ఓటీటీలోకి డైరెక్ట్ తెలుగు మూవీ రాబోతుంది. అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించిన చీకటిలో మూవీ నేరుగా ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ ను సోమవారం (జనవరి 12) రిలీజ్ చేశారు మేకర్స్. సైకో కిల్లర్ స్టోరీతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. స్టోరీ ఆద్యంతం ఉత్కంఠతో సాగేలా కనిపిస్తోంది.
చీకటిలో ఓటీటీ

శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించిన అప్ కమింగ్ మూవీ చీకటిలో. నాలుగేళ్ల తర్వాత శోభిత చేస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇది. అక్కినేని చైతన్యతో పెళ్లి తర్వాత ఆమె నుంచి రాబోతున్న మొదటి మూవీ కూడా ఇది. చీకటిలో మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. జనవరి 23, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్.
చీకటిలో ట్రైలర్
సైకో కిల్లర్ చుట్టూ సాగే సీరియల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చీకటిలో. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఓ న్యూస్ ఛానెల్ లో సంధ్య (శోభిత) పని చేస్తుంది. కానీ ఆ జాబ్ వదిలేసి సొంతంగా ట్రూ క్రైమ్ స్టోరీస్ చెప్పడానికి ‘చీకటిలో’ అనే పాడ్ కాస్ట్ ను స్టార్ట్ చేస్తుంది.
జంట హత్యలు
పాడ్ కాస్ట్ లో క్రైమ్ స్టోరీస్ గురించి చెప్తుంది సంధ్య. అయితే హైదరాబాద్ లోని ఓ ఇంట్లో జంట హత్యలు జరుగుతాయి. గోదావరి జిల్లాల్లో సీరియల్ కిల్లర్ చేసే హత్యల మాదిరే ఇవి ఉంటాయి. దీంతో ఈ హత్యలను సొంతంగా ఎంక్వైరీ చేస్తూ పాడ్ కాస్ట్ లో చెబుతుంటుంది సంధ్య. ఆ సైకో కిల్లర్ ఆడవాళ్లను రేప్ చేసి చంపుతుంటాడు. ఓ పాటర్న్ ప్రకారం మర్డర్లు చేస్తాడు.
చీకటిలో వచ్చి
{{/usCountry}}పాడ్ కాస్ట్ లో క్రైమ్ స్టోరీస్ గురించి చెప్తుంది సంధ్య. అయితే హైదరాబాద్ లోని ఓ ఇంట్లో జంట హత్యలు జరుగుతాయి. గోదావరి జిల్లాల్లో సీరియల్ కిల్లర్ చేసే హత్యల మాదిరే ఇవి ఉంటాయి. దీంతో ఈ హత్యలను సొంతంగా ఎంక్వైరీ చేస్తూ పాడ్ కాస్ట్ లో చెబుతుంటుంది సంధ్య. ఆ సైకో కిల్లర్ ఆడవాళ్లను రేప్ చేసి చంపుతుంటాడు. ఓ పాటర్న్ ప్రకారం మర్డర్లు చేస్తాడు.
చీకటిలో వచ్చి
{{/usCountry}}ఆ కిల్లర్ చీకటిలో వచ్చి హత్యలు చేస్తుంటాడు. ఈ ఎంక్వైరీలో అదిరే సస్పెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాగ్ చేశాడనే చంపేశాడు, మరి చీకటిలో చెప్పున్నవాళ్లను ఏం చేస్తాడనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసేంది. చీకటిలో సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నేరుగా ఓటీటీలోకి రిలీజ్ కానుంది.
చీకటిలో సినిమాలో శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రాచకొండ, చైతన్య వరలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని తదితరులు నటించారు. ఈ సినిమాకు శరణ్ కొప్పిసెట్టి డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్ దీన్ని నిర్మించింది.