బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ పెడుతున్న కొత్త కంపెనీ గురించి అక్కడికి వెళ్లి ఆరాలు తీస్తాడు రాహుల్. అక్కడ మేనేజర్‌తో మాట్లాడిన తర్వాత స్వరాజ్ గ్రూప్ నుంచి భారీ మొత్తంలో గోల్డ్, డబ్బు తరలిస్తున్నారు. వీటిని ఏ లెక్కల్లో చూపించలేదు. బాగా దొరికావ్ రాజ్ నేనేంటో చూపిస్తా అని అనుకుంటాడు రాహుల్.
పెళ్లి రోజు వేడుకలు

మరోవైపు అపర్ణ, సుభాష్ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. రాహుల్ కోపంగా రావడం చూసి రుద్రాణి అడుగుతుంది. కానీ, తల్లి రుద్రాణిపైనే చిరాకు పడతాడు రాహుల్. అదంతా పైనుంచి స్వప్న చూస్తుంది. రాహుల్ కోపంగా ఉంటే స్వప్న వెళ్లి ఏమైందని అడుగుతుంది.
రాజ్ పెడుతున్న కొత్త కంపెనీ గురించి స్వప్నకు రాహుల్ చెబుతాడు. గోల్డ్, డబ్బు కొత్త కంపెనీకి తరలిస్తున్నారని, అడిగితే నన్నే తప్పు పడతావా అని రాజ్ కోప్పడతాడేమో అని, సరైనా ఆధారాలు తెలియకుండా వాళ్లను ఎలా నిలదీయాలి అని రాహుల్ అంటాడు. సరైన ఆధారాలు దొరికితే అడగడంలో తప్పులేదని స్వప్న అంటుంది.
రాజ్ పర్సనల్ ల్యాప్‌ట్యాప్‌లో ఏమైనా ప్రూఫ్ దొరకొచ్చు. కానీ, అది మనం ఎలా చూడగలం. చూసిన తప్పు అవుతుంది కదా అని రాహుల్ అంటాడు. అలా ఏం కాదు. నేను తీసుకొస్తాను అని స్వప్న వెళ్తుంది. నువ్వు ఇలా చేయాలనేగా నేను ఇదంతా చేసింది అని అనుకుంటాడు రాహుల్.
మరింత తగలబెట్టు
ఇంతలో రుద్రాణి వస్తే నీ కోడలితో చిన్న చిచ్చు ప్లాన్ చేశాను. తను రగిలిస్తది. నువ్వు నీ పర్ఫామెన్స్‌తో మరింత తగలబెట్టు అని రుద్రాణితో రాహుల్ అంటాడు. రుద్రాణి చూస్తావుగా నా పర్ఫామెన్స్ అని అంటుంది. అందరు కింద సుభాష్, అపర్ణ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో సరదాగా, సంతోషంగా గడుపుతుంటారు.
ఇదే కరెక్ట్ టైమ్ అనుకున్న స్వప్న వెళ్లి రాజ్ పర్సనల్ ల్యాప్‌ట్యాప్, బ్యాగ్ చూస్తుంది. అందులో కొత్త కంపెనీకి సంబంధించిన ఆధారాలు, గోల్డ్, మనీని తరలించిన రికార్డ్స్ ఉంటాయి. అవి చూసి షాక్ అయిన స్వప్న వాటిని దొంగతనం చేసి తీసుకొస్తుంది. అందరూ సంతోషంగా పాటలకు డ్యాన్స్ చేస్తుంటే స్వప్న వచ్చి ఫ్లవర్ వాజ్ కింద పడేస్తుంది.
{{/usCountry}}ఇదే కరెక్ట్ టైమ్ అనుకున్న స్వప్న వెళ్లి రాజ్ పర్సనల్ ల్యాప్‌ట్యాప్, బ్యాగ్ చూస్తుంది. అందులో కొత్త కంపెనీకి సంబంధించిన ఆధారాలు, గోల్డ్, మనీని తరలించిన రికార్డ్స్ ఉంటాయి. అవి చూసి షాక్ అయిన స్వప్న వాటిని దొంగతనం చేసి తీసుకొస్తుంది. అందరూ సంతోషంగా పాటలకు డ్యాన్స్ చేస్తుంటే స్వప్న వచ్చి ఫ్లవర్ వాజ్ కింద పడేస్తుంది.
{{/usCountry}}ఆ సౌండ్ విని అంతా షాక్ అయి చూస్తారు. ఏమైంది అక్క. ఎందుకు అలా చేశావ్ అని కావ్య అడుగుతుంది. నానా రచ్చ చేస్తుంది. ఇష్టమొచ్చిన మాటలు అంటుంది స్వప్న. అసలు ఏమైంది స్వప్న. ఎందుకు అలా అంటున్నావ్ అని రాజ్ అడుగుతాడు. నువ్ చేసిన దాని గురించే అడుగుతున్న రాజ్. నమ్మించి ఇంత మోసం చేస్తావ్ అనుకోలేదు అని స్వప్న అంటుంది.
ఆర్ ఫ్యాక్టరీ అంటే ఏంటీ
ఇంతకీ ఏమైందో చెప్పుగా అని రాజ్ అంటాడు. ఆర్ ఫ్యాక్టరీ అంటే ఏంటీ అని రాజ్‌ని నిలదీస్తుంది స్వప్న. స్వరాజ్ గ్రూప్‌కు సంబంధం లేకుండా సెపరేట్‌గా కొత్త కంపెనీని ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అని మాటలతో నిలదీస్తుంది. కొత్త కంపెనీ గురించి స్వప్నకు తెలియడంపై రాజ్, కావ్య షాక్ అవుతారు.
స్వప్న మాటలతో ఇంట్లోవాళ్లందరికి ఆ నిజం తెలుస్తుంది. లెక్కలేని డబ్బును, కేజీల గోల్డ్‌ను కొత్త కంపెనీకి మళ్లిస్తున్నారు అని స్వప్న అంటుంది. ఇదేనా నిజాయితీ అంటే, ఇదేనా అందరిని సమానంగా చూసుకోవడం అంటే, ఎవరికి తెలియకుండా సెపరేట్‌గా కంపెనీ పెట్టి నిధులు దండుకుంటున్నారు అని రుద్రాణి అంటుంది.
అత్తా కోడలు ఒక్కటై రాజ్, కావ్యను నిందిస్తుంటారు. వాళ్లిద్దరు ఇలా మాట్లాడుతుంటే సైలెంట్‌గా ఉంటావేంట్రా. దోషిలా అనిపించుకోవడం ఎందుకు అని సుభాష్ అంటాడు. అత్తయ్య చెప్పింది నిజమే నాన్న అని రాజ్ చెబుతాడు.
రాజ్ బిగ్ ట్విస్ట్
రాజ్ మాటతో ఇంట్లోవాళ్లు షాక్ అవుతారు. తర్వాత కొత్త కంపెనీ ఎందుకు పెట్టాడో చెప్పి పెద్ద ట్విస్ట్ రివీల్ చేస్తాడు స్వరాజ్. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.