...
...
Next Story

DELULU Teaser: అత్తాపూర్‌ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా! డెలులు టీజర్‌ రిలీజ్.. నవ్విస్తోన్న కామెడీ డైలాగ్స్

Delulu Movie Teaser Released: తెలుగులో వస్తున్న సరికొత్త యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ డెలులు. ఇటీవల బాగా ట్రెండ్ అవుతోన్న డెలులు పదం టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఆద్యంతం కామెడీ డైలాగ్స్‌తో తెగ నవ్వించేలా డెలులు టీజర్ సాగింది. మరి ఈ డెలులు టీజర్ విశేషాలపై ఓ లుక్కేద్దాం.

Published on: Sep 4, 2026, 20:07:36 IST
Advertisement

Delulu Movie Teaser Released: యువతలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ అనే పదాన్నే టైటిల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్నారు.

యువతరం నటీనటులతో డెలులు

అత్తాపూర్‌ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా! డెలులు టీజర్‌ రిలీజ్.. నవ్విస్తోన్న కామెడీ డైలాగ్స్
అత్తాపూర్‌ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా! డెలులు టీజర్‌ రిలీజ్.. నవ్విస్తోన్న కామెడీ డైలాగ్స్

ఈ డెలులు సినిమాకు విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. టైటిల్‌ నుంచే విభిన్నంగా అనిపిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. యువతరం నటీనటులతో తెరకెక్కుతున్న ‘డెలులు’ మూవీ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

ఒక నిమిషం 32 సెకండ్ల డెలులు టీజర్

ఒక నిమిషం 32 సెకండ్ల నిడివి ఉన్న ఈ డెలులు టీజర్‌.. ‘బ్రేకప్ దేవా’ అనే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, పాత్రల మధ్య జరిగే సరదా సంభాషణలు టీజర్‌కు మంచి ఫన్‌ టచ్‌ను తీసుకొచ్చాయి. డెలులు టీజర్‌లోని పలు డైలాగ్స్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.

చీప్‌గా మగాడి కోసం మారతావా

‘ఆడదానివైన నువ్వు.. చీప్‌గా ఓ మగాడి కోసం మారతావా అంటావా.. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు’, ‘నువేమైనా ఫాదర్ ఆఫ్ ఇండియానా?’, ‘నువ్వు అత్తాపూర్‌కు రారా.. నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా’, ‘కుక్కకు పుట్టినవా నువ్వు’ వంటి డైలాగ్స్‌ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఈ డైలాగ్స్‌, కామెడీ సన్నివేశాలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్

మొత్తంగా డెలులు టీజర్‌ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌కు మంచి స్పందన రాగా.. తాజాగా వచ్చిన ఈ టీజర్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసినట్లయింది.

ఆకట్టుకుంటున్న సంగీతం

సాంకేతికంగా కూడా ‘డెలులు’కు మంచి బృందం పనిచేస్తోంది. ఈ మూవీకి జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. హరికృష్ణ కురపాటి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆది చెబ్రోలు సంగీతం అందిస్తున్నారు. టీజర్‌లో సంగీతం కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా ఆకట్టుకుంటోంది.

డెలులు నటీనటులు

డెలులు చిత్రంలో విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువతను టార్గెట్ చేసే ఫన్‌, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో ‘డెలులు’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

విభిన్నమైన టైటిల్ నుంచి ఫన్ ఎలిమెంట్స్ వరకు

టీజర్‌కు వస్తున్న స్పందనతో ‘డెలులు’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. విభిన్నమైన టైటిల్‌, కామెడీతో కూడిన కథనం, ఫన్‌ ఎలిమెంట్స్‌ సినిమాకు ప్లస్‌గా మారే అవకాశముంది. మరి థియేటర్లలో ‘డెలులు’ ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe