...
...
Next Story

పెళ్లి రోజునే విడాకులు ఇచ్చిన భర్త, కన్నబిడ్డలే చదివి వినిపించిన నోటీసు- తెలుగు సీనియర్ హీరోయిన్ సెలీనా జైట్లీ కన్నీరు

Celina Jaitly Twins Read Her Divorce: తెలుగు సీనియర్ హీరోయిన్ సెలీనా జైట్లీ తన విడాకుల పోరాటంలోని చీకటి కోణాలను బయటపెట్టారు. 15వ పెళ్లి రోజునాడే విడాకుల నోటీసు చేతిలో పెట్టడమే కాకుండా, కన్నబిడ్డలను చూడాలంటే సూపర్‌మార్కెట్‌లో క్లీనర్ పని చేసుకోవాలంటూ భర్త అవమానించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Published on: Jul 5, 2026, 20:06:10 IST
Advertisement

Celina Jaitly Twins Read Her Divorce: ఒకప్పుడు బాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా వెలిగిన మాజీ మిస్ ఇండియా, తెలుగు సీనియర్ హీరోయిన్ సెలీనా జైట్లీ వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. భర్త పీటర్ హాగ్ నుంచి విడిపోవడానికి ఆమె చట్టపరమైన పోరాటం చేస్తున్నారు.

15వ పెళ్లి రోజునాడే

పెళ్లి రోజునే విడాకులు ఇచ్చిన భర్త, కన్నబిడ్డలే చదివి వినిపించిన నోటీసు- తెలుగు సీనియర్ హీరోయిన్ సెలీనా జైట్లీ కన్నీరు
పెళ్లి రోజునే విడాకులు ఇచ్చిన భర్త, కన్నబిడ్డలే చదివి వినిపించిన నోటీసు- తెలుగు సీనియర్ హీరోయిన్ సెలీనా జైట్లీ కన్నీరు

అయితే సెలీనా జైట్లీ విడాకుల వ్యవహారం రోజురోజుకూ అత్యంత బాధాకరంగా మారుతోంది. తన 15వ పెళ్లి రోజునాడే భర్త చేతికి విడాకుల పత్రాలు ఇవ్వడం, ఆ సమయంలో ఎదురైన ఘోర అవమానాలను గుర్తుచేసుకుంటూ సెలీనా కన్నీటిపర్యంతమయ్యారు.

2010లో ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను సెలీనా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అయితే, కొన్నేళ్లుగా భర్త నుంచి ఎదురవుతున్న మానసిక, శారీరక వేధింపులను తట్టుకోలేక 2025 నవంబర్‌లో సెలీనా ముంబై పోలీసులను ఆశ్రయించారు. పీటర్ హాగ్‌పై గృహహింస చట్టం కింద ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో సెలీనా జైట్లీ పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

కన్నబిడ్డలే చదివి వినిపించిన విడాకుల నోటీసు!

"నా 15వ పెళ్లి రోజున ఒక ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ ఇస్తాడని అనుకున్నా. కానీ, నా భర్త నన్ను పోస్టాఫీసుకు తీసుకెళ్లి కొన్ని పేపర్లు చేతిలో పెట్టాడు. ఆ నోటీసు పూర్తిగా జర్మన్ భాషలో ఉంది. నాకు అంత బాగా జర్మన్ రాదు. దాంతో అందులో ఏముందో అనువదించి చెప్పమని నా భర్తను అడిగా. కానీ అతను నిరాకరించి, నన్ను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు" అని సెలీనా చెప్పారు.

కోర్టు సూచనల ప్రకారం విడాకుల ప్రక్రియను సామరస్యంగా ముగించుకోవడానికి సెలీనా జైట్లీ ప్రయత్నించారు. తనకు ఎలాంటి భరణం వద్దని, కేవలం తాను పెట్టిన పెట్టుబడి, ఆస్తులు తిరిగి ఇచ్చేసి, పిల్లల సంరక్షణ బాధ్యతలను (Joint Custody) ఇద్దరూ పంచుకుంటే చాలని ప్రతిపాదించారు. అయితే దీనికి ఆమె భర్త, అతని తరఫు లాయర్లు దారుణమైన షరతులు విధించారు.

"విడాకుల తర్వాత నన్ను ముంబై వెళ్లనివ్వనని లాయర్ చెప్పారు. పిల్లలను చూడాలంటే ఆస్ట్రియాలోనే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలని నా భర్త కరాఖండిగా చెప్పాడు. నేనేం పని చేయాలని అడిగితే.. ఒక సూపర్‌మార్కెట్‌లో క్లీనర్ పని ఇప్పిస్తానని, మీ ఇండియాలో లాగా ఇక్కడ ఏ పనినీ తక్కువగా చూడరని నన్ను ఎగతాళి చేశాడు" అని సెలీనా జైట్లీ వాపోయారు.

ముదిరిన కోర్టు వివాదం.. ఎదురుదాడి చేస్తున్న భర్త

సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్, మామ వోల్ఫ్‌గ్యాంగ్ జె. హాగ్‌లపై గృహహింస, వేధింపుల కేసులు పెట్టి భరణం, నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు. జాయింట్ కస్టడీ ఉన్నప్పటికీ పిల్లలను తనతో మాట్లాడనివ్వడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు.

మరోవైపు భర్త కుటుంబం కూడా సెలీనాపై ఎదురుదాడికి దిగింది. ముంబైకి చెందిన లా ఫర్మ్ ద్వారా సెలీనాకు లీగల్ నోటీసులు పంపారు. ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ద్వారా తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తానికి ఒకప్పటి స్టార్ హీరోయిన్ జీవితం ఇలా కోర్టులు, వివాదాల చుట్టూ తిరగడం బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe