Crazy Kalyanam Movie Review And Rating In Telugu: బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నటుడు వీకే నరేష్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కిన రూరల్ కామెడీ డ్రామా సినిమా క్రేజీ కళ్యాణం. ఈ ముగ్గురు ప్రధాన పాత్రలతో పెళ్లిపై తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ రాజ్ మరో కీలక పాత్ర పోషించాడు.

భద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన క్రేజీ కళ్యాణం సినిమా ఇవాళ (అక్టోబర్ 16) థియేటర్లలో విడుదలైంది. పల్లెటూరి నేపథ్యం, ఆడపిల్ల చదువు, పెళ్లి, తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా వెండితెరపై ఎలా ఆకట్టుకుందో నేటి క్రేజీ కళ్యాణం రివ్యూలో చూద్దాం.
కథ:
పర్వతాలు (నరేష్ వీకే) ఊరిలో పరువుగా బ్రతికే సగటు గ్రామీణ తండ్రి. పెద్ద కూతురిని అన్న చూసిన సంబంధం అని బాలరాజు (తరుణ్ భాస్కర్)కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే బాలరాజు తాగుడుకు బానిసై ఊరంతా అప్పులు చేస్తూ, ఇంటిపైకి గొడవలు తెస్తూ పర్వతాలు పరువు తీస్తుంటాడు. ఈ బాధ నుంచి కోలుకోవడానికి తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కి మంచి ఆస్తిపాస్తులున్న, గుణగణాలున్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు.
ఇందుకోసం తన అన్న కూతురికి వచ్చిన ఎన్నారై సంబంధాన్ని కూడా తప్పుపట్టించి, తన కూతురికి సెట్ చేస్తాడు. మరోవైపు కీర్తి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి, తను ప్రేమించిన ఉదయ్ (అఖిల్ రాజ్)ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. అదే విషయం తండ్రికి చెబితే పర్వతాలు పెళ్లికి ఒప్పుకోడు.
తండ్రి పరువు.. కూతురి ఆశయం!
ఆ తర్వాత ఏమైంది? తండ్రి కూతురు మధ్య ఎలాంటి సంఘర్షణ మొదలైంది?, చివరికి కీర్తి పెళ్లి ఎవరితో జరిగింది? ఈ పెళ్లికి బాలరాజు చేసిన క్రేజీ పనులేంటీ? కీర్తికి సహాయం చేశాడా? సమస్యలు తీసుకొచ్చాడా? వంటి విషయాలు తెలియలాంటే? వెండితెరపై ఈ క్రేజీ కళ్యాణం చూడాల్సిందే.
విశ్లేషణ:
{{/usCountry}}ఆ తర్వాత ఏమైంది? తండ్రి కూతురు మధ్య ఎలాంటి సంఘర్షణ మొదలైంది?, చివరికి కీర్తి పెళ్లి ఎవరితో జరిగింది? ఈ పెళ్లికి బాలరాజు చేసిన క్రేజీ పనులేంటీ? కీర్తికి సహాయం చేశాడా? సమస్యలు తీసుకొచ్చాడా? వంటి విషయాలు తెలియలాంటే? వెండితెరపై ఈ క్రేజీ కళ్యాణం చూడాల్సిందే.
విశ్లేషణ:
{{/usCountry}}తెలంగాణ గ్రామీణ వాతావరణంలో తండ్రీకూతుళ్ల బంధాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు భద్రప్ప గాజుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆడపిల్ల పెళ్లికి చేసే ఖర్చులో పదో వంతు వారి చదువుపై పెడితే వాళ్ల భవిష్యత్తు బాగుపడుతుందనే మంచి సందేశాన్ని ఎంచుకున్నారు.
మొదటి భాగంలో పర్వతాలు కుటుంబం, తాగుబోతు అల్లుడి హంగామాతో చాలా కామెడీగా కథ మొదలవుతుంది. కీర్తి, ఉదయ్ లవ్ ట్రాక్ మొదలయ్యాక కథ కాస్త నెమ్మదిస్తుంది. ప్రథమార్థంలో లవ్ సీన్స్ సాధారణంగా సాగినా, ఇంటర్వెల్లోని ఎమోషనల్ సీన్స్ బాగా కుదిరాయి.
ప్రీ క్లైమాక్స్ నుంచి అలా
సెకండాఫ్లో కథనం కొంత గాడి తప్పినట్లు అనిపిస్తుంది. పెళ్లిని అడ్డుకోవడానికి హీరోహీరోయిన్లు చేసే ప్రయత్నాలు అంతగా బలంగా లేకపోవడంతో డ్రామా తగ్గింది. మధ్యలో వచ్చే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ సన్నివేశాలు బాగానే మెప్పిస్తాయి. ప్రీ-క్లైమాక్స్ నుంచి సినిమా మళ్లీ వేగం పుంజుకుంటుంది.
కూతురి భవిష్యత్తు కోసం తండ్రి పడే తపన ఏడిపిస్తుంది. పెళ్లి మండపంలో జరిగే గొడవలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్లో ఆడపిల్లల చదువు ప్రాధాన్యతను వివరిస్తూ ముగించిన తీరు బాగుంది. ఆడపిల్ల చదువు, పెళ్లి అనే అంశాలను కామెడీగా గ్రామీణ నేపథ్యంలో చెప్పిన తీరు మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
కీర్తి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ ఎంతో సహజంగా నటించింది. తెలంగాణ యాసను స్పష్టంగా పలుకుతూ, ఎమోషనల్ సీన్స్లో జీవిచేంసింది. తండ్రి పాత్రలో వీకే నరేష్ ఈ సినిమాకు హైలెట్గా నిలిచారు. కూతురిపై ప్రేమ, పరువు కోసం తపించే సగటు తండ్రిగా ఆయన తన నటనానుభవంతో ఎంతో మెప్పించారు. తాగుబోతు అల్లుడు బాలరాజుగా తరుణ్ భాస్కర్ తన మార్కు కామెడీతో నవ్వించాడు. అఖిల్ రాజ్ తన పాత్ర పరిధి మేర నటించాడు.
సురేశ్ బొబ్బిలి సంగీతంలో 'అలచంద్ర వంక' పాట ఆకట్టుకుంటుంది. బీజీఎమ్ కూడా సన్నివేశాలకు తగినట్లుగా అలరిస్తుంది. శ్యామ్ దూపాటి కెమెరా పనితనం గ్రామీణ అందాలను, పెళ్లి సంబరాలను తెరపై అందంగా చూపించింది. నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా ఉన్నాయి. ఫైనల్గా చెప్పాలంటే స్టోరీ రొటీన్ అనిపించిన నవ్వించే కామెడీ, ఏడిపించే ఎమోషన్తో మంచి సందేశం ఇచ్చే క్రేజీ కళ్యాణం సినిమాను ఓసారి చూడొచ్చు.