...
...
Next Story

అవతార్ కి బాప్.. టేక్ ఏ బో రాజమౌళి.. వారణాసి టీజర్ పై సెలబ్రిటీల రియాక్షన్ వైరల్.. ప్రశాంత్ నీల్ నుంచి కరణ్ జోహార్ వరకు!

వారణాసి టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్, కథ అనౌన్స్ చేస్తూ వచ్చిన టీజర్ వైరల్ గా మారింది. దీనిపై సెలబ్రిటీల రియాక్షన్ కూడా హాట్ టాపిక్ గా మారింది.

Published on: Nov 16, 2025, 14:27:53 IST
Advertisement

ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్ ను హైదరాబాద్ లో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్లో చిత్ర డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించారు. ఈ టైటిల్ టీజర్ అదరగొడుతోంది. వారణాసి మూవీ టీజర్ పై కరణ్ జోహార్, ప్రశాంత్ నీల్ వంటి ఫిల్మ్ మేకర్స్ నుంచి ఆడియన్స్ వరకూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

వారణాసి టీజర్

వారణాసి టీజర్ పై సెలబ్రిటీల రియాక్షన్
వారణాసి టీజర్ పై సెలబ్రిటీల రియాక్షన్

శనివారం (నవంబర్ 15) రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో వారణాసి టైటిల్ ను రివీల్ చేశారు. ఓ టీజర్ రిలీజ్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి వారణాసి టీజర్ ను సెలబ్రిటీలు ప్రశంసించారు. కరణ్ జోహార్ వారణాసికి చెందిన రుద్రగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ గురించి ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు. రాజమౌళి పోస్ట్ ను షేర్ చేస్తూ.. 'ఎపిక్!!! ది వన్ అండ్ ఓన్లీ ఎస్.ఎస్.రాజమౌళి’’ అని పేర్కొన్నారు.

టేక్ ఏ బో

కేజీఎఫ్, సలార్ లాంటి సెన్సేషనల్ హిట్స్ అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా వారణాసి టీజర్ చూసి ఇంప్రెస్ అయ్యారు. ‘‘టేక్ ఏ బో రాజమౌళి సర్. మహేష్ బాబు అబ్సల్యూట్ ఛార్మింగ్ గా కనిపిస్తున్నాడు. సూపర్ ఎగ్జైట్ అవుతున్నా’’ అని ప్రశాంత్ ఎక్స్ లో పోస్టు చేశాడు.

Karan Johar hails SS Rajamouli's Varanasi.

అవతార్ కి బాప్

గ్రాండ్ ఈవెంట్

హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈవెంట్ కు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా, ఎంఎం కీరవాణి, మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార తదితరులు హాజరయ్యారు. సాయంత్రం శృతి హాసన్ స్పెషల్ ప్రదర్శన కూడా ఇచ్చింది. వారణాసి సినిమాలో మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడు కుంభగా నటిస్తున్నారు. ఈ మూవీ 2027 సమ్మర్ లో రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks