...
...
Next Story

Dear Heart: గుండెను పిండేసే డైలాగ్స్, రొమాంటిక్ బీజీఎమ్- డియర్ హార్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ సాయి రాజేష్

Dear Heart Motion Poster Released By Sai Rajesh: లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి నటించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ డియర్ హార్ట్ మోషన్ పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేశారు. ఈ చిత్రంలోని సంభాషణలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బీజీఎమ్ రొమాంటిక్‌గా మరింత హైలెట్ అవుతోంది.

Published on: Sep 4, 2026, 19:25:45 IST
Advertisement

Dear Heart Motion Poster Released By Sai Rajesh: తెలుగు చిత్రసీమలో యూత్‌ఫుల్ ఫీల్ గుడ్ ప్రేమకథలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. మనసును తాకే కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అలాంటి మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'డియర్ హార్ట్'.

డియర్ హార్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్

గుండెను పిండేసే డైలాగ్స్, రొమాంటిక్ బీజీఎమ్- డియర్ హార్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ సాయి రాజేష్
గుండెను పిండేసే డైలాగ్స్, రొమాంటిక్ బీజీఎమ్- డియర్ హార్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ సాయి రాజేష్

ఈ డియర్ హార్ట్ సినిమాలో లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి, సుప్రియా చవాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు జీడీ నరసింహ దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డియర్ హార్ట్ మోషన్ పోస్టర్‌ను 'బేబి' చిత్ర దర్శకుడు సాయి రాజేష్ ఆవిష్కరించారు. అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు డైరెక్టర్ సాయి రాజేష్.

గుండెను పిండేసేలా మోషన్ పోస్టర్ సంభాషణలు!

దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది. ప్రేమలోని గాఢతను, విరహ వేదనను ప్రతిబింబించేలా ఉన్న డైలాగ్స్ ఈ మోషన్ పోస్టర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

"కొన్ని ప్రేమ కథలు కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటాయి.. కానీ కొన్ని కథలు కాలం ఉన్నంత వరకు గుర్తుంటాయి.. నువ్వు నాకు ఎదురైన ప్రతీసారి కాలం కూడా ఒక్క క్షణం ఆగిపోయి చూసేది.. నా చివరి శ్వాస వరకు నా గుండె కొట్టుకున్న ప్రతీసారి ఆ చప్పుడు చెప్పే ఒకే ఒక్క పేరు నీదే.." వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా సాయి రాజేష్ ప్రోత్సాహం

ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు సరైన ప్రచారం లభిస్తే బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంటున్నాయి. 'హృదయ కాలేయం', 'బేబి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో వైవిధ్యమైన ప్రేమకథలను అందించిన దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆవిష్కరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కొత్త ప్రతిభను, చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ 'డియర్ హార్ట్' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరిస్తుందని డైరెక్టర్ సాయి రాజేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

విభిన్నమైన తారాగణం.. బలమైన సాంకేతిక వర్గం

కాగా, వారాహి ఆర్ట్స్ బ్యానర్‌పై బొబ్బాస్ సమర్పణలో రావి సౌజన్య ఈ డియర్ హార్ట్ చిత్రాన్ని నిర్మించారు. సురేష్ గురు, పృథ్వీరాజ్, సత్య ప్రకాష్, జబర్దస్త్ నూకరాజు, జగదీశ్వరి తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి అరవింద్ బి ఛాయాగ్రహణం వహించగా, ఎస్. సుహాస్ స్వరాలు సమకూరుస్తున్నారు. లక్ష్మణ్ టేకుమూడి, అజయ్ యార్లగడ్డ సంయుక్తంగా ఈ కథకు మాటలు అందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe