Yellamma First Look Devi Sri Prasad As Parshi: తనదైన మాస్, మెలోడీ పాటలతో కొన్ని దశాబ్దాలుగా దక్షిణాది సంగీత ప్రియులను ఊపేసిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించనున్నారు.
రెండేళ్ల పాటు చెక్కిన డ్రీమ్ ప్రాజెక్ట్

'బలగం' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి, దాదాపు రెండేళ్ల పాటు చెక్కిన డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ' ద్వారా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎల్లమ్మ సినిమా నుంచి ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
'పర్శి'గా దేవిశ్రీ రగ్గడ్ అవతారం.. ఊహించని మేకోవర్!
ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ 'పర్శి' అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఎల్లమ్మ పర్శి ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దేవిశ్రీ ప్రసాద్ చాలా సాధారణమైన దుస్తుల్లో, చేతిలో ఒక కిరీటం పట్టుకుని నిలబడి ఉన్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
అభిమానులకు సర్‌ప్రైజ్
ఎలాంటి అనవసర ఆర్భాటాలు, బిల్డప్‌లు లేకుండా చాలా సహజంగా ఉన్న ఈ లుక్, ఆయన అభిమానులకు అద్భుతమైన సర్‌ప్రైజ్ అని చెప్పాలి. దేవిశ్రీ కళ్లలోని అమాయకత్వం, ఆయన మేకప్, స్టైలింగ్ చూస్తుంటే ఒక సాధారణ వ్యక్తి వెనుక ఉన్న అసాధారణమైన కథను ఈ చిత్రం చెప్పబోతోందని స్పష్టమవుతోంది.
చాలా కాన్ఫిడెంట్‌గా దేవిశ్రీ
సినిమా రంగానికి నటుడిగా ఇది తొలి అడుగే అయినప్పటికీ, కెమెరా ముందు డీఎస్పీ ఎంతో ఈజ్‌తో, కాన్ఫిడెంట్‌గా కనిపించడం విశేషం. దర్శకుడు వేణు యెల్దండి తన కథపై, దేవిశ్రీ నటనపై ఉంచిన నమ్మకం ఈ పోస్టర్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణ మట్టి వాసనతో కూడిన పవర్‌ఫుల్ డ్రామా
{{/usCountry}}సినిమా రంగానికి నటుడిగా ఇది తొలి అడుగే అయినప్పటికీ, కెమెరా ముందు డీఎస్పీ ఎంతో ఈజ్‌తో, కాన్ఫిడెంట్‌గా కనిపించడం విశేషం. దర్శకుడు వేణు యెల్దండి తన కథపై, దేవిశ్రీ నటనపై ఉంచిన నమ్మకం ఈ పోస్టర్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణ మట్టి వాసనతో కూడిన పవర్‌ఫుల్ డ్రామా
{{/usCountry}}తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ కథకు దేవిశ్రీ ప్రసాద్ నుంచి అత్యుత్తమమైన, లోతైన నటన అవసరం. ఆయన పోషిస్తున్న 'పర్శి' పాత్ర సినిమాలో అత్యంత కీలకమైనదని, పలు రకాల భావోద్వేగాలను పండించాల్సి ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.
ప్రతి సన్నివేశంలోనూ అంకితభఆవం
"నటుడిగా దేవిశ్రీకి ఇది మొదటి చిత్రమే అయినప్పటికీ, ఆయన పడ్డ కష్టం, చూపించిన అంకితభావం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తాయి. తెరపై ఆయన నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది" అని చిత్ర యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ప్రతి ఒక్కరి గుండెను తాకేలా
తెలంగాణ నేటివిటీని తెరపై ఆవిష్కరించడంలో వేణు యెల్దండికి ప్రత్యేక ముద్ర ఉంది. 'బలగం' చూపించిన బాటలోనే, ఈ 'ఎల్లమ్మ' కూడా ప్రతి ఒక్కరి గుండెను తాకేలా ఉండే పవర్‌ఫుల్ విలేజ్ డ్రామాగా రాబోతోంది.
దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో..
ఈ వినూత్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
సంగీత దర్శకుడిగా వందలాది హిట్లకు కారణమైన దేవిశ్రీ ప్రసాద్, ఇప్పుడు నటుడిగా ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలని ఆయన అభిమానులు, టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.