ధురంధర్ 2 మేనియా నెక్ట్స్ లెవల్. రిలీజ్ కంటే ముందే ధురంధర్ 2 రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ తోనే ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించేలా కనిపిస్తోంది. ఇప్పటివరకూ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ తో ధురంధర్ 2 రూ.60 కోట్లు ఖాతాలో వేసుకుంది.
ధురంధర్ 2 జోరు

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2. బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు ఇండియాలో టికెట్ బుకింగ్స్ ప్రారంభమైంది. మార్చి 13 ఉదయం వరకు ఇండియాలోనే ధురంధర్ 2 ప్రీమియర్ షో కోసం ఏకంగా 4.7 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.
ఓజీ రికార్డు
ఇండియాలో ధురంధర్ 2 ప్రీమియర్ షోల కోసం ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 4.7 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి అంటే మూవీకి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ టికెట్ల అమ్మకాల ద్వారా కేవలం ఇండియాలోనే రూ.24.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. గతేడాది పవన్ కల్యాణ్ మూవీ ఓజీ ప్రీమియర్స్ రికార్డు (రూ.25 కోట్లు)ను ధురంధర్ 2 అందుకునేలా కనిపిస్తోంది.
ఓవర్సీస్ లో
విదేశాల్లో ధురంధర్ 2 ప్రీమియర్ షోలతో పాటు మిగతా రెగ్యులర్ షోలకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ య్యాయి. దీంతో అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఈ మూవీ డామినెన్స్ మూమూలుగా లేదు. ఈ చిత్రం ఇప్పటికే అమెరికా, కెనడాలో కలెక్షన్ రికార్డులను బద్దలు కొడుతోంది. నార్త్ అమెరికాలో ఫస్ట్ వీకెండ్ లోనే 3 మిలియన్ డాలర్ల మార్క్ ను చేరేందుకు ధురంధర్ 2 రంగం సిద్ధం చేసుకుంది.
రూ.60 కోట్లు
నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కోసం టికెట్ల సేల్స్ 1 మిలియన్ డాలర్లకు దగ్గరలో ఉంది. యూరప్, ఆసియా, ఓషియానియాలోని ఇతర ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్ 1 మిలియన్ డాలర్ల వైపు దూసుకెళ్తోంది. దీంతో ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని ఓవరాల్ గా ఈ సినిమా రూ.60 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్‌ను అందుకుంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో రూ.100 కోట్ల మార్కును సులభంగా దాటుతుందని ట్రేడ్ అనలిస్ట్ లు చెబుతున్నారు.
ధురంధర్ గురించి
{{/usCountry}}నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కోసం టికెట్ల సేల్స్ 1 మిలియన్ డాలర్లకు దగ్గరలో ఉంది. యూరప్, ఆసియా, ఓషియానియాలోని ఇతర ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్ 1 మిలియన్ డాలర్ల వైపు దూసుకెళ్తోంది. దీంతో ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని ఓవరాల్ గా ఈ సినిమా రూ.60 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్‌ను అందుకుంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో రూ.100 కోట్ల మార్కును సులభంగా దాటుతుందని ట్రేడ్ అనలిస్ట్ లు చెబుతున్నారు.
ధురంధర్ గురించి
{{/usCountry}}డిసెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైన ధురంధర్ మూవీ బాక్సాఫీస్ సెన్సేషన్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ధురంధర్ 2 రిలీజ్ కు ముందు ధురంధర్ మూవీని రీ రిలీజ్ చేశారు. మార్చి 12న ప్రపంచవ్యాప్తంగా 500 స్క్రీన్స్ లో ధురంధర్ రీ రిలీజ్ అయింది.