రీసెంట్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసి, రికార్డులు బ్రేక్ చేసిన మూవీ ధురంధర్. ఈ హిందీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. అయితే ఈ మూవీని హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు.
ధురంధర్ సీక్వెల్

ధురంధర్ మూవీకి సీక్వెల్ గా ‘ధురంధర్ ది రివేంజ్’ రాబోతుంది. మార్చి 19, 2026న ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఇటీవల రిలీజ్ డేట్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ సీక్వెల్ నుంచి కొత్త పోస్టర్ తో మేకర్స్ ధురంధర్ 2 మార్చి 19నే రిలీజ్ అవుతుందని కన్ఫామ్ చేశారు.
తెలుగులోనూ రిలీజ్
స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ధురంధర్ కేవలం హిందీలోనే రిలీజైంది. అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే ధురంధర్ మూవీని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ అదేం జరగలేదు. ఓటీటీలోకి మాత్రం తెలుగులోనూ వచ్చింది ధురంధర్.
ఇప్పుడు ధురంధర్ విషయంలో చేసిన తప్పును ధురంధర్ సీక్వెల్ లో మేకర్స్ చేయాలనుకోవడం లేదు. ధురంధర్ కు వచ్చిన అద్భుతమైన క్రేజ్ కారణంగా ధురంధర్ 2ను హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
చెడిపోవడానికి సమయం
‘‘చెడిపోవడానికి సమయం వచ్చింది. ధురంధర్ ది రివేంజ్. ఈ రోజు 12:12 కు టీజర్. ధురంధర్ ది రివేంజ్ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతుంది’’ అని జియో స్టూడియోస్ ఎక్స్ లో తెలుగు టైటిల్ తో కూడిన పోస్టర్ పంచుకుంది.
{{/usCountry}}‘‘చెడిపోవడానికి సమయం వచ్చింది. ధురంధర్ ది రివేంజ్. ఈ రోజు 12:12 కు టీజర్. ధురంధర్ ది రివేంజ్ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతుంది’’ అని జియో స్టూడియోస్ ఎక్స్ లో తెలుగు టైటిల్ తో కూడిన పోస్టర్ పంచుకుంది.
{{/usCountry}}ధురంధర్ గురించి
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఇందులో రణ్ వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, సారా అర్జున్ తదితరులు నటించారు. డిసెంబర్ 5, 2025న ఈ మూవీ రిలీజ్ అయింది. ఇందులో పాకిస్థాన్ లో గూఢచార్యం చేసే స్పైగా రణ్ వీర్ సింగ్ నటించాడు.
ధురంధర్ ఓటీటీ
బాక్సాఫీస్ ను షేక్ చేసిన ధురంధర్ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ మూవీ జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను ఈ సినిమా దాటేసింది. తెలుగులోనూ ఓటీటీలో అందుబాటులో ఉంది.