బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’. థియేటర్లలో అదరగొడుతున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని డిజిటల్ స్ట్రీమింగ్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ధురంధర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మారిందని తెలిసింది.
ధురంధర్ 2 ఓటీటీ

ధురంధర్ 2 సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ధురంధర్ మూవీ పార్ట్ 1 ఈ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ధురంధర్ 2 మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లోకి రావడం లేదన్నది తాజా సమాచారం. ఈ మూవీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ మారిందని టాక్.
జియోహాట్‌స్టార్‌లో
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. థియేటర్లలో ఈ చిత్రం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నేపథ్యంలో, దాని ఓటీటీ విడుదలపై ఆసక్తి పెరుగుతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం జియోహాట్‌స్టార్‌లో రిలీజ్ కాబోతుందని బాలీవుడ్ హంగామా, పింక్‌విల్లా రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఓటీటీలో ఎప్పుడు?
ధురంధర్ 2 మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో కాదు జియోహాట్‌స్టార్‌లో రిలీజ్ కానుందని తెలిసింది. అయితే ఓటీటీ రిలీజ్ కూడా లేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు రెండు కారణాలున్నాయని అంటున్నారు. ఒకటేమో ఈ సినిమా అద్భుతమైన థియేట్రికల్ రన్ కాగా.. రెండోది ఐపీఎల్ 2026.
మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 మూవీ ఇప్పటికీ థియేటర్లలో బాగా ఆడుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు ఐపీఎల్ 2026కు జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మే చివరి వారంలో లేదా జూన్ ప్రారంభంలో మూవీ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రావచ్చు.
డబుల్ రేట్
{{/usCountry}}మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 మూవీ ఇప్పటికీ థియేటర్లలో బాగా ఆడుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు ఐపీఎల్ 2026కు జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మే చివరి వారంలో లేదా జూన్ ప్రారంభంలో మూవీ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రావచ్చు.
డబుల్ రేట్
{{/usCountry}}ధురంధర్ 2 సినిమా ఓటీటీ రైట్స్ కోసం అదిరే రేట్ పలికినట్లు సమాచారం. ఈ మూవీ డిజిటల్ హక్కులను రూ.150 కోట్లకు జియోహాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ధురంధర్ పార్ట్ 1 ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ గతంలో రూ.85 కోట్లు చెల్లించింది.
“ఫస్ట్ పార్ట్ రిలీజ్ కావడానికి ముందే ధురంధర్ రెండు భాగాల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.175 కోట్ల డీల్ చేయాలనుకుంది. కానీ అప్పుడు జియోస్టూడియోస్ ఫస్ట్ పార్ట్ కు మాత్రమే ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు రెండో పార్ట్ కు రూ.150 కోట్ల రేట్ పలికింది’’ అని ఓ సోర్స్ చెప్పినట్లు సమాచారం.