Shraddha Das Dhai Chaal OTT Streaming With 50 Episodes: ఓటీటీ వేదికలపై పొలిటికల్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'మహారాణి', 'తాండవ్' వంటి ఓటీటీ సిరీస్‌ల బాటలో ఇప్పుడు మరో భారీ రాజకీయ కథనం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
2 నవలల ఆధారంగా వెబ్ సిరీస్

ప్రముఖ రచయిత నవీన్ చౌదరి కలం నుంచి జాలువారిన 'జనతా స్టోర్', 'ధాయి చాల్' అనే రెండు బెస్ట్ సెల్లర్ నవలల ఆధారంగా 'ధాయి చాల్' (Dhai Chaal) ఓటీటీ సిరీస్ రూపుదిద్దుకుంది. ఏకంగా 50 ఎపిసోడ్ల సుదీర్ఘ నిడివితో వస్తున్న ఈ సిరీస్ రాజకీయాల్లోని చీకటి కోణాలను, అధికార దాహాన్ని కళ్లకు కట్టనుంది.
తెలుగు ప్రేక్షకులకు 'లీడర్', 'ప్రస్థానం' వంటి విలువలు, కుట్రలతో కూడిన రాజకీయ చిత్రాలంటే ఎంతో ఆసక్తి. సరిగ్గా అదే తరహాలో, ఒక సామాన్య విద్యార్థి నాయకుడు రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయ చదరంగంలో ఎలా పావుగా మారాడు, ఆ తర్వాత ఎలా చక్రం తిప్పాడనే ఆసక్తికర కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది.
50 ఎపిసోడ్లతో ఓటీటీ సిరీస్
నవీన్ చౌదరి రాసిన ఈ రెండు పుస్తకాలు పాఠకుల ఆదరణ పొంది బెస్ట్ సెల్లర్ జాబితాలో నిలిచాయి. ఇప్పుడు ఆ నవలల్లోని పాత్రలకు దృశ్యరూపం ఇచ్చారు మేకర్స్. మొత్తం 50 ఎపిసోడ్ల ఈ సిరీస్‌ను రెండు భాగాలుగా ఓటీటీలోకి తీసుకురానున్నారు. తొలి సీజన్‌లోని 24 ఎపిసోడ్లను 'జనతా స్టోర్' నవల ఆధారంగా తీర్చిదిద్దారు.
క్యాంపస్ రాజకీయాలతో తొలి సీజన్..
రాజస్థాన్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగే విద్యార్థి రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మన దగ్గర ఉస్మానియా, ఆంధ్రా విశ్వవిద్యాలయాల్లో ఒకప్పుడు కనిపించినట్లుగానే, కాలేజీ ఎన్నికల్లో విద్యార్థి నాయకుల మధ్య జరిగే ఆధిపత్య పోరు, ఉద్యమాలు, సిద్ధాంతాల ఘర్షణలను ఇందులో సహజంగా చూపించారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం యువ నాయకులను ఎలా వాడుకుంటాయో తొలి సీజన్ స్పష్టం చేస్తుంది.
ఢిల్లీ స్థాయి ఎత్తుగడలతో రెండో భాగం..
{{/usCountry}}రాజస్థాన్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగే విద్యార్థి రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మన దగ్గర ఉస్మానియా, ఆంధ్రా విశ్వవిద్యాలయాల్లో ఒకప్పుడు కనిపించినట్లుగానే, కాలేజీ ఎన్నికల్లో విద్యార్థి నాయకుల మధ్య జరిగే ఆధిపత్య పోరు, ఉద్యమాలు, సిద్ధాంతాల ఘర్షణలను ఇందులో సహజంగా చూపించారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం యువ నాయకులను ఎలా వాడుకుంటాయో తొలి సీజన్ స్పష్టం చేస్తుంది.
ఢిల్లీ స్థాయి ఎత్తుగడలతో రెండో భాగం..
{{/usCountry}}రెండో సీజన్‌లోని 26 ఎపిసోడ్లను 'ధాయి చాల్' నవల ఆధారంగా రూపొందించారు. ఇక్కడ కథ యూనివర్సిటీ క్యాంపస్ దాటి రాష్ట్ర, జాతీయ రాజకీయాల స్థాయికి చేరుతుంది. ఎన్నికల వ్యూహాలు, పార్టీల మధ్య పొత్తులు, తెరవెనుక మీడియా పోషించే కీలక పాత్ర, అధికారం కోసం జరిగే కుమ్ములాటలను రెండో సీజన్‌లో ఉత్కంఠభరితంగా మలిచారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, కేవలం అవసరాలు, పరిస్థితుల బట్టే బంధాలు మారుతుంటాయనే నగ్న సత్యాన్ని ఈ కథ మరోసారి ఆవిష్కరిస్తుంది. ఈ భారీ ప్రాజెక్టుకు బాలీవుడ్ ప్రముఖ రచయిత రితేష్ షా షో క్రియేటర్‌గా, రచయితగా వ్యవహరించారు.
'పింక్' రచయిత సారథ్యం.. తెలుగు హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎంట్రీ
గతంలో 'పింక్', 'ఎయిర్‌లిఫ్ట్', 'కహానీ' వంటి ఆలోచింపజేసే చిత్రాలకు రచన చేసిన రితేష్ షా ఈ సిరీస్‌కు బలమైన స్క్రీన్‌ప్లే అందించారు. సతీష్ కుంకుమ్‌నాథ్ నాయర్, నవ్ నిర్మాణ్ సింగ్ దర్శకత్వం వహించగా, ఫోకస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై భూషణ్ సూరి, రితేష్ షా, పార్థ్ సూరి ఈ సిరీస్‌ను నిర్మించారు.
ఇక నటీనటుల విషయానికొస్తే గగన్ అరోరా, ఆదిల్ జాఫర్ ఖాన్, అంకిత్ సివాచ్, అంజలి తత్రారి ప్రధాన పాత్రల్లో నటించారు. తొలి సీజన్‌లో రాజేష్ కుమార్, పరితోష్ సాండ్, రిషికా లోక్రే కీలక పాత్రలు పోషించగా, రెండో సీజన్‌లో తెలుగు గ్లామర్ హీరోయిన్ శ్రద్ధా దాస్, మీర్ సర్వర్, కామాక్షి భట్, హేతల్ గడా కొత్త పాత్రలతో కథలోకి ప్రవేశిస్తారు.
ధాయి చాల్ ఓటీటీ స్ట్రీమింగ్
రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు ఎలా ఉంటాయో చూడాలనుకునే వారికి ఈ ఓటీటీ సిరీస్ మంచి విందు కానుంది. నవంబర్ 27 నుంచి 'జియోహాట్‌స్టార్' (JioHotstar)లో ధాయి చాల్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.