...
...
Next Story

OTT Crime: ఓటీటీని ఊపేస్తున్న నిత్యా మీనన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్- 10 హత్యల రావణ్ కిల్లర్- హీరోనే విలన్ అయితే?

Breathe Into The Shadows OTT Streaming Telugu: ఊహించని మలుపులు, ఉత్కంఠ రేపే సస్పెన్స్‌తో సాగే మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ఓటీటీతోపాటు ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. నిత్యా మీనన్, అభిషేక్ బచ్చన్ జంటగా నటించిన సిరీస్ బ్రీత్ ఇన్ టు ది షాడోస్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 26, 2026, 20:04:09 IST
Advertisement

Breathe Into The Shadows OTT Release Telugu: డిజిటల్ మీడియా ప్రపంచంలో సైకలాజికల్ థ్రిల్లర్ కథలకు ఉండే క్రేజ్ వేరు. సీటు అంచున కూర్చోబెట్టే సస్పెన్స్, అడుగడుగునా ఊహించని ట్విస్టులు ఉండే కథలను చూడటానికి మన ఓటీటీ ప్రియులు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు.

నిత్యా మీనన్, అభిషేక్ బచ్చన్ జంటగా

ఓటీటీని ఊపేస్తున్న నిత్యా మీనన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్- 10 హత్యల రావణ్ కిల్లర్- హీరోనే విలన్ అయితే?
ఓటీటీని ఊపేస్తున్న నిత్యా మీనన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్- 10 హత్యల రావణ్ కిల్లర్- హీరోనే విలన్ అయితే?

మీరు కూడా అలాంటి ఒక మైండ్ బెండింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కోసం చూస్తుంటే.. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ మోస్ట్ పాపులర్ ఓటీటీ సిరీస్‌ను అస్సలు మిస్ కాకూడదు. ఈ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్ తన కెరీర్‌లోనే ఉత్తమ నటనను కనబరిచి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు.

కథేంటి? అసలు ఏం జరిగింది?

మనం మాట్లాడుకుంటున్న ఆ క్రేజీ వెబ్ సిరీస్ పేరు 'బ్రీత్: ఇన్ టు ది షాడోస్' (Breathe: Into The Shadows). ఇప్పటివరకు రెండు సీజన్లుగా వచ్చిన ఈ ఓటీటీ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కథలోకి వెళితే.. డాక్టర్ అవినాష్ సబర్వాల్ (అభిషేక్ బచ్చన్) ఒక ప్రముఖ సైకియాట్రిస్ట్. ఆయన భార్య ఆభా (నిత్యా మీనన్), ఆరేళ్ల కుమార్తె సియాతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో, ఒకరోజు వారి కుమార్తె సియా హఠాత్తుగా కిడ్నాప్‌కు గురవుతుంది. సుమారు తొమ్మిది నెలల పాటు పాప ఆచూకీ కోసం ఎంత గాలించినా ఫలితం దక్కదు.

ఈ వరుస హత్యల కేసును ఛేదించడానికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ కబీర్ సావంత్ (అమిత్ సాధ్) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్ వేగవంతం అయ్యే కొద్దీ అసలు కథ బయటపడుతుంది. డాక్టర్ అవినాష్ 'డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్' (స్ల్పిట్ పర్సనాలిటీ)తో బాధపడుతున్నాడని, అతనిలోని మరో భయంకరమైన కోణమే 'జె' అని తెలుస్తుంది.

అవినాష్‌లోని పాత జ్ఞాపకాలు, చిన్నతనంలో అనుభవించిన కోపాన్ని బయటకు తీసేందుకు 'జె' అనే మానసిక స్వరూపమే ఈ కుట్ర మొత్తానికి మాస్టర్‌మైండ్‌గా మారి సొంత కూతురినే దాచిపెడుతుంది. అంటే అప్పటివరకు హీరో అనుకున్న క్యారెక్టరే విలన్‌గా మారుతుంది.

10 హత్యల రావణ్ కిల్లర్

మూడేళ్ల తర్వాత సాగే రెండో సీజన్‌లో 'జె' మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుని మళ్లీ తన మిషన్ ప్రారంభిస్తాడు. మీడియా అతనికి 'రావణ్ కిల్లర్' అని పేరు పెడుతుంది. అవినాష్ జీవితంలో తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసిన 10 మందిని అంతం చేయడమే లక్ష్యంగా 'జె' పెట్టుకుంటాడు.

అది కూడా పురాణాలకు లింక్ చేస్తూ 10 మందిని హత్య చేస్తాడు. అతనికి విక్టర్ (నవీన్ కస్తూరియా) అనే మరో వ్యక్తి తోడవుతాడు. కబీర్ సావంత్ వీరిని ఎలా పట్టుకున్నాడు అనే పోలీస్ వర్సెస్ కిల్లర్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ సీటు అంచున కూర్చోబెడుతుంది.

రేటింగ్ ఎంత?

మయాంక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మైండ్ బ్లోయింగ్ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్, అమిత్ సాధ్, నిత్యా మీనన్, సయామీ ఖేర్, నవీన్ కస్తూరియా అద్భుత నటనతో అలరించారు. ఐఎమ్‌డీబీ (IMDb)లో ఈ ఓటీటీ సిరీస్ 7.6 భారీ రేటింగ్‌ను దక్కించుకుంది.

బ్రీత్ ఓటీటీ స్ట్రీమింగ్

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్రీత్ ఇన్ టు ది షాడోస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగులో కూడా బ్రీత్ ఇన్ టు ది షాడోస్ ఓటీటీ రిలీజ్ అయింది. మొదటి సీజన్ 12 ఎపిసోడ్స్‌తో అలరించగా.. రెండో సీజన్ 8 ఎపిసోడ్స్‌తో అమెజాన్ ప్రైమ్ ఓటీటీని ఊపేస్తోంది.

వీకెండ్‌లో మంచి క్రైమ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉన్న 'బ్రీత్: ఇన్ టు ది షాడోస్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks