...
...
Next Story

Death: రణ్‌బీర్ కపూర్, అలియా భట్ మూవీ షూటింగ్‌లో కార్మికుడు దుర్మరణం- 40 లక్షల నష్ట పరిహారం- 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్!

Accident In Ranbir Kapoor Alia Bhatt Love And War Movie Set: సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మక చిత్రం లవ్ అండ్ వార్ షూటింగ్‌లో విద్యుత్ షాక్‌తో కార్పెంటర్ మరణించడం బాలీవుడ్‌లో కలకలం రేపింది. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారంతో పాటు భార్యకు ఉద్యోగం ఇవ్వాలని సినీ కార్మిక సమాఖ్య డిమాండ్ చేస్తోంది.

Published on: Jun 22, 2026, 12:05:22 IST
Advertisement

Accident In Ranbir Kapoor Alia Bhatt Love And War Movie Set: వెండితెరపై కనిపించే రంగుల ప్రపంచం వెనుక వందలాది మంది కార్మికుల రక్తం, చెమట దాగుంటాయి. ఒక్కోసారి ఆ రంగుల ప్రపంచంలో జరిగే ప్రమాదాలు కార్మికుల కుటుంబాల్లో కోలుకోలేని చీకట్లను నింపుతాయి.

అలియా భట్ షూటింగ్‌లో

రణ్‌బీర్ కపూర్, అలియా భట్ మూవీ షూటింగ్‌లో కార్మికుడు దుర్మరణం- 40 లక్షల నష్ట పరిహారం- 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్!
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ మూవీ షూటింగ్‌లో కార్మికుడు దుర్మరణం- 40 లక్షల నష్ట పరిహారం- 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్!

తాజాగా రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్‌తో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’ (Love & War) సెట్‌లో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ముంబైలోని ఫిల్మ్ సిటీలో గల రాయల్ పంప్ స్టూడియోలో జూన్ 17న తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

సెట్ నిర్మాణ పనుల్లో ఉన్న చంద్రధారి సింగ్ యాదవ్ (42) అనే కార్పెంటర్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక విచారణ ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో స్టార్ హీరోయిన్ అలియా భట్ అక్కడే షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం.

పరిహారం పెంచాలంటూ 'ఫైస్' డిమాండ్

మృతి చెందిన చంద్రధారి సింగ్ యాదవ్‌కు భార్య, ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి భన్సాలీ ప్రొడక్షన్స్ రూ. 40 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. అయితే ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని, పరిహారాన్ని రూ. 50 లక్షలకు పెంచాలని వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సమాఖ్య (FWICE) గట్టిగా డిమాండ్ చేస్తోంది.

ఆర్థిక సాయంతో పాటు యాదవ్ భార్యకు భన్సాలీ ప్రొడక్షన్స్‌లో ఏదైనా స్థిరమైన ఉద్యోగం కల్పించాలని సమాఖ్య కోరింది. అప్పుడే ఆ కుటుంబానికి శాశ్వత ఆర్థిక భరోసా లభిస్తుందని నొక్కి చెప్పింది. ఈ ప్రమాదం సినీ పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడిని, భద్రతా లోపాలను మరోసారి తీవ్రంగా చర్చకు తెచ్చింది.

20 గంటల పని.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు

ఒక నివేదిక ప్రకారం.. ప్రమాదానికి ముందు చంద్రధారి సింగ్ విరామం లేకుండా సుదీర్ఘ గంటల పాటు పనిచేశారు. వరుసగా మూడు రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు (దాదాపు 20 గంటలు) ఆయన విధుల్లోనే ఉన్నట్లు 'ఫైస్' జనరల్ సెక్రటరీ అశోక్ దూబే వెల్లడించారు.

తీవ్రమైన అలసట వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రొడక్షన్ హౌస్‌లు కార్మికుల షిఫ్టులను క్రమబద్ధీకరించాలని, సెట్లలో కరెంట్ వైరింగ్ వంటి విషయాల్లో భద్రతా తనిఖీలను కఠినతరం చేయాలని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

భారీ అంచనాలతో వస్తున్న 'లవ్ అండ్ వార్'

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న 'లవ్ అండ్ వార్' చిత్రంపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

బ్రహ్మాస్త్ర తర్వాత

లవ్ అండ్ వార్ చిత్రం 2027 జనవరి 21న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. 2022లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత రణ్‌బీర్, అలియా భట్ కలిసి నటిస్తున్న చిత్రమిదే. విక్కీ కౌశల్ గతంలో రణ్‌బీర్‌తో ‘సంజు’, అలియాతో ‘రాజీ’ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

భన్సాలీతో మరోసారి

అలాగే అలియా భట్ భన్సాలీతో ‘గంగూబాయి కతియావాడి’, రణ్‌బీర్ తన తొలి చిత్రం ‘సావరియా’ తర్వాత మళ్లీ ఈ దర్శకుడితో కలిసి పని చేస్తుండటంతో వ్యాపార వర్గాల్లో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe