...
...
Next Story

OTT Trending: ఓటీటీ రిలీజ్ రోజే ట్రెండింగ్- 341 పాయింట్లు, టాప్ 2లో ప్రియాంక చోప్రా స్పై యాక్షన్ థ్రిల్లర్- తెలుగులోనూ!

Priyanka Chopra Citadel 2 OTT Trending: ప్రియాంక చోప్రా స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్ 2 ఓటీటీ ట్రెండింగ్‌లో అదరగొడుతోంది. ఓటీటీ రిలీజ్ రోజు నుంచే ట్రెండింగ్‌లో నిలిచిన సిటాడెల్ సీజన్ 2 ప్రస్తుతం రెండో స్థానంలో దూసుకుపోతోంది. మరి సిటాడెల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: May 9, 2026, 13:45:40 IST
Advertisement

Priyanka Chopra Citadel 2 OTT Trending #2: ప్రపంచవ్యాప్తంగా అత్యంత బిగ్గెస్ట్ ఓటీటీ సిరీస్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన 'సిటాడెల్' రెండో సీజన్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం (మే 6) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిటాడెల్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీ రిలీజ్ రోజే ట్రెండింగ్- 341 పాయింట్లు, టాప్ 2లో ప్రియాంక చోప్రా స్పై యాక్షన్ థ్రిల్లర్- తెలుగులోనూ!
ఓటీటీ రిలీజ్ రోజే ట్రెండింగ్- 341 పాయింట్లు, టాప్ 2లో ప్రియాంక చోప్రా స్పై యాక్షన్ థ్రిల్లర్- తెలుగులోనూ!

అయితే, ఈ రెండో సీజన్‌కు ముందుగా ఎలాంటి హడావుడి, ప్రచార ఆర్భాటాలు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, ఎలాంటి ప్రమోషన్లు లేకపోయినా గ్లోబల్ లెవల్‌లో ఈ ఓటీటీ సిరీస్‌కు భారీ ఆదరణ దక్కుతోంది. ఫ్లిక్స్‌పెట్రోల్ (FlixPatrol) గణాంకాల ప్రకారం, ఓటీటీ రిలీజ్ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన షో జాబితాలో 'సిటాడెల్' రెండో స్థానాన్ని దక్కించుకుంది.

ప్రమోషన్లు నిల్.. క్రేజ్ ఫుల్!

సాధారణంగా ఇలాంటి భారీ బడ్జెట్ ఓటీటీ వెబ్ సిరీస్‌ల కోసం నెలల ముందు నుంచే ప్రచార పర్వం మొదలవుతుంది. కానీ, సిటాడెల్ సీజన్ 2 ఓటీటీ విషయంలో మేకర్స్ వ్యూహం మరోలా ఉంది. ఓటీటీ రిలీజ్ డేట్‌ను కేవలం రెండు వారాల ముందే ప్రకటించి, సిటాడెల్ 2 ట్రైలర్‌ను వదిలారు.

నటీనటుల ఇంటర్వ్యూలు, గ్రాండ్ ప్రీమియర్లు లేదా కనీసం నటీనటుల వీడియో బైట్స్ కూడా లేకుండానే సిటాడెల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చారు. గతేడాది మొదటి సీజన్ విడుదల సమయంలో మూడు ఖండాల్లో, నాలుగు ప్రధాన నగరాల్లో భారీ వేడుకలు నిర్వహించగా, ఈసారి మాత్రం అంతా నిశ్శబ్దంగా జరిగిపోయింది. కేవలం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న రూసో బ్రదర్స్ 'నో స్పాయిలర్స్ ప్లీజ్' అని పెట్టిన మెసేజ్‌తోనే సరిపెట్టారు.

నెంబర్ 2 స్థానంలో స్పై యాక్షన్ థ్రిల్లర్

భారత్‌తో సహా దాదాపు 37 దేశాల్లో ఈ సిటాడెల్ 2 షో ఓటీటీ టాప్-5లో నిలవడం విశేషం. మరో పాపులర్ షో 'ఇన్విన్సిబుల్' (Invincible) మూడో స్థానానికి పడిపోయింది. అయితే, ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్‌లో 'మ్యాన్ ఆన్ ఫైర్' (864 పాయింట్లు) ఇప్పటికీ ప్రథమ స్థానంలో ఉండగా, సిటాడెల్ గట్టి పోటీనిస్తోంది.

కథా నేపథ్యం ఇదే

ఒకప్పుడు అగ్రగామి గూఢచారి సంస్థగా ఉన్న సిటాడెల్‌కు చెందిన మేసన్ కేన్ (రిచర్డ్ మాడెన్), నాదియా సిన్హా (ప్రియాంక చోప్రా) అనే ఇద్దరు ఏజెంట్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రత్యర్థి సంస్థ చేసిన దాడిలో తమ గతాన్ని, జ్ఞాపకశక్తిని కోల్పోయిన వీరు.. మళ్లీ తమ అస్తిత్వాన్ని ఎలా వెతుక్కున్నారు? శత్రువులపై ఎలా ఎదురుదాడి చేశారనేది ఈ సీజన్ 2 హైలైట్.

Top Amazon Prime Video shows worldwide on May 6, 2026
RankShowPoints
1The Boys508
2Citadel341
3Invincible294
4The House of the Spirits188
5Young Sherlock165
6Scarpetta120
7Yo soy la Betty la fea112
8Las de siempre74
8Fallout74
10The Grand-ish Tour67
Data: FlixPatrol
View All

ఓటీటీ రిలీజ్ రోజు నుంచే

ప్రస్తుతం సిటాడెల్ 2 సీజన్ ఏడు ఎపిసోడ్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు భాషలో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఓటీటీ రిలీజ్ రోజే ట్రెండింగ్‌లోకి వచ్చి టాప్ 2గా నిలిచింది ప్రియాంక చోప్రా స్పై యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్ 2.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe