...
...
Next Story

Cocktail 2 Collection: ఒక్కరోజే 17 కోట్లు- రష్మిక బాలీవుడ్ రొమాంటిక్ మూవీకి పెరుగుతున్న కలెక్షన్స్- 3 రోజుల్లో ఎంతంటే?

Rashmika Mandanna Cocktail 2 Box Office Collection Day 3: షాహిద్ కపూర్, రష్మిక మందన్నా, కృతి సనన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కాక్‌టెయిల్ 2’ మొదటి వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద నిలకడైన వసూళ్లను సాధించింది. ఒక్కరోజే 17 కోట్లు రాబట్టిన కాక్‌టెయిల్ 2 మూవీ 3 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలుసుకుందాం.

Published on: Jun 22, 2026, 10:50:55 IST
Advertisement

Rashmika Mandanna Cocktail 2 Box Office Collection Day 3: స్టార్ హీరో షాహిద్ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, గ్లామరస్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా ‘కాక్‌టెయిల్ 2’ (Cocktail 2). భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది.

క్రమంగా పెరుగుతున్న కలెక్షన్స్

ఒక్కరోజే 17 కోట్లు- రష్మిక బాలీవుడ్ రొమాంటిక్ మూవీకి పెరుగుతున్న కలెక్షన్స్- 3 రోజుల్లో ఎంతంటే?
ఒక్కరోజే 17 కోట్లు- రష్మిక బాలీవుడ్ రొమాంటిక్ మూవీకి పెరుగుతున్న కలెక్షన్స్- 3 రోజుల్లో ఎంతంటే?

కాక్‌టెయిల్ 2 సినిమాకు క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మొదటి వీకెండ్‌లో వసూళ్లు క్రమంగా పెరుగుతూ ట్రేడ్ వర్గాలను ఆకట్టుకున్నాయి. సెలవు దినం కావడంతో ఆదివారం (జూన్ 21) నాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి పట్టు సాధించింది.

ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ ‘శాక్‌నిల్క్’ అందించిన వివరాల ప్రకారం, ‘కాక్‌టెయిల్ 2’ విడుదలైన మూడో రోజు (ఆదివారం) దేశవ్యాప్తంగా రూ. 17.75 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. శుక్రవారం మొదటి రోజు రూ. 13.50 కోట్లతో ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం, శనివారం రెండో రోజు రూ. 16.25 కోట్లు వసూలు చేసింది.

ఆదివారం నాటి కలెక్షన్లతో కలిపి కాక్‌టెయిల్ 2 సినిమా మూడు రోజుల్లోనే ఇండియా వైడ్‌గా రూ. 47.50 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును అందుకుంది. ఇక ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం సాధించిన మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ. 55.45 కోట్లకు చేరాయి. అలాగే, వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 76.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది.

షాహిద్ పాత రికార్డులు బద్దలు.. ఒరిజినల్ వేటలో..

అయితే 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటి కాంబినేషన్‌లో వచ్చి క్లాసిక్‌గా నిలిచిన మొదటి ‘కాక్‌టెయిల్’ సినిమా లైఫ్‌టైమ్ వసూళ్ల రికార్డును (రూ. 71 కోట్లు) అందుకోవడానికి ఈ సీక్వెల్ మరికొన్ని రోజులు శ్రమించాల్సి ఉంటుంది. తెలుగు ప్రేక్షకులలో రష్మిక మందన్నాకు ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా సౌత్ బెల్ట్‌లో కూడా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.

సిసిలీ బ్యాక్‌డ్రాప్‌లో మోడ్రన్ లవ్ స్టోరీ

హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేటి తరం యువత ఆలోచనలకు అద్దం పడుతుంది. కాలేజ్ రోజుల్లోనే ప్రేమలో పడిన కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్నా) ఒకరినొకరు ప్రాణంగా ప్రేమిస్తారు. కానీ, పెళ్లి అనే బంధంపై వారికి నమ్మకం ఉండదు. ఈ క్రమంలో వారు సిసిలీ దీవులకు హాలిడే ట్రిప్ వెళ్తారు. అక్కడ దియా స్నేహితురాలు అలీ (కృతి సనన్) వారిని కలుస్తుంది.

ఆ పర్ఫెక్ట్ రొమాంటిక్ ట్రిప్‌లో దియా మనసులో ఒక తెలియని అభద్రతాభావం మొదలవుతుంది. కునాల్ తనను నిజంగా ప్రేమిస్తున్నాడా లేక ఏదో బాధ్యతగా పెళ్లి చేసుకుంటున్నాడా అనే అనుమానంతో, అతని నమ్మకాన్ని పరీక్షించడానికి తన స్నేహితురాలు అలీని కునాల్‌తో ఫ్లర్ట్ చేయమని దియా కోరుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఈ చిత్ర కథాంశం.

స్పిరిచువల్ సీక్వెల్

దినేష్ విజన్, లవ్ రంజన్, ప్రమిత ఆర్ విజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా, అమితాబ్ భట్టాచార్య పాటలు రాశారు. ఇది కేవలం ఒకే రకమైన కథా నేపథ్యంతో వచ్చిన స్పిరిచువల్ సీక్వెల్ మాత్రమే కానీ, పాత సినిమాకు ఎలాంటి సంబంధం లేదు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe