Chakkora Movie Review And Rating In Telugu: మాస్ కథలతో, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లతో వెండితెరపై తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్కూల్ నుంచి మరో కొత్త ప్రతిభ వెలుగులోకి వచ్చింది. పూరి జగన్నాథ్ వద్ద ఎంతోకాలంగా సహాయ దర్శకుడిగా పనిచేసిన మంగా శ్రీనివాస్ డైరెక్టర్‌గా మారిన సినిమానే 'చకోర' (లూనార్ లవ్ బర్డ్).
చకోర రివ్యూ

శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన చకోర చిత్రాన్ని డాక్టర్ చింతాడ హేమారావు నిర్మించగా, శ్రీలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై బాపిరాజు నిర్మించారు. ఇవాళ (అక్టోబర్ 9) చకోర మూవీ థియేటర్లలో విడుదలైంది. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, లక్ష్య సాధన కలబోతగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించిందో నేటి చకోర రివ్యూలో తెలుసుకుందాం.
లక్ష్య సాధన.. పట్టుదల కలిసిన ప్రేమ కథ!
చిన్నతనం నుంచి తల్లి చూపించే చందమామను చూస్తూ పెరిగిన ఒక సాధారణ యువకుడి జీవితం చుట్టూ ఈ 'చకోర' కథ తిరుగుతుంది. ఇద్దరు మిత్రుల మధ్య సాగే ఆసక్తికరమైన సంభాషణతో సినిమా కథ ప్రారంభమవుతుంది. నింగిలోని జాబిల్లి కోసం ఆరాటపడే చకోర పక్షిలాగే, తన జీవితంలో అనుకున్న ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని ఆ యువకుడు నిరంతరం శ్రమిస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడి జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి ప్రవేశిస్తుంది.
ఆమెను తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా భావించిన హీరోకు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. కొన్ని పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అసలు ఆ అమ్మాయి అతడికి ఎందుకు దూరమైంది? తన ప్రేమను, ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఆ యువకుడు ఎలాంటి పోరాటం చేశాడనేది తెలియాలంటే చకోర సినిమాను చూడాల్సిందే.
భావోద్వేగాల మేళవింపు.. స్క్రీన్‌ప్లే విశ్లేషణ
తెలుగు తెరపై ప్రేమకథలకు కొదువ లేదు. ప్రతిసారి ఓ లవ్ స్టోరీ సినిమా తెలుగు వెండితెరపైకి వస్తుంటుంది. అయితే కేవలం ప్రేమకే పరిమితం కాకుండా తల్లి-కొడుకుల అనుబంధం, స్నేహం, జీవితంలో అనుకున్నది సాధించాలనే పట్టుదలను జోడించి కథను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. చకోర పక్షి జాబిల్లి కోసం తపించే అంశాన్ని ప్రేమికుడి ఆరాటంతో ముడిపెట్టిన దర్శకుడి ఆలోచన మెప్పిస్తుంది.
{{/usCountry}}తెలుగు తెరపై ప్రేమకథలకు కొదువ లేదు. ప్రతిసారి ఓ లవ్ స్టోరీ సినిమా తెలుగు వెండితెరపైకి వస్తుంటుంది. అయితే కేవలం ప్రేమకే పరిమితం కాకుండా తల్లి-కొడుకుల అనుబంధం, స్నేహం, జీవితంలో అనుకున్నది సాధించాలనే పట్టుదలను జోడించి కథను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. చకోర పక్షి జాబిల్లి కోసం తపించే అంశాన్ని ప్రేమికుడి ఆరాటంతో ముడిపెట్టిన దర్శకుడి ఆలోచన మెప్పిస్తుంది.
{{/usCountry}}అయితే, కథలోని బలానికి తగినట్లుగా కథనం ఇంకాస్త పదునుగా ఉంటే సినిమా ఇంపాక్ట్ మరో స్థాయిలో ఉండేది. కొన్ని సన్నివేశాలు నెమ్మదించడం, కొన్ని సీన్లు ఊహించేలా ఉండటం వల్ల ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ తగ్గుతుంది. అయినప్పటికీ, ప్రేమను ఒక బాధ్యతగా, పట్టుదలగా భావించే యువకుడి ప్రయాణం మాత్రం ప్రేక్షకులను హృదయాలను తాకుతుంది.
నటీనటుల ప్రతిభ.. సాంకేతిక బలం
కథానాయకుడిగా పరిచయమైన శ్రవణ్ భావోద్వేగ సన్నివేశాల్లో చాలా బాగా ఒదిగిపోయే ప్రయత్నం చేశారు. హీరోయిన్ మలైకా టి. వాసుపల్ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. సీనియర్ నటులు సుమన్, ఎల్.బి. శ్రీరామ్ తమ సుదీర్ఘ అనుభవంతో పాత్రలకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ తమ పాత్రల పరిధి మేరకు బాగా మెప్పించారు.
పూరి జగన్నాథ్ కాంపౌండ్ నుంచి
ఇక సాంకేతికపరంగా చూస్తే, ప్రిన్స్ హెన్రీ అందించిన సంగీతం కథలోని అనుభూతిని మరింత పెంచగా, రుప్ప గోపీకృష్ణ సినిమాటోగ్రఫీ దృశ్యాలను అందంగా మలిచింది. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. పూరి జగన్నాథ్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకుడు మంగా శ్రీనివాస్ మొదటి ప్రయత్నంలోనే ఒక స్వచ్ఛమైన భావోద్వేగ కథను ఎంచుకుని థియేటర్లలో చకోర సినిమాను ఓసారి చూసేలా తెరకెక్కించారు.