...
...
Next Story

నా నిర్మాతకు భారం కాకూడదనుకున్నా, శివాజీ వచ్చాకే సక్రమంగా కుదిరాయి.. దండోరా డైరెక్టర్ మురళీకాంత్ కామెంట్స్

డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సినిమా దండోరా. ఈ సినిమాలో శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ తదితరులు నటనతో మెప్పించారు. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు నిర్వహించిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Dec 30, 2025, 14:20:58 IST
Advertisement

కలర్ ఫొటో, బెదురులంక 2012 సినిమాల బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ దండోరా. బిగ్ బాస్ శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ నటనతో మెప్పించిన దండోరా మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు.

సామాజిక అసమానతలపై

నా నిర్మాతకు భారం కాకూడదనుకున్నా, శివాజీ వచ్చాకే సక్రమంగా కుదిరాయి.. దండోరా డైరెక్టర్ మురళీకాంత్ కామెంట్స్
నా నిర్మాతకు భారం కాకూడదనుకున్నా, శివాజీ వచ్చాకే సక్రమంగా కుదిరాయి.. దండోరా డైరెక్టర్ మురళీకాంత్ కామెంట్స్

అయితే, డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన దండోరా మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. రూరల్ నెటివిటీతో సామాజిక అసమానతలపై ఆకట్టుకునే విధంగా దండోరా మలిచారంటూ ప్రశంసలు వస్తున్నాయి. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు నిర్వహించిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మురళీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అనిల్ రావిపూడి నిరూపించారు

దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ .. "మంచి సినిమాల్ని తీస్తే థియేటర్లకు జనాలు వస్తారని నిరూపిస్తున్న అనిల్ రావిపూడి గారికి థాంక్స్. ఈ రోజు ఆయన మా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. నేను ఇక్కడకు సినిమా తీయాలని వచ్చాను. మూవీ తీశాను. నా దృష్టిలో నేను విజయం సాధించేశాను" అని అన్నారు.

సగం కథ వినగానే

"బెన్నీ గారికి నేను చెప్పిన కథ నచ్చింది. నా ఐడియాలజీ నా నిర్మాతకు భారం కాకూడదని అనుకున్నాను. సగం కథ వినే శివాజీ గారు ఈ మూవీని ఒప్పుకున్నారు. ఆయన వచ్చాకే అన్నీ సక్రమంగా సమకూరుతూ వెళ్లాయి. ఈ చిత్రంలోకి చివరగా బిందు గారు వచ్చారు. నాకు సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్" అని మురళీకాంత్ తెలిపారు.

చూసిన వారంత బాగుందన్నారు

నటుడు రవికృష్ణ మాట్లాడుతూ .. "‘దండోరా’ నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. ఇందులో నేను ఓ పాటలో డ్యాన్స్ చేశాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన మురళీ గారికి థాంక్స్. ఇలాంటి చిత్రాల్ని నిర్మించాలంటే నిర్మాతలకు చాలా గట్స్ ఉండాలి. బెన్నీ గారు ఇలాంటి చిత్రాలెన్నో నిర్మించాలని కోరుకుంటున్నాను. మార్క్ కె రాబిన్‌ సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది. ‘దండోరా’ టీంతో పని చేయడం ఆనందంగా ఉంది" అని అన్నాడు.

40 రోజుల్లోనే పూర్తి చేయడం

డీఓపీ వెంకట్ ఆర్. శాకమూరి మాట్లాడుతూ .. "దండోరా అద్భుతమైన కథ. మురళీకాంత్ చాలా గొప్ప కథను రాసుకున్నారు. ఇలాంటి చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు బెన్నీ గారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చాలా తక్కువ టైమ్ అంటే 40 రోజుల్లో ఈ మూవీని ఫినిష్ చేయడం అన్నది మా అందరికీ పెద్ద టాస్క్‌లా అనిపించింది. అందరి సహకారంతో షూటింగ్ చాలా సజావుగా సాగింది" అని అన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks