజు అంటాడు.
{{/usCountry}}రేఖ పొగుడుతుంది. ఏదైనా తేడా వస్తే ఐషు ఇరుక్కుంటుంది. మనం సేఫ్ అవుతామనే కదా నీ ప్లాన్ అని రేఖతో అంటుంది భ్రమరాంబ. రాజు, ఇందు కారులో వస్తుంటారు. తప్పు చేసినవాన్ని పట్టుకుని నాలుగు పీకితే అసలు నిజం బయటపడుతుంది. దానికంటే ముందు ఐశ్వర్యను అనాలి. ఎవరి కర్మకు వాళ్లే బాధితులు అని రాజు అంటాడు.
{{/usCountry}}కరెక్టే కానీ మనం సరైన ఆధారాలు సంపాదించాలని ఇందు అంటుంది. మరోవైపు వెంకీని పోలీసులు అరెస్ట్ చేయడంపై నలుగురు నానా రకాలుగా అంటున్నారని బాధపడతాడు చలపతి. ఏదో దేశద్రోహం చేసినట్లు చూస్తున్నారు. పక్కనున్నవాళ్లు తోడేళ్లలా ఉన్నారని కన్నీళ్లుపెట్టుకుంటాడు. ఇంతలో నందు వస్తే.. చలపతి అరుస్తాడు.
నందుని లోపలికి రమ్మంటే చలపతి వద్దంటాడు. మీరంటే గొప్పోలు మీ ఇంట్లో తప్పులు జరిగితే చిటికెలో మార్చుకోగలరు. కానీ మా బతుకులు అలా కాదు. ఇంకెప్పుడు మా ఇంటి గుమ్మం తొక్కొద్దు. వెళ్లమ్మా వెళ్లు అని చలపతి అంటాడు. నేను కేసు విషయంలో ధైర్యం చెబుదామని వచ్చాను. కానీ, అంకుల్‌కి వేరేలా అర్థమైంది. నిన్ను కేసు నుంచి బయటకు తీసుకొస్తాను. ధైర్యంగా ఉండమని నందు అంటుంది.
దొంగ సొమ్ముకు అలవాటు పడ్డారా
అది కేసు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు చూద్దామని చలపతి అంటాడు. దాంతో నందు వెళ్లిపోతుంది. మరోవైపు ఐశ్వర్య అంటూ గొడవ చేస్తాడు రాజు. నా తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయించావని రాజు అడిగితే.. తనకు ఆ అవసరం ఏంటని లక్కీ అంటాడు. ఎలా ఉన్నాడు మీ తమ్ముడు. నువ్వెళ్లేసరికి బొక్కలు ఇరగ్గొట్టారా అని ఐశ్వర్య అంటుంది.
ఏంటీ రాజు మీ తమ్ముడుని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదా అని రేఖ అంటుంది. అన్నలాగే తమ్ముడు అని భ్రమరాంబ అంటుంది. ఫ్యామిలీ అంతా దొంగసొమ్ముకు అలవాటు పడ్డొట్టు ఉన్నారని భూషణ్ అంటాడు. ఇక ఆపుతారా అని ఇందు అంటుంది. నీ కంపెనీలో తప్పు జరుగుతుందని హెచ్చరిస్తే ఇరికిస్తావా అని రాజు అంటాడు.
చేతిలో రూపాయి లేనప్పుడే ఎంతో దిగజారింది. ఇప్పుడు కంపెనీ కాపాడుకునేందుకు ఎంతైనా దిగజారుతుందని రాజు అంటే.. అరేయ్ హర్టింగ్గా మాట్లాడకురా అని లక్కీ అంటాడు. అంటానురా. నీ భార్యను నువ్వు గుడ్డిగా నమ్మొచ్చు నేను కాదు. అన్ని సాక్ష్యాలతో నిరూపించి తనను కూడా జైళ్లో కూర్చొబెడతాను ఇది ఫిక్స్ అని రాజు ఛాలెంజ్ చేస్తాడు.
మేనేజర్‌కి డబ్బు ఆశ
నా ఎదుగుదల చూడలేక నన్ను ఇరికిస్తున్నారని ఐశ్వర్య అంటుంది. ఆధారాలతో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని రేఖ అనడంతో రాజు వెళ్లిపోతాడు. ఐశ్వర్య పొగరంతా దించుతా అని రాజు అంటాడు. ఐశ్వర్యను చాలా తెలివిగా హ్యాండిల్ చేయాలని ఇందు అంటుంది. ఇంతలో నందు వస్తుంది. ఇప్పుడు ఐశ్వర్య జాగ్రత్త పడుతుంది. మనం తనకంటే ఒకడుగు ముందుడాలని నందు అంటుంది.
ఐశ్వర్యతో చేతులు కలిపినవాడితో నిజం చెప్పించాలని. వాడి కంపెనీలో జరిగిన అవకతవకలన్నీ బయటకు తెస్తా. ఆ ఆధారాలు నిరూపించి కోర్టులో నిరూపిస్తా అని నందు అంటుంది. ఆధారాలతో నిరూపించేదాకా కోర్టు చుట్టూ తిరగాలా. ముందు ఆ మేనేజర్‌కి కాల్ చేసి డబ్బు ఆశ చూపించు. మన దగ్గరికే వస్తాడని ఇందుతో రాజు అంటాడు.
ఇప్పుడు వాడు మనల్ని నమ్మించడానికి నిజాలు బయటపెట్టే అవకాశం ఉందని నందు అంటుంది. వెంకీ మేనేజర్‌కి ఇందు కాల్ చేసి తనెవరో చెబుతుంది. దాంతో అతను తెగ సంతోషపడతాడు. లాభాలు ఐశ్వర్య కంపెనీకేనా మాకొద్దా అని ఇందు అంటుంది. అంటే మీరు కూడా మాతో చేతులు కలపాలనుకుంటున్నారా అని మేనేజర్ అంటే.. అవును అని ఇందు అంటుంది.
నకిలీ మొగుడిగా నటిస్తున్న వాడికే అలా ఉంటే
మీకు ఏం కావాలన్న చేస్తాను అని మేనేజర్ అంటాడు. అయితే, రెస్టారెంట్లో రేపు కలిసి మాట్లాడుకుందామని ఇందు అంటుంది. మేనేజర్ సరేనంటాడు. మరోవైపు ఐశ్వర్యకు లక్కీ ట్యాబ్లెట్స్ తీసుకెళ్లి ఇస్తాడు. ఐశ్వర్య కోప్పడుతుంది. రాజుగాడు అంతలా అంటుంటే నోర్మూసుకుని ఉన్నావ్. నకిలీ మొగుడిగా నటిస్తున్న వాడే అలా ఉంటే నువ్వేలా ఉండాలని ఐశ్వర్య అంటుంది.
నా మొగుడిగా ఉండాలంటే నా వైపు ఉండు అని ఐశ్వర్య అంటుంది. గొడవ ఇంకా పెద్దది అవుతుందని లక్కీ అంటాడు. ఆలోచించుకో నీకు వాడు కావాలో నేను కావాలో అని వెళ్లిపోతుంది ఐశ్వర్య. మరుసటి రోజు ఉదయం దుగ్గిరాల కంపెనీతో డీల్ అంటే కోట్లల్లో లాభం ఉంటుంది. లైఫ్ సెట్టు అని మేనేజర్ సంతోషిస్తాడు. మరోవైపు రాజు, ఇందు వస్తారు.
రాజు వర్సెస్ లక్కీ
వాళ్ల దగ్గరికి డాక్టర్ ఎంబీబీఎస్ వస్తాడు. ఆ డాక్టర్‌తో మేనేజర్ దగ్గర నిజాన్ని రాబట్టిస్తారు రాజు, ఇందు. అదే విషయాన్ని ఐశ్వర్యకు చెబుతారు. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే ఇంట్లో స్థానముండదని ఇందు అంటుంది. ఇందుని ఐశ్వర్య కొట్టబోతుంటే రాజు కొట్టబొతాడు. రాజును లక్కీ అడ్డుకుంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.