...
...
Next Story

Clayface Teaser: విలన్ పుట్టుకతో బాడీ హారర్ థ్రిల్లర్- శబ్ధాలతోనే భయపెడుతున్న క్లేఫేస్ టీజర్-శరీరం మట్టి ముద్దగా మారితే!

Clayface Teaser Released: డీసీ యూనివర్స్ (DCU) నుంచి వస్తున్న సరికొత్త బాడీ హారర్ థ్రిల్లర్ చిత్రం 'క్లేఫేస్' టీజర్ విడుదలైంది. సూపర్ హీరో సినిమాలంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు, వెన్నులో వణుకు పుట్టించే హారర్ కూడా ఉంటుందని ఈ టీజర్ నిరూపిస్తోంది.

Published on: Apr 26, 2026, 18:46:40 IST
Advertisement

Clayface Teaser Released: టాలీవుడ్ మాస్ సినిమాల్లో విలన్ ఎంట్రీ ఇస్తే థియేటర్లు దద్దరిల్లడం మనకు తెలుసు. కానీ, హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ గన్ నేతృత్వంలోని డీసీ యూనివర్స్ ఇప్పుడు విలన్ పుట్టుకను ఒక భీభత్సమైన హారర్ కథగా మలిచింది. సూపర్ హిట్ బ్యాట్‌మాన్ సిరీస్‌లో అత్యంత క్రూరమైన విలన్లలో ఒకడైన 'క్లేఫేస్' (Clayface) సోలో సినిమా టీజర్ బుధవారం (ఏప్రిల్ 22) విడుదలైంది.

బాడీ-హారర్ జోనర్‌లో విలన్ విశ్వరూపం

విలన్ పుట్టుకతో బాడీ హారర్ థ్రిల్లర్- శబ్ధాలతోనే భయపెడుతున్న క్లేఫేస్ టీజర్-శరీరం మట్టి ముద్దగా మారితే!
విలన్ పుట్టుకతో బాడీ హారర్ థ్రిల్లర్- శబ్ధాలతోనే భయపెడుతున్న క్లేఫేస్ టీజర్-శరీరం మట్టి ముద్దగా మారితే!

సూపర్ మ్యాన్, పీస్ మేకర్ వంటి చిత్రాలతో పోలిస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్ జోనర్‌లో ఉండటం గమనార్హం. సాధారణంగా సూపర్ హీరో సినిమాల్లో గ్రాఫిక్స్ హంగామా ఎక్కువగా ఉంటుంది. కానీ, క్లేఫేస్ టీజర్ చూస్తుంటే ఇది కేవలం గ్రాఫిక్స్ చిత్రం కాదు. ఒక పక్కా 'బాడీ-హారర్' మూవీ అని అర్థమవుతోంది.

ముఖం వికృతమైపోయిన ఒక నటుడు, తన రూపాన్ని కాపాడుకోవాలనే తాపత్రయంలో క్లే (మట్టి) మనిషిగా ఎలా రూపాంతరం చెందాడనేది ఇందులో చూపించారు. టామ్ రైస్ హారీస్ ఈ పాత్రలో జీవించేశాడు. ముఖం కరిగిపోతూ, శరీరం మట్టి ముద్దగా మారుతుంటే వచ్చే శబ్దాలు ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్నాయి.

మైక్ ఫ్లానగన్ కలం.. జేమ్స్ వాట్కిన్స్ మేకింగ్

క్లేఫేస్ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో ప్రధాన కారణం దీని వెనుక ఉన్న సాంకేతిక నిపుణులు. హారర్ చిత్రాల స్పెషలిస్ట్ మైక్ ఫ్లానగన్ ఈ కథను అందించారు. 90ల నాటి పాపులర్ 'బ్యాట్‌మాన్: ది యానిమేటెడ్ సిరీస్' ఆధారంగా మ్యాట్ హగన్ పాత్రను ఆయన తీర్చిదిద్దారు.

'స్పీక్ నో ఈవిల్' ఫేమ్ జేమ్స్ వాట్కిన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డైలాగులు ఏవీ లేకుండా, కేవలం భయానక శబ్దాలు, బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే ఒక వింతైన పాటతో సాగే ఈ క్లేఫేస్ టీజర్ 'పీక్ సినిమా' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మార్వెల్ వర్సెస్ డీసీ: కొత్త యుద్ధం

అక్టోబర్ 23న క్లేఫేస్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నావోమి ఆకీ, ఎడ్డీ మార్సన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో డీసీ యూనివర్స్ దిశను మార్చే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe