...
...
Next Story

OTT Horror: ఓటీటీలోకి వచ్చిన హారర్ ఫ్యామిలీ డ్రామా- పగతో రగిలిపోయే గర్భవతి యక్షిణి- ఆకట్టుకునే ట్విస్టులు, మిస్టరీతో!

Chithini OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త హారర్ ఫ్యామిలీ డ్రామా సినిమా చితిని స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆకట్టుకునే ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ మిస్టరీతో సాగే ఈ సినిమాలో గర్భవతిగా ఉండే యక్షిణి దెయ్యం పగతో రగిలిపోతుంటుంది. ఇలాంటి చితిని ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 18, 2026, 13:35:13 IST
Advertisement

Chithini OTT Release: హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఓటీటీ లవర్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు కొత్త హారర్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతాయా అని కాచుకుని కూర్చుంటారు. అలాంటి హారర్ థ్రిల్లర్స్ ప్రియుల కోసం ఓటీటీలోకి వచ్చింది ఓ సినిమా.

పగతో రగిలిపోయే యక్షిణి

ఓటీటీలోకి వచ్చిన హారర్ ఫ్యామిలీ డ్రామా- పగతో రగిలిపోయే గర్భవతి యక్షిణి- ఆకట్టుకునే ట్విస్టులు, మిస్టరీతో!
ఓటీటీలోకి వచ్చిన హారర్ ఫ్యామిలీ డ్రామా- పగతో రగిలిపోయే గర్భవతి యక్షిణి- ఆకట్టుకునే ట్విస్టులు, మిస్టరీతో!

హారర్ ఫ్యామిలీ డ్రామాగా మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన సినిమానే చితిని (Chithini). ఈ సినిమాకు డైరెక్టర్ ఈస్ట్ కోస్ట్ విజయన్ దర్శకత్వం వహించారు. కేవీ అనిల్ కథ అందించారు. వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మోక్ష, ఆరతి నాయర్, ఏనాక్షి గంగూలీ కీలక పాత్రలు పోషించారు.

నూల్‌పుళ అనే గ్రామంలోని పాముక్కాడు అనే ప్రాంతంలో 'చితిని' అనే ఒక పగతో రగిలిపోయే యక్షిణిని బంధిస్తారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బందీగా ఉన్న ఆ యక్షిణి.. ఆ తర్వాత సంకెళ్లు తెంచుకుని బయటకు వస్తుంది. అదే సమయంలో సి.ఐ. అలాన్ ఆంటోనీ, దెయ్యాల అన్వేషకుడు (ఘోస్ట్ హంటర్) విశాల్ కొన్ని పరిస్థితుల వల్ల ఆ గ్రామానికి చేరుకుంటారు.

గర్భవతిగా యక్షిణి దెయ్యం

వారు అక్కడకు వచ్చినప్పటి నుంచి ఎదురైన వింత అనుభవాలు, రహస్యాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈసారి ఆ యక్షిణి పగకు బలికాబోయేది ఎవరు అనేదే చిత్ర ప్రధానాంశం. అయితే, పగతో రగిలిపోయే యక్షిణి గర్భంతో ఉంటుంది. గర్భవతిగా ఉన్న యక్షిణి దెయ్యం ఎవరి మీద పగతో రగిలిపోతుందనేదే సినిమా కథ.

కథలో హారర్‌తో పాటు ఇన్వెస్టిగేషన్ కోణాన్ని జోడించడం వల్ల ఇదొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిలిచింది. అందరూ చూపించే జంప్ స్కేర్స్ (హఠాత్తుగా భయపెట్టే ట్రిక్స్) జోలికి పోకుండా, కథనంతోనే భయాందోళనలు సృష్టించడంలో దర్శకుడు విజయం సాధించినట్లు రివ్యూలు వచ్చాయి.

కొత్త నటి ఇనాక్షి చితిని పాత్రలో ఒదిగిపోయింది. సి.ఐ. అలాన్‌గా అమిత్ చకలకల్, సీత పాత్రలో మోక్ష అద్భుతంగా నటించారు. కేవలం పాటలకే పరిమితం కాకుండా కథలో కీలకమైన సీన్లలో హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. విశాల్ పాత్రలో వినయ్ ఫోర్ట్, జానీ ఆంటోనీ, మణికందన్ ఆచారి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని థియేటర్లలో చూసిన వారు ప్రశంసించారు.

చితిని ఓటీటీ స్ట్రీమింగ్

చితిని సినిమాకు రంజిన రాజ్ అందించిన నేపథ్య సంగీతం (BGM), రతీష్ రవి సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా భయపెడతాయి. వీరిద్దరి పనితనం ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచాయని చెప్పుకోవచ్చు. మంచు తెరల వెనుక నుంచి చితిని ఎంట్రీ ఇచ్చే వంటి సీన్స్ వణుకుపుట్టించేలా ఉన్నాయని టాక్ వచ్చింది.

ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న చితిని ఓటీటీలోకి వచ్చేసింది. మనోరమ మ్యాక్స్‌లో చితిని ఓటీటీ రిలీజ్ అయింది. జూలై 17 నుంచి మనోరమ మ్యాక్స్‌లో చితిని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అతీంద్రియ శక్తులు, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, ఫ్యామిలీ డ్రామాతో కలగలిపిన చితిని ఓటీటీలో చూసేందుకు హారర్ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe