Rashmika Kriti Cocktail 2: కాక్‌టైల్ 2లో లెస్బియన్ లవ్ స్టోరీ? ఫిజికల్ కాదు ఎమోషనల్ త్రీసమ్ అన్న కృతి.. నవ్వేసిన రష్మిక
Rashmika Kriti Cocktail 2: షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నల మోస్ట్ అవేటెడ్ అర్బన్ డ్రామా 'కాక్‌టైల్ 2' చుట్టూ లెస్బియన్ రూమర్స్ అల్లుకున్నాయి. తాజాగా దీనిపై హీరోయిన్లు రష్మిక మందన్న, కృతి సనన్ క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
Rashmika Kriti Cocktail 2: బాలీవుడ్‌లో మోడరన్ రిలేషన్‌షిప్స్‌ను బోల్డ్‌గా చూపించడంలో దర్శకుడు హోమి అదజానియా స్టైలే వేరు. 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటి కాంబినేషన్‌లో వచ్చిన ‘కాక్‌టైల్’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'కాక్‌టైల్ 2' (Cocktail 2) వస్తుంది.

లెస్బియన్ రూమర్లు
జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా కాక్‌టైల్ 2 రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో రష్మిక మందన్న, కృతి సనన్ ల మధ్య లెస్బియన్ ప్రేమకథ ఉండబోతోందనే ఒక బోల్డ్ రూమర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
లైవ్‌లోనే నవ్వేసిన రష్మిక!
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఈ స్టార్ హీరోయిన్లు రష్మిక మందన్న, కృతి సనన్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. "ఈ సినిమాలో లెస్బియన్ లవ్ స్టోరీ ఉందా?" అని ఒకరు ప్రశ్నించగా.. రష్మిక మందన్న తన నవ్వును అస్సలు ఆపుకోలేకపోయింది. పక్కనే ఉన్న కృతి సనన్ వెంటనే మైక్ అందుకుని రూమర్స్‌కు ఎండ్ కార్డ్ వేసింది.
ఎమోషనల్ త్రీసమ్
"ఇందులో ఎలాంటి లెస్బియన్ స్టోరీ లేదు. మేము ముగ్గురం (షాహిద్, కృతి, రష్మిక) స్ట్రెయిట్ వ్యక్తులం. ఇది కేవలం ఎమోషనల్ త్రీసమ్ (భావోద్వేగ బంధం) మాత్రమే, ఫిజికల్ (శారీరక బంధం) కాదు" అని కృతి సనన్ స్పష్టం చేసింది. దీనిపై రష్మిక నవ్వుతూ.. "నాకు తెలుసు, మా ఇద్దరి మధ్య అంత మంచి కెమిస్ట్రీ ఉంది. అందుకే ఈ రూమర్స్" అంటూ సరదాగా వ్యాఖ్యానించింది.
అసలు ఈ రూమర్ ఎక్కడ పుట్టింది?
ఈ క్రేజీ రూమర్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని దర్శకుడు హోమి అదజానియా బయటపెట్టారు. "సినిమా సెట్స్‌లో కృతి, రష్మిక ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో ఒకరినొకరు కౌగిలించుకుంటూ కాస్త క్లోజ్‌గా ఉండేవారు.
ఒకవేళ ఈ కథ వీరిద్దరి గురించే అయ్యి, షాహిద్ కపూర్ కేవలం థర్డ్ వీల్ (మూడో వ్యక్తి) గా ఉంటే ఎలా ఉంటుందని మేమంతా సెట్‌లో సరదాగా జోక్ చేసుకున్నాం. అది కాస్తా బయటకి లీక్ అయి పెద్ద రూమర్‌గా మారింది" అని హోమి చెప్పారు. నిర్మాత దినేష్ విజన్ స్పందిస్తూ.. ఇందులో కేవలం రెండు ప్రేమకథలు (ఒకటి పాత ప్రేమ, రెండోది కొత్త ప్రేమ) మాత్రమే ఉంటాయని తేల్చి చెప్పారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


