...
...
Next Story

ఇవాళ ఓటీటీలోకి వచ్చిన శివాజీ దండోరా మూవీ-20 రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్

హీరోయిన్ల దుస్తులపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడంతో ఇటీవల వార్తల్లో నిలిచారు సీనియర్ నటుడు శివాజీ. ఆయన కీలక పాత్ర పోషించిన దండోరా మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే శివాజీ ఆ వివాదాస్పద కామెంట్లు చేశారు.

Published on: Jan 14, 2026, 08:43:04 IST
Advertisement

సంక్రాంతి 2026 స్పెషల్ గా ఓటీటీలోకి లేటెస్ట్ మూవీ దండోరా వచ్చింది. సీనియర్ నటుడు శివాజీ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఇవాళ (జనవరి 14) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. పొంగల్ పండగ సందర్భంగా ఈ సినిమాను ముందుగానే ఓటీటీలోకి తీసుకొచ్చారు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.

దండోరా ఓటీటీ

ఓటీటీలోకి దండోరా (x)
ఓటీటీలోకి దండోరా (x)

రీసెంట్ గా హీరోయిన్ల దుస్తులపై అసభ్యకర కామెంట్లతో శివాజీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే శివాజీ ఈ కామెంట్లు చేశారు. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం డిజిటల్ స్ట్రీమింగ్ లోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీని చూడొచ్చు.

20 రోజుల్లో ఓటీటీలోకి

థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లో దండోరా మూవీ ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇందులో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి, మనికా చిక్కాల, రాధ్య, అదితి భావరాజు తదితరులు నటించారు. దీనికి మురళీకాంత్ డైరెక్టర్.

శివాజీ తన యాక్టింగ్ సెకండ్ ఇన్నింగ్స్ లో జనాలను హత్తుకునే పాత్రలతో పాటు పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేస్తున్నారు. ఈటీవీ విన్ లో వచ్చిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ లో టీచర్, తండ్రిగా గొప్పగా నటించారు. ఆ తర్వాత కోర్టు సినిమాలో మంగపతిగా విలనిజం చూపించారు. ఇప్పుడు దండోరాలోనూ మరోసారి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు.

దండోరా కథ

అయితే, కొన్ని కారణాల వల్ల శివాజీ చనిపోతాడు. అతని శవాన్ని ఊరి శ్మశానంలో ఖననం చేసేందుకు కుల పెద్దలు ఒప్పుకోరు. దాంతో ఊరి జనం మధ్య గొడవ మొదలవుతుంది.

అసలు శివాజీని తన కులమే ఎందుకు బహిష్కరించింది? అతడి గతమేంటీ? ఆ ఊరి సర్పంచ్ (నవదీప్) ఈ విషయంలో ఏం చేశారు? శివాజీ కొడుకు విష్ణు అతనితో ఏళ్లుగా ఎందుకు మాట్లాడలేదు? వేశ్య శ్రీలత (బిందు మాధవి)కి శివాజీకి ఉన్న సంబంధం ఏంటీ? అనేది తెలియాలంటే దండోరా చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks