ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. డిఫరెంట్ ఎలిమెంట్స్‌తో వివిధ జోనర్స్‌ను యాడ్ చేస్తూ మరి తెరకెక్కించే ఈ హారర్ సినిమాలను చూసేందుకు ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే ప్రతి వారం సరికొత్తగా ఈ ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి.
పిల్లాడికి పట్టిన దెయ్యాన్ని

అయితే, గత వారం ఏకంగా 7 వరకు హారర్ థ్రిల్లర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో భయపెడుతూ, ఊహించని ట్విస్టులతో సాగే మిస్టరీ హారర్ థ్రిల్లర్ సినిమా ఒకటి ఉంది. అదే డార్క్ నన్స్. ఇది ఒక సౌత్ కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఓ పిల్లాడికి పట్టిన దెయ్యాన్ని వదిలించేందుకు దుష్ట శక్తితో ఇద్దరు నన్స్ పోరాటం చేస్తుంటారు.
సంగ్ హు క్యో, జియోన్ యో బీన్ ఇద్దరు నన్స్‌గా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు క్వోన్ హియోక్ జేయి దర్శకత్వం వహించారు. జిమ్ సినిమా ప్రొడక్షన్ కంపెనీపై నెక్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ డిస్ట్రిబ్యూషన్‌లో డార్క్ నన్స్ సినిమా విడుదలైంది. సౌత్ కొరియాలో జనవరి 24న థియేటర్లలో విడుదలైంది.
డార్క్ నన్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్
ఆ తర్వాత డార్క్ నన్స్ ఫిబ్రవరి 13న వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. దాంతో బాక్సాఫీస్ వద్ద 12 మిలియన్ యూఎస్ డాలర్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. గంట 54 నిమిషాల రన్‌టైమ్ ఉన్న డార్క్ నన్స్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 5.2 రేటింగ్ మాత్రమే దక్కింది.
ఇలాంటి డార్క్ నన్స్ ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 6 నుంచి డార్క్ నన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో డార్క్ నన్స్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, జియో హాట్‌స్టార్‌లో తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో డార్క్ నన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగులో చూడాలనుకునేవారికి
{{/usCountry}}ఇలాంటి డార్క్ నన్స్ ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 6 నుంచి డార్క్ నన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో డార్క్ నన్స్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, జియో హాట్‌స్టార్‌లో తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో డార్క్ నన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగులో చూడాలనుకునేవారికి
{{/usCountry}}అయితే, డార్క్ నన్స్ ట్రైలర్, కనిపించే సీన్స్ మాత్రం ఇంటెన్సివ్‌గా హారిఫిక్‌గా భయపెట్టేలా ఉన్నాయి. స్టోరీని పెద్దగా ట్రైలర్‌లో రివీల్ చేయలేదు. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు తెలుగులో చూడాలనుకుంటే ఈ డార్క్ నన్స్‌ను ట్రై చేయొచ్చు.
ఇక డార్క్ నన్స్ కథ విషయానికొస్తే.. సిస్టర్ జునియా, సిస్టర్ మిచెల్లా ఇద్దరు నన్స్ ఉంటారు. దుష్ట శక్తి పూనిని హీ జూన్ అనే పిల్లాడిని కాపాడేందుకు ఇద్దరు ప్రయత్నిస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ పిల్లాడిని వదిలి దెయ్యం వెళ్లదు. ఎన్నో ప్రాంతాలు, ఎంతోమందిని కలిసి ఆ దెయ్యం గురించి తెలుసుకుని వదిలించేందుకు ఇద్దరు నన్స్ పోరాటం చేస్తుంటారు.
డార్క్ నన్స్ ఓటీటీ స్ట్రీమింగ్
మరి ఆ దెయ్యాన్ని జునియా, మిచెల్లా వదిలించారా? ఆ పిల్లాడినే ఆ దుష్ట శక్తి ఎందుకు పట్టి పీడించింది? అసలు ఆ దెయ్యం ఎవరు? దానివల్ల వచ్చే ప్రమాదం, ఆపద ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న హారర్ థ్రిల్లర్ డార్క్ నన్స్ చూడాల్సిందే.