బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఇందుకు, ఐశ్వర్యకు ఒకే గదిలో ఎగ్జామ్ జరుగుతుంది. ఇందు మాస్క్ పెట్టుకుని ఉంటే ఫొటో ఐడెంటిఫై చేయాలని ఇన్విజిలేటర్ అంటాడు. దాంతో కాసేపు తటాపటాయించిన తర్వాత ఐశ్వర్యకు కనిపించకుండా కేవలం ఇన్విజిలేటర్‌కు మాత్రమే కనిపించేలా తన ముఖాన్ని మాస్క్ తీసి చూపిస్తుంది ఇందు.
స్లిప్స్‌తో ఎగ్జామ్

దాంతో ఇందును ఎగ్జామ్ రాయడానికి ఇన్విజిలేటర్ ఒప్పుకుంటాడు. తీసుకొచ్చిన స్లిప్స్ చూస్తూ ఐశ్వర్య పరీక్ష రాస్తుంటుంది. అది చూసిన ఇన్విజిలేటర్ ఐశ్వర్యను లేపి కొప్పడతాడు. నేను ముందే చెప్పాను స్లిప్స్ ఉంటే పడేయమని, ఈసారి స్క్వాడ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారని అరుస్తాడు ఇన్విజిలేటర్.
ఎవరికీ చెప్పకండి సర్ అంటూ ముందుగా బతిమిలాడుతుంది ఐశ్వర్య. అయిన ఇన్విజిలేటర్ ఒప్పుకోకపోవడంతో రివర్స్ అవుతుంది ఐశ్వర్య. తన ఇంటి గొప్పతనం గురించి చెబుతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ రెచ్చగొడుతుంది ఐశ్వర్య. డిబార్ అయితేనే నీలాంటి స్టూడెంట్స్‌కు బుద్ధి వస్తుందని అనుకున్న ఇన్విజిలేటర్ వెళ్లి ఐశ్వర్య చీటింగ్ చేసిన విషయం ఎగ్జామ్ స్క్వాడ్‌కు చెబుతాడు.
స్క్వాడ్‌ను బెదిరించిన ఐశ్వర్య
ఐశ్వర్య కూడా స్క్వాడ్ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా చీటింగ్ చేస్తూ పరీక్ష రాయడం తప్పు కదా. పైగా ఇన్విజిలేటర్‌నే తిడతావా, నువ్వు కచ్చితంగా డిబార్ అని ఐశ్వర్యను అంటాడు ఎగ్జామ్ స్క్వాడ్. దాంతో రుద్రాణి గురించి, తన కుటుంబం గురించి చెప్పి ఎగ్జామ్ స్క్వాడ్‌ను బెదిరిస్తుంది ఐశ్వర్య.
మరోవైపు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇందు కారు డ్రైవర్‌ను ఆపిన షామింగ్ మాల్ చోటుకు వెళ్తుంది. అప్పుడే అటువైపు వెళ్తున్న రేఖ రోడ్డు మీద ఇందును చూసి షాక్ అవుతుంది. అసలు దీన్ని ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టొద్దని చెప్పానుగా. అయినా నా మాటను లెక్కచేయకుండా బయటకు వెళ్లిందా. చెబుతాను దీని సంగతి అని రేఖ అనుకుంటుంది.
వణికిపోయిన ఇందు
ఇందు కంగారు కంగారుగా ఇంట్లోకి వస్తుంది. తీరా హాల్లో రేఖ కూర్చుని ఉంటుంది. రేఖను చూసి ఇందు వణికిపోతుంది. మెల్లిగా రేఖకు తెలియకుండా తప్పించుకోవాలనుకుంటుంది. కానీ, రేఖ మాత్రం ఇందును పిలిచి ఎక్కడికి వెళ్లావ్, నేను ఇంటి గడప దాటకూడదని చెప్పానుగా అని అడుగుతుంది.
{{/usCountry}}ఇందు కంగారు కంగారుగా ఇంట్లోకి వస్తుంది. తీరా హాల్లో రేఖ కూర్చుని ఉంటుంది. రేఖను చూసి ఇందు వణికిపోతుంది. మెల్లిగా రేఖకు తెలియకుండా తప్పించుకోవాలనుకుంటుంది. కానీ, రేఖ మాత్రం ఇందును పిలిచి ఎక్కడికి వెళ్లావ్, నేను ఇంటి గడప దాటకూడదని చెప్పానుగా అని అడుగుతుంది.
{{/usCountry}}దాంతో ఇందు భయపడిపోతుంది. అపర్ణ వైపు చూస్తుంది. అటు ఏం చూస్తున్నావ్. నేను ఆఫీస్ నుంచి ఇంటి వస్తుండగా నువ్వు నాకు రోడ్డు మీద కనిపించావ్ అని రేఖ చెబుతుంది. దాంతో ఇందు ఉలిక్కిపడుతుంది. ఆ ఏరియాలో నీకెంటీ పని అని తాను ఎలా చూసిందో చెబుతుంది రేఖ.
అడ్డంగా బుక్కయిన ఇందు
దానికి స్వాతి తన డ్రెస్ కుట్టించుకుని రమ్మందని బ్యాగ్‌లో నుంచి డ్రెస్ తీసి చూపిస్తుంది ఇందు. ఆ డ్రెస్ చూసిన రేఖ కొద్దిసేపటికి ఆ టైలర్ షాప్ పేరు ఏంటీ, నాకు టైలర్ ఫోన్ నెంబర్ చెప్పు అని రేఖ అంటుంది. దాంతో ఇందు అడ్డంగా ఇరుక్కుంటుంది. షాక్ అయిన ఇందు కేవలం అడ్రస్ చెబితే వెళ్లానని, అతని ఫోన్ నెంబర్ తెలియదని అంటుంది.
దాంతో స్వాతిని పిలుస్తుంది రేఖ. టైలర్ షాప్ అతని ఫోన్ నెంబర్ ఉందా అని స్వాతిని అడిగితే.. ఉందని చెబుతుంది. స్వాతి నుంచి ఫోన్ తీసుకుని టైలర్‌కు రేఖ కాల్ చేస్తుంది. అలా ఇందు అడ్డంగా దొరికిపోతుంది. అదంతా చూస్తున్న అపర్ణ షాక్ అవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.