...
...
Next Story

కమిటీ కుర్రోళ్లుకి 2 నేషనల్ అవార్డ్స్- నిహారిక కొణిదెల మూవీ ఇతర పురస్కారాలు, బడ్జెట్, కలెక్షన్స్, ఓటీటీ వివరాలు తెలుసా?

Committee Kurrollu Wins 2 National Awards: 72వ జాతీయ చ‌ల‌నచిత్ర అవార్డుల్లో 2024 ఏడాదికిగానూ తెలుగులో 2 విభాగాల్లో విజేత‌గా నిలిచి స‌త్తా చాటింది కమిటీ కుర్రోళ్లు సినిమా. నిహారిక కొణిదెల నిర్మాతగా మారిన ఈ కమిటీ కుర్రోళ్లకి వచ్చిన ఇతర అవార్డ్స్, బడ్జెట్, కలెక్షన్స్, ఓటీటీ స్ట్రీమింగ్‌పై లుక్కేద్దాం.

Published on: Jul 19, 2026, 09:36:13 IST
Advertisement

Committee Kurrollu National Award Other Awards And OTT: శ‌నివారం (జూలై 18) రోజున భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 72వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌ నిర్మాత‌గా మారి రూపొందించిన తొలి తెలుగు చిత్రం ‘క‌మిటీ కుర్రోళ్లు’ రెండు నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది.

గద్దర్ అవార్డ్ కూడా

కమిటీ కుర్రోళ్లుకి 2 నేషనల్ అవార్డ్స్- నిహారిక కొణిదెల మూవీ ఇతర పురస్కారాలు, బడ్జెట్, కలెక్షన్స్, ఓటీటీ వివరాలు తెలుసా?
కమిటీ కుర్రోళ్లుకి 2 నేషనల్ అవార్డ్స్- నిహారిక కొణిదెల మూవీ ఇతర పురస్కారాలు, బడ్జెట్, కలెక్షన్స్, ఓటీటీ వివరాలు తెలుసా?

తెలుగులో జాతీయ ఉత్త‌మ చిత్రంగా నిల‌వ‌టంతో పాటు మేక‌ప్ కేట‌గిరిలో (పి.ర‌వికుమార్‌) ఈ సినిమా అవార్డును ద‌క్కించుకుంది. ఇది వ‌ర‌కే అంటే 2024లో తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన గ‌ద్ద‌ర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, సామాజిక పురోగతిని ప్రతిబింబించే కేట‌గిరిలో ఉత్త‌మ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది.

కమిటీ కుర్రోళ్లు ద‌ర్శ‌కుడు య‌దు వంశీ సైతం ఉత్త‌మ డెబ్యూ డైరెక్ట‌ర్‌గా అవార్డును అందుకున్నారు. అలాగే దుబాయ్‌లో జ‌రిగిన గామా 2025 అవార్డ్స్ వేడుక‌లో బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూస‌ర్‌గా నిహారిక కొణిదెల‌, బెస్ట్ డెబ్యూ డైరెక్ట‌ర్‌గా య‌దు వంశీ అవార్డుల‌ను ద‌క్కించుకున్నారు. సైమా 2025 అవార్డ్స్‌లోనూ ఉత్త‌మ డెబ్యూ ప్రొడ్యూస‌ర్‌గా నిహారిక‌, ఉత్త‌మ డెబ్యూ యాక్ట‌ర్‌గా సందీప్ స‌రోజ్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు.

డెబ్యూ యాక్టర్‌గా సందీప్ సరోజ్

గోవాలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా 2025 అవార్డ్ వేడుక‌ల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్ట‌ర్ ఆఫ్ ఇండియ‌న్ ఫీచ‌ర్ ఫిల్మ్‌గా నామినేట్ అయ్యి అంత‌ర్జాతీయంగా గుర్తింపును సంపాదించుకుందీ క‌మిటీ కుర్రోళ్లు సినిమా. కేర‌ళ‌లో జ‌రిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఉత్త‌మ డెబ్యూ డైరెక్ట‌ర్‌గా య‌దు వంశీ, ఉత్త‌మ డెబ్యూ యాక్ట‌ర్‌గా సందీప్ స‌రోజ్ అవార్డుల‌ను కైవసం చేసుకున్నారు.

రూ.9 కోట్ల‌తో రూపొందిన క‌మిటీ కుర్రోళ్లు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ రూపంలో స‌త్తా చాటింది. థియేట్రిక‌ల్‌గా రూ.18.5 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌తో రూ.6 కోట్ల‌ను ద‌క్కించుకుంది. ఇలా మొత్తంగా రూ.24.5 కోట్ల‌ను రాబ‌ట్టిన చిత్రంగా కమిటీ కుర్రోళ్లు సినీ ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించింది.

పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌, శ్రీ రాధ దామోద‌ర్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై ప‌ద్మ‌జ కొణిదెల‌, జ‌య‌ల‌క్ష్మి అడ‌పాక, నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో య‌దు వంశీ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇటు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌తో పాటు అవార్డుల రేసులోనూ స‌త్తా చాటుతోంది.

నేషనల్ అవార్డ్స్ సాధించిన తెలుగు సినిమాలు:

బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్: పుష్ప 2 ది రూల్ (డైరెక్టర్ సుకుమార్)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: పుష్ప 2 (దీపాలి నూర్, శీతల్ వర్మ)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: కల్కి 2898 ఏడీ (నితిన్ జిహానీ చౌదరి)

బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్: లక్కీ భాస్కర్ (వెంకీ అట్లూరి)

బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్: 35 చిన్న కథ కాదు (దర్శకుడు, నిర్మాతలకు)

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: 35 చిన్న కథ కాదు (అరుణ్ దేవ్ పోతుల)

కమిటీ కుర్రోళ్లు ఓటీటీ స్ట్రీమింగ్

ఇదిలా ఉంటే, ఇప్పుడు కమిటీ కుర్రోళ్లు సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఆసక్తి నెలకొంది. ఈటీవీ విన్‌లో కమిటీ కుర్రోళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 2024 సెప్టెంబర్ 24న ఈటీవీ విన్‌లో కమిటీ కుర్రోళ్లు ఓటీటీ రిలీజ్ అయి అక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks