...
...
Next Story

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేకు డబుల్ ధమాకా..విశ్వంభర రిలీజ్ డేట్.. మెగా 158 గ్లింప్స్..గెట్ రెడీ ఫ్యాన్స్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు రెండు భారీ సర్‌ప్రైజ్‌లు రెడీ అవుతున్నాయి. 'విశ్వంభర' మూవీ రిలీజ్ డేట్, బాబీ దర్శకత్వంలో రానున్న మెగా 158 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కానున్నాయనితెలిసింది. ఇక మెగా ఫ్యాన్స్ కు పండగే. డబుల్ ధమాకాకు రెడీ అయిపోండి.

Published on: Jul 31, 2026, 06:12:41 IST
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వచ్చిందంటే సినీ లవర్స్ కు, ఫ్యాన్స్ కు పెద్ద పండగే. ఈ సారి ఆ బర్త్ డే మామూలుగా ఉండట్లేదని టాక్. ఆ స్పెషల్ డే నాడు రెండు భారీ సర్ ప్రైజ్ లు ఉంటాయని అంటున్నారు. ఈ వార్తలు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు ఊపు తీసుకొస్తున్నాయి.

ఆగస్టు 22న ‘మెగా’ బ్లాస్ట్

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేకు డబుల్ ధమాకా..విశ్వంభర రిలీజ్ డేట్.. మెగా 158 గ్లింప్స్..గెట్ రెడీ ఫ్యాన్స్!
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేకు డబుల్ ధమాకా..విశ్వంభర రిలీజ్ డేట్.. మెగా 158 గ్లింప్స్..గెట్ రెడీ ఫ్యాన్స్!

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి రెండు భారీ ప్రకటనలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్నారని టాక్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశ్వంభర రిలీజ్ డేట్ తో పాటు మెగా 158 టైటిల్ గ్లింప్ కూడా రిలీజ్ చేస్తారని టాక్.

విశ్వంభర రిలీజ్ డేట్

చిరంజీవి హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వంభర. ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15, గురువారం రోజున దసరా పండగ సెలవుల కానుకగా విడుదల చేసే అవకాశముంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిరంజీవి బర్త్ డే (ఆగస్టు 22) రోజు రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ మూవీ వీఎఫ్ఎక్స్ పనులు కంప్లీట్ అయ్యాయని తెలిసింది.

మెగా 158 గ్లింప్స్

'వాల్తేరు వీరయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మూవీ మెగా 158 (వర్కింట్ టైటిల్). మెగాస్టార్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తారని సమాచారం.

విశ్వంభర వర్సెస్ జైలర్ 2

తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ విజువల్ గ్రాండియర్ 'విశ్వంభర'కు అత్యధిక థియేటర్ల కేటాయింపు జరగడం ఖాయం. అయితే తమిళనాడు, ఓవర్సీస్ (ఉత్తర అమెరికా) మార్కెట్లలో రజినీకాంత్ 'జైలర్ 2' నుంచి తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

పండగ అడ్వాంటేజ్

దసరా లాంటి లాంగ్ వీకెండ్ కావడం వల్ల సరైన టాక్ వస్తే రెండు పెద్ద సినిమాలకు బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా షేర్ వసూలు చేసే సామర్థ్యం ఉంటుంది. మరోవైపు గతంలో 'వాల్తేరు వీరయ్య'తో మాస్ విధ్వంసం సృష్టించిన బాబీ, మళ్లీ చిరంజీవితో జతకట్టడంతో #Mega158 గ్లింప్స్‌పై కూడా ట్రేడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 22న వచ్చే ఈ డబుల్ ధమాకా సోషల్ మీడియా రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe