ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్’ ప్రభంజనం కొనసాగుతోంది. కేవలం కథ, యాక్షన్ మాత్రమే కాదు, ఈ సినిమాలోని పాటలు కూడా చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా దురంధర్ సినిమాలోని ‘షరారత్’ అనే డ్యాన్స్ నంబర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
తమన్నాను వద్దన్న దర్శకుడు

బ్యూటిపుల్ ఆయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా ఆడిపాడిన ఈ సాంగ్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ తాజాగా వెల్లడించారు. ఈ పాట కోసం కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ మొదట మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను తీసుకోవాలని అనుకున్నారట. అయితే, దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం అందుకు ససేమిరా అన్నారని విజయ్ తెలిపారు.
నా మైండ్‌లో తమన్నానే
"నా మైండ్‌లో ముందు తమన్నా పేరు మాత్రమే ఉంది. ఆమె అయితేనే ఈ పాటకు నిండుదనం వస్తుందని, సరైన న్యాయం చేస్తుందని ఆదిత్యకు నేను సూచించాను. కానీ, ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. ఇది రెగ్యులర్ 'ఐటెమ్ సాంగ్'లా ఉండకూడదని ఆయన ఖరాఖండిగా చెప్పేశారు" అని విజయ్ గంగూలీ తెలిపారు.
తమన్నాపైనే అందరి దృష్టి
"సినిమా స్టోరీని డిస్టర్బ్ చేసేలా ఏ ఒక్క అంశం కూడా ఉండకూడదన్నదే ఆదిత్య ధర్ ఉద్దేశం. ఒకవేళ ఈ పాటలో తమన్నా ఉంటే అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది తప్ప కథ మీద ఉండదు. సినిమా నుంచి ప్రేక్షకులు పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే ఒకరికి బదులు ఇద్దరు డ్యాన్సర్లను పెడదామని ఆదిత్య నన్ను ఒప్పించారు. అలా అయేషా, క్రిస్టల్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు" అని విజయ్ వివరించారు.
కరాచీలో జరిగి వెడ్డింగ్
కరాచీలో జరిగే ఒక హై-ప్రొఫైల్ వెడ్డింగ్ నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. అక్కడి కల్చర్‌కు అనుగుణంగా ఆ పాట తీరు ఉంటుంది. ఒకవేళ తమన్నా ఆ సాంగ్ చేసి ఉంటే తాము అనుకున్నది ప్రేక్షకులు ఫీల్ అవ్వలేకపోవచ్చు అన్న ఆలోచనతో తమన్నాను డైరెక్టర్ ఆదిత్య ధర్ రెజెక్ట్ చేసినట్లుగా విజయ్ గంగూలీ పేర్కొన్నారు.
స్పైగా రణ్‌వీర్ సింగ్
{{/usCountry}}కరాచీలో జరిగే ఒక హై-ప్రొఫైల్ వెడ్డింగ్ నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. అక్కడి కల్చర్‌కు అనుగుణంగా ఆ పాట తీరు ఉంటుంది. ఒకవేళ తమన్నా ఆ సాంగ్ చేసి ఉంటే తాము అనుకున్నది ప్రేక్షకులు ఫీల్ అవ్వలేకపోవచ్చు అన్న ఆలోచనతో తమన్నాను డైరెక్టర్ ఆదిత్య ధర్ రెజెక్ట్ చేసినట్లుగా విజయ్ గంగూలీ పేర్కొన్నారు.
స్పైగా రణ్‌వీర్ సింగ్
{{/usCountry}}ఇదిలా ఉంటే, నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా అద్భుత నటన కనబరిచారు. పాకిస్థాన్‌లోని లియారీ గ్యాంగ్ నెట్‌వర్క్‌ను ఛేదించే ఒక ఇండియన్ ఏజెంట్ కథగా ఈ చిత్రం రూపొందింది.
దురంధర్ కలెక్షన్స్
దురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా చేస్తే సారా అర్జున్ హీరోయిన్‌గా జోడీ కట్టింది. అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రలను పోషించారు. దురంధర్ సినిమా వరల్డ్ వైడ్‌గా 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 845 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.