బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ మెుదటి సినిమా నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాడు. మెుదటి సినిమా విడుదలకు ముందు స్టేజీపై అతడు చేసిన పనులకు యాటిట్యూడ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. చంద్రహాస్‌కు సంబంధించిన వీడియోలు అప్పట్లో మీమ్ పేజీలు తెగ వాడేసుకున్నాయి. అయినప్పటికీ అతడు ఎక్కడా తగ్గలేదు. నేను ఇంతే అన్నట్టుగా చెప్పేశాడు.

అయితే తాజాగా చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాడిన పాట గుంజి గుంజి మీద ఇప్పుడు పెద్ద ఎత్తున కాంట్రవర్సీ నడుస్తోంది. రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో మెుత్తం ఈ విషయం గురించే ఎక్కువగా టాపిక్. పెద్ద పెద్ద వ్యక్తులు సైతం చంద్రహాస్ పాడిన పాటపై మండిపడుతున్నారు. అదేంపాట అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
దీనిపై నటుడు చంద్రహాస్ ఓ వీడియో విడుదల చేశాడు. తను సారీ చెప్పినట్టుగా లేదని కూడా ఈ వీడియో మీద విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియోలో చంద్రహాస్ గతంలో తనను కూడా బూతులతో తిట్టారని, కానీ రియాక్ట్ కాలేదని చెప్పాడు. క్రిటిసిజంలా తీసుకున్నానని తెలిపాడు. పాటలోని బూతులు ఒరిజనల్ సాంగ్‌లో లేవని చెబుతున్నాడు చంద్రహాస్. కేవలం ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి తానే సృష్టించినట్టుగా వెల్లడించాడు.
తన పాటను ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చినవారు అభినందించారని, క్లాప్స్ కొట్టారని చంద్రహాస్ అన్నాడు. మరోవైపు దీనిపై సీనియర్ జర్నలిస్టు అశోక్ వేములపల్లి స్పందించారు. ఆ పాట ఏంటి, ఆ బూతులు ఏంటి అని గట్టిగా ప్రశ్నించారు. దీనిపై కూడా చంద్రహాస్ మాట్లాడాడు. తన ఇంట్లోవాళ్లను అశోక్ వేములపల్లి అన్నారని, 24 గంటల్లో సారీ చెప్పాలని డిమాండ్ చేశాడు.
'24 గంటల్లో సారీ చెప్పకపోతే నీకు ఉంటది. మా లాయర్లతో మాట్లాడుతున్నాను.' అంటూ కామెంట్స్ చేశాడు చంద్రహాస్. బెదిరించినట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశాడు. దీనిపై అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదాపూర్ ఠాణాలో కేసు నమోదైంది.
{{/usCountry}}'24 గంటల్లో సారీ చెప్పకపోతే నీకు ఉంటది. మా లాయర్లతో మాట్లాడుతున్నాను.' అంటూ కామెంట్స్ చేశాడు చంద్రహాస్. బెదిరించినట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశాడు. దీనిపై అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదాపూర్ ఠాణాలో కేసు నమోదైంది.
{{/usCountry}}బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ వారుసుడిగా చంద్రహాస్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. రామ్ నగర్ బన్నీ మూవీతో హీరోగా మారాడు. సినిమా కంటే ముందు తన ప్రవర్తనతో యాటిట్యూట్ స్టార్ అనే ట్యాగ్‌ను నెటిజన్ల నుంచి అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి గుంజి గుంజి అనే పాటతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు.