సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం "కాక్రోచ్". ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మార్చి 6న రిలీజ్

"కాక్రోచ్" సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై బి. బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కాక్రోచ్ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో కాక్రోచ్ మూవీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత బి. బాపిరాజు మాట్లాడుతూ.. "సునీల్ కుమార్ రెడ్డి గారితో మా కాంబినేషన్‌లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం" అని అన్నారు.
రిస్కీ షూటింగ్ చేశాం
"ఈ చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. సహజమైన లొకేషన్స్‌లో రిస్కీ షూటింగ్ కానీ చేశాము. సెన్సార్ వారు మా మూవీకి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మార్చి 6వ తేదీన మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం" అని బి బాపిరాజు తెలిపారు.
"మా డైరెక్టర సునీల్ కుమార్ రెడ్డి గారు స్క్రిప్ట్ చెప్పినదానికంటే ఇంకా బాగా సినిమాను తెరకెక్కించారు. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం ఇస్తుంది" అని నిర్మాత బి బాపిరాజు పేర్కొన్నారు.
జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్
డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "నేను జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. పాత్రికేయుడిగా నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో దర్శకుడిగా మారాను. ఆ క్రమంలోనే ఈ కాక్రోచ్ అనే చిత్రాన్ని కూడా రూపొందించాను" అని అన్నారు.
{{/usCountry}}డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "నేను జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. పాత్రికేయుడిగా నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో దర్శకుడిగా మారాను. ఆ క్రమంలోనే ఈ కాక్రోచ్ అనే చిత్రాన్ని కూడా రూపొందించాను" అని అన్నారు.
{{/usCountry}}"ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారి సపోర్ట్ నా సహచర పాత్రికేయ మిత్రుల సహకారం తీసుకున్నాను. అనేక కేసులను స్టడీ చేశాను. నేరస్థులతో కూడా చాలా విషయాలు అడిగి ఎన్నో కొత్త విశేషాలు తెలుసుకున్నాను. విశాఖ, గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయోలెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను" అని సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు.
చిన్న చిన్న దొంగతనాలు చేసేవారిపై
"వేల కోట్ల రూపాయల మోసాలు చేసేవారిని వదిలేసే ఈ వ్యవస్థ, చిన్న చిన్న దొంగతనాలు చేసేవారి మీద ప్రతాపం చూపిస్తుంటుంది. మురికి కూపాలలో ఉన్న నేరస్థుల జీవితాల్లోని అనుభవాలు, ప్రేమలు నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. అడ్డు రోడ్డు మీద ఉండే వేశ్యకు, ఒక క్రిమినల్‌కు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించాను" అని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
"డార్క్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. మనకు తెలియని ఒక ప్రపంచాన్ని పరిచయం చేసే చిత్రమిది. ఇలాంటి రియలెస్టిక్ సినిమాలు కూడా చూసి ఆదరించే ప్రేక్షకులు ఉంటారని నమ్ముతున్నాం. ఈ మూవీని డార్క్‌గా, ఓపెన్‌గా, బోల్డ్‌గా రూపొందించాం" అని చెప్పారు సునీల్ కుమార్ రెడ్డి.
వారు మాత్రం దూరంగా ఉండండి
"నేను చూసిన సమాజాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశాను. కేవలం వినోదం కోసం సినిమా చూసే వారికి మా మూవీ నచ్చకపోవచ్చు. కానీ మన సమాజంలో ఉన్న చేదు నిజాన్ని చూడాలనుకునేవారికి మా మూవీ తప్పకుండా నచ్చుతుంది అని నమ్ముతున్నాను. చిన్న పిల్లలు , సున్నిత మనస్కులు ఈ చిత్రానికి దూరంగా ఉండమని మనవి చేస్తున్నాను " అని సునీల్ కుమార్ రెడ్డి వెల్లడించారు.