టైటిల్: ఛాంపియన్

నటీనటులు: రోషన్ మేక, అనస్వర రాజన్, అవంతిక, కల్యాణ్ చక్రవర్తి, రచ్చ రవి, బలగం సంజయ్, కెకె మీనన్ తదితరులు
కథ: ప్రదీప్ అద్వైతం, రుతమ్ సమర్
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: మదీ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాతలు: స్వప్న, ప్రియాంక
విడుదల తేది: 25 డిసెంబర్ 2025
సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ రొమాంటిక్ యాక్షన్ సినిమా ఛాంపియన్. వైజయంతి మూవీస్ అనుబంధ సంస్థ 'స్వప్న సినిమా' పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు.
తెలంగాణ చరిత్రలోని వీరోచిత ఘట్టమైన 'బైరాన్‌పల్లి' సంఘటనల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇవాళ (డిసెంబర్ 25) థియేటర్లలో ఛాంపియన్ సినిమా విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి ఛాంపియన్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్ (రోషన్ మేక)కు ఫుట్‌బాల్ అంటే ప్రాణం. ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా సెటిల్ అవ్వాలన్నది అతని కల. అయితే, మైఖేల్ తండ్రి చేసిన తప్పు కారణంగా మైఖేల్ ఆయుధాలు డెలివరీ చేసే పనిలో ఇరుక్కుంటాడు.
ఈ క్రమంలో తప్పిపోయి తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామానికి చేరుతాడు మైఖేల్. అప్పటికే ఆ గ్రామం నిజాం రజాకార్ల అరాచకాలతో అతలాకుతలం అవుతుంటుంది. ఆ తర్వాత ఏమైంది ఒక ఫుట్‌బాల్ ప్లేయర్‌కు ఈ పోరాటంతో సంబంధం ఏంటి? మైఖేల్ తన కలను నిజం చేసుకున్నాడా? బైరాన్‌పల్లి ప్రజల కోసం అతను చేసిన యుద్ధం ఏమిటి? మైఖేల్ తండ్రి చేసిన తప్పు ఏంటీ? అనేది తెలియాలంటే ఛాంపియన్ చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజాం పరిపాలన, రజాకార్ల ఆకృత్యాలు చూపిస్తూ ఛాంపియన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మైఖేల్ పాత్ర పరిచయం, తన కోరిక, అందుకోసం చేసే పనులతో సాగుతుంది. ఆ తర్వాత మైఖేల్ తండ్రి చేసిన పని అడ్డంకిగా మారడం, అందుకు మూల్యం చెల్లించుకునేందుకు ఆయుధాలు డెలివరీ చేయడం వంటి సీన్లతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.
{{/usCountry}}నిజాం పరిపాలన, రజాకార్ల ఆకృత్యాలు చూపిస్తూ ఛాంపియన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మైఖేల్ పాత్ర పరిచయం, తన కోరిక, అందుకోసం చేసే పనులతో సాగుతుంది. ఆ తర్వాత మైఖేల్ తండ్రి చేసిన పని అడ్డంకిగా మారడం, అందుకు మూల్యం చెల్లించుకునేందుకు ఆయుధాలు డెలివరీ చేయడం వంటి సీన్లతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.
{{/usCountry}}బైరాన్‌పల్లికి మైఖేల్ వెళ్లడం, అక్కడ ప్రజలతో గడపడం, ఆ తర్వాత రజాకార్ దాడితో సినిమా మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ తర్వాత కాసేపు సినిమా స్లో అయిన ఫీలింగ్ కలిగిన క్లైమాక్స్ వచ్చేసరికి మంచి హై మూమెంట్స్ ఉన్నాయి. అయితే, సినిమా స్లో అయినట్లు అనిపించినా అదంతా చూసేలా గ్రిప్పింగ్‌గా డైరెక్టర్ తీర్చిదిద్దారు. ఆ విధానం ఆకట్టుకుంటుంది.
అంతేకాకుండా సినిమాలో వచ్చే లవ్ ట్రాక్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బాగా కుదిరాయి. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఆడియెన్స్‌ను కూర్చొబెట్టేలా సినిమాను తీర్చిదిద్దారు. క్లైమాక్స్ చాలా బాగా మెప్పిస్తుంది. సినిమాలో ఆర్ట్ వర్క్ చాలా హైలెట్ అయిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ సాయిధ పోరాటం సమయానికి తగినట్లుగా సెట్స్ బాగా కుదిరాయి.
టెక్నికల్ వర్క్
విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా 'గిరగిర' పాట, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. మాధీ సినిమాటోగ్రఫీ సినిమాను రిచ్‌గా చూపించడమే కాకుండా, బైరాన్‌పల్లి యాక్షన్ ఎపిసోడ్స్‌ను విజువల్ వండర్‌గా మార్చింది.
ఉన్నతమైన నిర్మాణ విలువలతో సాంకేతింగా బాగుంది ఛాంపియన్. ఇక రోషన్ మేక తన గత సినిమాల కంటే ఇందులో చాలా పరిణతితో నటన కనబరిచాడు. లుక్స్ పరంగానే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లోనూ, ఫుట్‌బాల్ ఆడే సన్నివేశాల్లోనూ రోషన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది.
ఆకట్టుకునే నటన
ఇక హీరోయిన్ అనస్వర రాజన్ తన పాత్ర (చంద్రకళ)లో ఒదిగిపోయింది. కేవలం అందానికే పరిమితం కాకుండా కథలో కీలకమైన పాత్ర పోషించిన ఆమె తన నటనతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. సీనియర్ నటుడు కళ్యాణ్ చక్రవర్తి రీ-ఎంట్రీ కూడా సినిమాకు ఒక బలంగా నిలిచింది. అవంతిక డ్యాన్స్‌తో అట్రాక్ట్ చేసింది.
ఓవరాల్‌గా చెప్పాలంటే
'ఛాంపియన్' కేవలం ఒక స్పోర్ట్స్ మూవీగానే కాకుండా మట్టి మనుషుల పోరాట గాథగా తెరకెక్కించారు. చారిత్రక అంశాలను, క్రీడా నేపథ్యాన్ని కలిపి చూపించడంలో దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయం. కథలో కొంత నెమ్మది ఉన్నా, రోషన్ నటన కోసం, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి కోసం ఛాంపియన్ సినిమాను కచ్చితంగా చూడవచ్చు.