మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ అదిరిపోయింది. ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ తో ధోని చేరాడు. ధోని ఎంట్రీ, సీఎస్కే జెర్సీ లాంఛ్ కోసం ఆ ఫ్రాంఛైజీ క్రియేట్ చేసిన వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలోని ‘టైగర్ కా హుకుం’ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటే ధోని ఎంట్రీ అదిరిపోయింది.
సీఎస్కే జెర్సీ

ఐపీఎల్ 2026 కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ తన జెర్సీ లాంఛ్ కోసం స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. డెన్ కమింగ్ జెర్సీ హీస్ట్ అంటూ వీడియోతో అదరగొట్టింది. ఈ వీడియోలో సీఎస్కే జెర్సీ ఉన్న బ్యాగ్ ను ఓ దొంగ వచ్చి తీసుకెళ్తాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో సహా సీఎస్కే ఆటగాళ్లు టీమ్ హోటల్ కు చేరుకుంటారు. జెర్సీ కోసం వెళ్లగా అక్కడ బ్యాగ్ ఉండదు.
హీరోలా ధోని
జెర్సీ బ్యాగ్ కనిపించకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్ వెంటనే తలా ధోనికి కాల్ చేస్తాడు. బైక్ పై ధోని వస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కారులో పారిపోతున్న దొంగను పట్టుకుని ధోని జెర్సీ తీసుకుని హోటల్ కు వస్తాడు. అప్పుడు రుతురాత్ 7 నంబర్ ఉన్న ధోని జెర్సీని లాంఛ్ చేస్తాడు. ఆ తర్వాత ధోని హోటల్ గదిలోకి వెళ్లిపోతాడు.
ధోని రాకతో
మహేంద్ర సింగ్ ధోని రాకతో సీఎస్కే ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నెలకొంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ధోని ఆడతాడో లేదో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ధోని ఇప్పుడు సీఎస్కే టీమ్ తో చేరడంతో అతను ఈ సీజన్ లో ఆడటం ఖాయమైంది. దీంతో సీఎస్కే ఫ్యాన్స్ ఆనందాన్ని అంతే లేకుండా పోయింది.
ఐపీఎల్ 2026
{{/usCountry}}మహేంద్ర సింగ్ ధోని రాకతో సీఎస్కే ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నెలకొంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ధోని ఆడతాడో లేదో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ధోని ఇప్పుడు సీఎస్కే టీమ్ తో చేరడంతో అతను ఈ సీజన్ లో ఆడటం ఖాయమైంది. దీంతో సీఎస్కే ఫ్యాన్స్ ఆనందాన్ని అంతే లేకుండా పోయింది.
ఐపీఎల్ 2026
{{/usCountry}}ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కాబోతుందని తెలిసింది. ఇది మార్చి 28 నుంచి మే 31 వరకు జరుగుతుందని సమాచారం. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడం అదే తొలిసారి. ఈ సీజన్ లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగనుంది.
ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు టైటిల్ కోసం మరోసారి పోరుకు సై అంటున్నాయి.