OTT Horror Telugu: థియేటర్లలో సంచలనం- ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్- మనుషులను పీక్కుతునే దెయ్యం- 7.7 రేటింగ్
Dahaan The Evil Within OTT Streaming In Telugu: థియేటర్లలో సంచలనం సృష్టించి 7.7 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ దహాన్: ది ఈవిల్ వితిన్ ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది. అక్టోబర్ 16 నుంచి తెలుగు, తమిళ భాషల్లో దహాన్ 2026 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అదెక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Dahaan The Evil Within OTT Release In Telugu: హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. భాషతో సంబంధం లేకుండా భయపెట్టే కథాంశాలు, ఉత్కంఠ రేకెత్తించే ట్విస్టులు ఉంటే చాలు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.

థియేటర్లలో సంచలనం
ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఒడియా సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా 'దహాన్: ది ఈవిల్ వితిన్' (Dahaan : The Evil Within) ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
గతంలో ప్రాంతీయ సినిమాలను కేవలం ఆయా రాష్ట్రాల వరకే పరిమితం చేసేవారు. కానీ డిజిటల్ యుగంలో మంచి కంటెంట్ ఎక్కడున్నా మన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఐఎమ్‌డీబీ (IMDb)లో ఏకంగా 7.7 రేటింగ్ సాధించిన దహాన్ ఓటీటీ ప్రియులకు ఇవాళ (అక్టోబర్ 18) వీకెండ్‌కి బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు అనుపమ్ పట్నాయక్ దర్శకత్వం వహించారు. దహాన్ ది ఈవిల్ వితిన్ చిత్రాన్ని అమియా పట్నాయక్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఔరోశిఖా మిశ్రా, బర్షా పట్నాయక్, సామ్రాట్ మహాపాత్ర, చౌదరి జయప్రకాష్ దాస్, పార్థ సారథి రే కీలక పాత్రలు పోషించారు.
మిస్టరీ భవనం.. సీక్రెట్ బాక్స్ తెరిచాక అసలు కథ!
సింగ్ దేవ్ అనే ఒక పాడుపడిన పాతకాలపు రాజభవనం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. స్థానికులు ఎవరూ ఆ భవనం వైపు వెళ్లేందుకు కూడా సాహసించరు. ఆ ఇంట్లో దెయ్యం ఉందని ఆ ఊరంతా భావిస్తుంది. అయితే, అదే ఇంట్లోకి నివసించేందుకు అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయి తన అక్క, తమ్ముడితో కలిసి వెళ్తారు.
అక్కడ నివసిస్తున్న సమయంలో, ఒక సీక్రెట్ బాక్స్‌ను అనుకోకుండా తెరుస్తారు. ఆ క్షణం నుంచే ఆ కుటుంబం జీవితం తలకిందులవుతుంది. ఆ బాక్స్ నుంచి బయటపడిన ఒక దుష్టశక్తి (దెయ్యం) ఆ అమ్మాయిని ఆవహించి, మానసికంగా, శారీరకంగా దెబ్బతీయడం ప్రారంభిస్తుంది.
దుష్టశక్తిపై పోరాటం.. సీటు చివర కూర్చోబెట్టే ఉత్కంఠ!
తమ చెల్లెలిని ఆ దుష్టశక్తి బారి నుంచి ఎలాగైనా కాపాడుకోవాలని అక్క, తమ్ముడు తీవ్రంగా శ్రమిస్తారు. అమ్మాయి శరీరంలో ఉన్న ఆ దెయ్యం పిచ్చిపట్టినట్లు చేయడం, మనుషులను పీక్కుతినడం వంటి జిగుప్సాకరమైన పనులన్నీ చేస్తుంది.
ఈ క్రమంలో ఒక ఫాదర్ (పాస్టర్) సాయం తీసుకుంటారు అక్కా, తమ్ముడు. ఆ ఫాదర్ రంగంలోకి దిగాక ఆ భవనంలో ఎలాంటి వింత సంఘటనలు జరిగాయి? ఆ రాజభవనం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఫాదర్, తోబుట్టువులు కలిసి ఆ భయంకరమైన దెయ్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అసలు ఆ దెయ్యం కథేంటీ? అనే అంశాలను దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
దహాన్ ది ఈవిల్ వితిన్ ఓటీటీ స్ట్రీమింగ్
ప్రతీ సన్నివేశంలోనూ హారర్ ఎలిమెంట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు నెక్ట్స్ లెవెల్ థ్రిల్‌ను అందిస్తాయి. ఇంతటీ క్రేజీ హారర్ థ్రిల్లర్ సినిమా దహాన్ ది ఈవిల్ వితిన్ ఓటీటీలో సందడి చేస్తుంది. అది కూడా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో. ఆహాలో దహాన్ ది ఈవిల్ వితిన్ ఓటీటీ రిలీజ్ అయింది.
అక్టోబర్ 16 నుంచి దహాన్ ది ఈవిల్ వితిన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒడియా సినిమా అయినప్పటికీ ఆహా ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో దహాన్ ప్రీమియర్ అవుతోంది. హారర్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి 'దహాన్' ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


