Web Series OTT: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘కాల్ మీ బే’. 2024లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో అదరగొట్టింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఈ కాల్ మీ బే సిరీస్ నుంచి సీజన్ 2 రాబోతుంది. ఈ సీజన్ ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.
కాల్ మీ బే సీజన్ 2 ఓటీటీ

ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచిన ‘కాల్ మీ బే’ వెబ్ సిరీస్ సీజన్ 2 గురించి అమెజాన్ ప్రైమ్ వీడియో అదిరిపోయే అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది. కామెడీ, సస్పెన్స్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా తదితర అంశాలతో తెరకెక్కుతున్న కాల్ మీ బే వెబ్ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 17 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రైమ్ వీడియో ప్రకటించింది.
శృతి హాసన్ ఎంట్రీ
కాల్ మీ బే వెబ్ సిరీస్ సీజన్ 2 లో జోష్ ను మరింత పెంచేలా మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె ఈ సీజన్ 2లో కీలక పాత్ర పోషించనుందని తెలిసింది. ఈ క్రేజీ సిరీస్ కు కొలిన్ డైరెక్టర్. ధర్మాటిక్ ఎంటర్ టైన్మెంట్స్ పై కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.
బ్లాక్ బస్టర్ సీజన్ 1 స్టోరీ ఇదే?
కాల్ మీ బే వెబ్ సిరీస్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఢిల్లీలోని ఓ రాజవంశపు కుటుంబానికి చెందిన బెల్లా అలియాస్ బే (అనన్య పాండే) చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఆమెను డబ్బు కోసం ఓ బడా వ్యాపారవేత్తకు ఇచ్చి పెళ్లి చేస్తారు. డబ్బు ఉన్నా బెల్లాకు ప్రేమ మాత్రం దొరకదు.
దీంతో జిమ్ ట్రైనర్ ప్రిన్స్ (వరుణ్ సూద్)తో బెల్లా అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. తన భర్త ఏర్పాటు చేసిన ఓ పెద్ద పార్టీలోనే ప్రిన్స్ ను కిస్ చేస్తూ బే దొరికిపోతుంది. దీంతో ఆమెను ఇంటి నుంచి గెంటేస్తారు.
{{/usCountry}}దీంతో జిమ్ ట్రైనర్ ప్రిన్స్ (వరుణ్ సూద్)తో బెల్లా అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. తన భర్త ఏర్పాటు చేసిన ఓ పెద్ద పార్టీలోనే ప్రిన్స్ ను కిస్ చేస్తూ బే దొరికిపోతుంది. దీంతో ఆమెను ఇంటి నుంచి గెంటేస్తారు.
{{/usCountry}}ముంబయికి వెళ్లిన బే ఓ జర్నలిస్ట్ గా మారుతుంది. మహిళలను వేధించే ఓ పెద్ద మనిషి రహస్యాలను బే బయటపెడుతుంది. దీంతో ఆమెపై అందరికీ మళ్లీ మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది.
రెండో సీజన్ లో ఇలా
కాల్ మీ బే సెకండ్ సీజన్ లో స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. తన మాజీ భర్త బే కోసం తిరిగొస్తాడు. మరోవైపు ఆఫీస్ బాస్ పై బేకు ఇష్టం కలుగుతుంది. మరోవైపు కొత్త షో స్టార్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో స్టోరీ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.