Chiraiya Ott: భార్య‌తో బ‌ల‌వంత‌పు శృంగారం-పీరియ‌డ్స్ వ‌చ్చాయ‌ని అక్క‌డ గాయం-12 భాషల్లో ఇవాళ ఓటీటీకి వ‌చ్చిన వెబ్ సిరీస్

Chiraiya Ott: డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశాన్ని ఇందులో చూపించారు. ఈ సిరీస్ ఏకంగా 12 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Mar 20, 2026, 13:21:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో ఫ్రైడ్ రిలీజ్ ల సందడి ఎక్కువగానే ఉంది. కొత్త సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. అయితే ఇందులో ఓ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశాన్ని డిస్కస్ చేసిన ఆ వెబ్ సిరీస్ పేరు.. ‘చిరాయ’. ఈ రోజు (మార్చి 20) ఓటీటీలోకి నేరుగా వచ్చింది ఈ వెబ్ సిరీస్.

ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ (x/JioHotstar)
ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ (x/JioHotstar)

చిరాయ ఓటీటీ

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘చిరాయ’. శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్‌ స్పెషల్ గా ఈ సిరీస్ రిలీజ్ అయింది. ఇందులో దివ్య దత్తా, సంజయ్ మిశ్రా, ప్రసన్న బిష్ఠ్, సిద్ధార్థ్ షా తదితరులు నటించారు. ఈ సిరీస్ కు శశాంత్ షా డైరెక్టర్.

6 ఎపిసోడ్లు

ఇవాళ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిరాయ వెబ్ సిరీస్ ఆరు ఎపిసోడ్లతో వచ్చింది. బెంగాలీలో వచ్చిన ‘సంపూర్ణ’ వెబ్ సిరీస్ కు రీమేక్ గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ చిరాయ సిరీస్ ను ఎస్వీఎఫ్ ఎంటర్ టైన్మెంట్ నిర్మించింది.

12 భాషల్లో

చిరాయ వెబ్ సిరీస్ ను ఏకంగా 12 భాషల్లో ఓటీటీ రిలీజ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, హర్యాన్వి, రాజస్థానీ, భోజ్ పురి, ఒరియా భాషల్లో ఈ సిరీస్ రిలీజైంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సిరీస్ ను మన భాషలో చూడొచ్చు.

చిరాయ స్టోరీ

మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశం చుట్టూ సాగే కథతోని చిరాయ వెబ్ సిరీస్ తెరకెక్కింది. పెళ్లి అయినప్పటికీ భార్య అంగీకారం లేకుండా భర్త బలవంతపు శృంగారంలో పాల్గొంటే అది రేప్ కిందకే వస్తుందనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. ఇప్పుడీ పాయింట్ ఆధారంగా చిరాయ సిరీస్ ను ఓటీటీలోకి తీసుకొచ్చారు.

పెద్ద ఫ్యామిలీ

అదో పెద్ద ఫ్యామిలీ. అందులో కమ్లేష్ (దివ్య దత్తా) ఆ ఇంటి పెద్ద కోడలు. ఆమెకు తన మరిది (భర్త తమ్ముడు) అరుణ్ (సిద్ధార్థ్ షా) అంటే మంచి అభిప్రాయం. అతను ఏ తప్పూ చేయడని ఆమె నమ్ముతుంది. అరుణ్ కు పూజ (ప్రసన్న బిష్ఠ్)ను ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత అరుణ్ లోని రాక్షసుడు బయటకు వస్తాడు. పూజకు ఇష్టం లేకపోయినా బలవంతంగా సెక్స్ చేస్తాడు.

పూజను సైకోలాగా హింసిస్తాడు అరుణ్. అరుణ్ అంటే చాలు పూజ భయపడిపోతుంది. ఈ విషయం తల్లికి చెప్పినా సర్దుకుపోవాలని చెప్పడంతో పూజ నిరాశ చెందుతుంది. అరుణ్ తో శృంగారం తప్పించుకోవడానికి పీరియడ్స్ వచ్చాయని చెప్పేందుకు తన జననాంగం దగ్గర గాయం కూడా చేసుకుంటుంది.

మరి అరుణ్ విషయం కమ్లేష్ కు తెలిసిందా? పూజ ఈ హింస నుంచి బయటపడిందా? అన్నది చిరాయ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More