టైటిల్: దేవగుడి

నటీనటులు: అభినవ్ శౌర్య, అనుశ్రీ, నరసింహా తోషి, రఘు కుంచె, రాజశ్రీ నాయర్, రఘుబాబు, లక్ష్మణ్ మీసాల, రాకేట్ రాఘవ, అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్ తదితరులు
కథ, నిర్మాత, దర్శకత్వం: బెల్లం రామకృష్ణా రెడ్డి
సంగీతం: మదీన్ ఎస్‌కే
సినిమాటోగ్రఫీ: లక్ష్మీకాంత్ కనికే
ఎడిటింగ్: వీ నాగిరెడ్డి
విడుదల తేది: జనవరి 30, 2026
రచయితగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా బెల్లం రామకృష్ణా రెడ్డి తెరకెక్కిన లేటెస్ట్ తెలుగు మూవీ దేవగుడి. యాక్షన్ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన దేవగుడి సినిమా ఇవాళ (జనవరి 30) థియేటర్లలో విడుదల అయింది. ఫ్యాక్షనిస్ట్‌గా సింగర్ రఘు కుంచె నటించిన ఈ సినిమా ఎలా ఉందో? ప్రేక్షకులను ఆకట్టుకుందా? వంటి వివరాలను నేటి దేవగుడి రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
దేవగుడికి చెందిన వీరారెడ్డి (రఘు కుంచె) ఒక ఫ్యాక్షన్ లీడర్. ప్రజలందరినీ బాగా చూసుకునే అతను తన అనుచరులలో ఒకరి కొడుకు అయిన ధర్మ (అభినవ్ శౌర్య), తన కుమారుడితో (నరసింహ) స్నేహంగా ఉండడాన్ని మాత్రం సహించడు.
అలాంటి ధర్మతో కూతురు శ్వేత (అనుశ్రీ) ప్రేమలో ఉందని తెలిసి అతన్ని ఊరి నుంచి గెంటేస్తాడు వీరారెడ్డి. ఈ క్రమంలో వీరారెడ్డి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇద్దరు అనుచరులను ప్రత్యర్థులు చంపేస్తారు. మరోవైపు శ్వేత మిస్ అవుతుంది.
ఇంతకీ శ్వేత ఏమైంది? తన స్నేహితుడి చెల్లెలితో ధర్మ నిజంగానే ప్రేమలో పడ్డాడా? ధర్మ, శ్వేత ప్రేమ ఎక్కడ మొదలైంది? ఇద్దరు ఒక్కటయ్యారా? చివరికి వీరారెడ్డి ఏం చేశాడు? వంటి విషయాలు తెలియాలంటే దేవగుడి చూడాల్సిందే.
విశ్లేషణ:
{{/usCountry}}ఇంతకీ శ్వేత ఏమైంది? తన స్నేహితుడి చెల్లెలితో ధర్మ నిజంగానే ప్రేమలో పడ్డాడా? ధర్మ, శ్వేత ప్రేమ ఎక్కడ మొదలైంది? ఇద్దరు ఒక్కటయ్యారా? చివరికి వీరారెడ్డి ఏం చేశాడు? వంటి విషయాలు తెలియాలంటే దేవగుడి చూడాల్సిందే.
విశ్లేషణ:
{{/usCountry}}కుల వ్యవస్థపై ఇప్పటికీ ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రధానంగా కులం చుట్టూ తిరిగే కథలో వచ్చే సినిమాల్లో కోర్ పాయింట్ తెలిసేలా ఉంటుంది. అయితే, తెలిసిన విషయాన్ని ఎంత గ్రిప్పింగ్‌గా తెరకెక్కిస్తే ప్రేక్షకుడికి అంత కనెక్ట్ అవుతుంది. ఆ విషయంలో దేవగుడి సక్సెస్ అయిందనే చెప్పొచ్చు.
సమాజంలో ప్రధాన సమస్యలలో ఒకటైన కుల వ్యవస్థను ప్రశ్నిస్తూనే ఈ సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అన్నాచెల్లెళ్లు, తండ్రి అనుచరుడిగా పనిచేసే వ్యక్తి కుమారుడితో చాలా క్లోజ్ బాండింగ్ ఏర్పరచుకుంటారు. వయసుతో పాటు ఆ బంధం పెరుగుతూ వస్తుంది.
రెగ్యులర్ టెంప్లేట్
అబ్బాయిలు ఇద్దరూ స్నేహితులుగా సరదాగా తిరుగుతుంటే, అమ్మాయి మాత్రం ఆ కుర్రాడి మీద మనసు పడటం, తక్కువ కులానికి చెందిన అతన్ని ప్రేమించడం నచ్చని హీరోయిన్ తండ్రి, అతన్ని బయటకు గెంటేయడం, ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశాలతోనే కథ సాగుతుంది.
రెగ్యులర్‌గా తెలుగు సినిమాల్లో వచ్చిన టెంప్లెట్‌తోనే ఈ సినిమా వచ్చింది. కానీ, రాయలసీమలోని దేవగుడి అనే ఒక గ్రామం నేపథ్యంలో కథ అంతా సాగుతుంది. రాయలసీమ టచ్‌తో సినిమా కాస్తా ఆసక్తికరంగా సాగుతుంది.
ఇలాంటి సంఘటనలు
మనిషి టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినా పెళ్లి, చావు విషయంలో మాత్రం కులాల ప్రస్తావన కచ్చితంగా వస్తోన్న సంఘటనలు ఇప్పటికీ చూస్తున్నాం. ఈ అంశంతోనే సినిమాను ఎక్కడా బోర్ తెప్పించకుండా తెరకెక్కించడంలో డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారు.
సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలానే సాగిన కథను ప్రేక్షకులు ముందుగానే ఊహించేస్తారు. అయితే, ఉన్న బడ్జెట్‌లో సినిమాని ఎక్కడా చుట్టేసినట్లు కాకుండా, చాలా రిచ్ విజువల్స్‌తో, మంచి పాటలు, ఫైట్స్ కంపోజ్ చేసి ఒక మంచి కమర్షియల్ సినిమా ఫీల్ తీసుకురావడంలో డైరెక్టర్ విజయం సాధించారు.
నటీనటుల పర్ఫామెన్స్
ఇక దేవగుడి నటీనటుల విషయానికి వస్తే.. హీరోగా చేసిన అభినవ్ శౌర్యతో పాటు హీరోయిన్ అనుశ్రీ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే హీరోయిన్ సోదరుడి పాత్రలో నటించిన నరసింహ సైతం మెప్పించారు. వీరందరూ కొత్త ముఖాలైనప్పటికీ చాలా ఈజ్‌తో నటించారు.
ఇక సింగర్ రఘు కుంచె దేవగుడి వీరారెడ్డి అనే పాత్రలో జీవించేశారు. అలానే ఈ సినిమాలో నటించిన మీసాల లక్ష్మణ్, రఘుబాబు, రాకెట్ రాఘవ వంటి వాళ్లు ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు.
కుల వ్యవస్థను ప్రశ్నించే సినిమా
ఇక మదిన్ అందించిన సంగీతం బాగుంది. కొన్ని పాటలు వినడానికి బాగున్నాయి. అలాగే తెరమీద కూడా అంతే చక్కగా వాటిని తీసుకురావడంలో టీమ్ సక్సెస్ అయింది. నేపథ్య సంగీతం సినిమాకి తగ్గట్టుగా సరిపోయింది. నిడివి కూడా ఎక్కువ లేకుండా జాగ్రత్తలు తీసుకుంది చిత్ర బృందం. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే కుల వ్యవస్థను ప్రశ్నించే మరో తెలుగు సినిమానే దేవగుడి.