...
...
Next Story

Devi Sri Prasad: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా బా బా బ్లాక్ షీప్.. ఆజా మేరీ జాని సాంగ్ రిలీజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్

Devi Sri Prasad Released Baa Baa Black Sheep Song: తెలుగులో న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా వస్తున్న సినిమా బా బా బ్లాక్ షీప్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ఆజా మేరీ జాని పాటను మ్యూజిక్ డైరెక్టర్, ఎల్లమ్మ హీరో దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ఆ విశేషాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 15, 2026, 14:47:42 IST
Advertisement

Devi Sri Prasad Released Baa Baa Black Sheep Song: అనుకోకుండా జ‌రిగే ఓ ఘ‌ట‌న కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌తో పాటు మ‌న చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనూ అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టానికి కార‌ణ‌మ‌వుతాయి. అలాంటి ఓ వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ సినిమానే ‘బా బా బ్లాక్ షీప్’.

బా బా బ్లాక్ షీప్ నటీనటులు

న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా బా బా బ్లాక్ షీప్.. ఆజా మేరీ జాని సాంగ్ రిలీజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్
న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా బా బా బ్లాక్ షీప్.. ఆజా మేరీ జాని సాంగ్ రిలీజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్

దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తొలి దక్షిణాది సినిమా

మేఘాల‌య రాష్ట్రంలో పూర్తిగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న తొలి ద‌క్షిణాది సినిమా ఇదే కావ‌టం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ బా బా బ్లాక్ షీప్ సినిమా టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. బా బా బ్లాక్ షీప్ టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే సినిమాలో పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ అవెలా ప్ర‌వ‌ర్తిస్తాయ‌నే విష‌యాన్ని రివీల్ చేశారు. సినిమా క‌థ‌నంలో ఓ వేగం క‌నిపిస్తూనే ఎంట‌ర్‌టైనింగ్‌గానూ సినిమా ఉంటుంద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతుంది.

దసరా సందర్భంగా థియేట్రికల్ రిలీజ్

ఈ నేప‌థ్యంలో .. తాజాగా మేక‌ర్స్ బా బా బ్లాక్ షీప్ సినిమాను ద‌స‌రా సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ రిలీజ్ చేయ‌టం విశేషం. సాంగ్ యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంద‌ని, డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని దేవిశ్రీ ప్ర‌సాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు.

ఆజా మేరీ జాని సాంగ్ విశేషాలు

ఈ సంద‌ర్భంగా.. చిత్ర నిర్మాత‌ వేణు దోనేపూడి మాట్లాడుతూ.. "ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చుట్టూ కాన్సెప్ట్‌తో రూపొందిన బా బా బ్లాక్ షీప్ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 9న సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం" అని అన్నారు.

చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో

"మేఘాల‌య రాష్ట్రంలో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిగా కంప్లీట్ చేసిన తొలి ద‌క్షిణాది సినిమా ఇది. ముఖ్యంగా చిరపుంజి వంటి అద్భుత‌మైన లొకేష‌న్స్‌లోనూ చిత్రీక‌రించాం. ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. మా డైరెక్ట‌ర్ గుణి, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హా ఎంటైర్ టీమ్‌ స‌హకారంతో ఇది సాధ్య‌మైంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని అప్‌డేట్స్‌ను అందిస్తాం" అని ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks